E-Paper
Advertisement

First 1 Crore Corpus: కేవలం రూ.6000తో రూ.కోటి సంపాదన.. SIP ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇలా!

First 1 Crore Corpus:  కేవలం రూ.6000తో రూ.కోటి సంపాదన.. SIP ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇలా!
Advertisement

First 1 Crore Corpus: రూ.కోటి సంపాదించాలనేది చాలా మంది కల. ఈ కలను సాధించేందుకు మ్యూచువల్ ఫండ్స్ SIPలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు 12 శాతం రిటర్న్స్ ఇచ్చే ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి. నెక్ట్స్ 10 సంవత్సరాల్లో మీరు రూ.కోటి సంపాదించాలనుకుంటే.. నెలకు రూ.45 వేలు ఇన్వెస్ట్ చేయాలి. పదేళ్లు తక్కువ టైం అనుకుంటే.. ఇన్వె్స్ట్మెంట్ కాలాన్ని 15 సంవత్సరాలకు పెంచుకోవచ్చు. దీంట్లో మీరు నెలకు రూ.22 వేలు ఇన్వెస్ట్ చేయాలి. ఐదేళ్ల టెన్యూర్ పెంచుకుంటే.. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ సుమారు 50 శాతం తగ్గుతుంది.

SIP ద్వారా రూ.1 కోటి ఎలా సంపాదించాలి?

  • 10 సంవత్సరాల పాటు నెలకు రూ.45,000 SIP చేస్తే
  • మొత్తం పెట్టుబడి కాలం: 10 సంవత్సరాలు
  • నెలవారీ పెట్టుబడి (SIP): రూ.45,000
  • వార్షిక రాబడి: 12%
  • పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ.45,000 x 12 నెలలు x 10 సంవత్సరాలు = రూ.54,00,000
  • మెచ్యూరిటీ మొత్తం: రూ.1,03,28,321

మీరు 25 ఏళ్ల వయస్సులో పెట్టుబడి పెడితే మీకు 35 సంవత్సరాలు వచ్చేసరికి మీ దగ్గర రూ.1 కోటి కంటే ఎక్కువ అమౌంట్ ఉంటుంది.

15 సంవత్సరాల పాటు నెలకు రూ.20,000 SIP చేస్తే

  • మొత్తం పెట్టుబడి కాలం : 15 సంవత్సరాలు
  • నెలవారీ పెట్టుబడి (SIP): రూ.20,000
  • వార్షిక రాబడి: 12%
  • పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ.20,000 x 12 నెలలు x 15 సంవత్సరాలు = రూ.36,00,000
  • అంచనా వేసిన మెచ్యూరిటీ మొత్తం: రూ.1,00,91,520
Advertisement

అదే మీరు 20 లేదా 25 సంవత్సరాల్లో కోటి రూపాయలు సంపాదించాలంటే ఏం చేయాలో చూద్దాం. 20 ఏళ్ల పాటు నెలకు రూ.22,000 పెట్టుబడి పెడితే మీ టార్గెట్ రూ.కోటి రీచ్ అవ్వవచ్చు. అదే 25 సంవత్సరాలలో కోటి రూపాయలు రీచ్ అవ్వాలనుకుంటే నెలకు కేవలం రూ.6,000 పెట్టుబడి పెట్టాలి. కాబట్టి మీ లక్ష్యాన్ని నిర్ణయించుకుని అందుకు తగ్గట్టు ప్రతి నెలా పెట్టుబడి పెట్టండి. ఎన్ని సంవత్సరాల్లో మీ మొదటి కోటి సంపాదించాలనుకుంటున్నారో అంచనా వేసుకుని పెట్టుబడి పెట్టండి.

20 సంవత్సరాల పాటు నెలకు రూ.12,000 చేస్తే

మొత్తం పెట్టుబడి కాలం: 20 ఏళ్లు
నెలవారీ పెట్టుబడి (SIP): రూ.12,000
వార్షిక రాబడి: 12%
పెట్టుబడి మొత్తం: రూ.12,000 x 12 నెలలు x 20 సంవత్సరాలు = రూ.28,80,000
మెచ్యూరిటీ మొత్తం: రూ.1,05,39,324

Advertisement

Also Read:  20 ఏళ్లు నెలకు రూ.15 వేలు పెట్టుబడి vs 15 ఏళ్లు నెలకు రూ.20 వేలు పెట్టుబడి.. ఎవరు ఎక్కువ లబ్ది పొందుతారంటే?

25 ఏళ్ల పాటు నెలకు రూ.6,000 SIP చేస్తే

  • మొత్తం పెట్టుబడి వ్యవధి: 25 సంవత్సరాలు
  • నెలవారీ పెట్టుబడి (SIP): రూ.6,000
  • వార్షిక రాబడి: 12%
  • పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ.6,000 x 12 నెలలు x 25 సంవత్సరాలు = రూ.18,00,000
  • మెచ్యూరిటీ మొత్తం: రూ.1,00,80,871
    మీరు 25 సంవత్సరాల వయస్సులో SIP ప్రారంభిస్తే, 50 ఏళ్లు వచ్చేసరికి రూ. కోటి కంటే ఎక్కువ అమౌంట్ మీ దగ్గర ఉంటుంది.

 

Disclaimer: మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. ఈ ఆర్టికల్ కేవలం సమాచారం కోసం మాత్రమే.

 

Related News

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

Big Stories

Advertisement
×