E-Paper
Advertisement

క్రెడిట్ కార్డు 50 రోజుల ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ .. కండీషన్ అప్లై!

క్రెడిట్ కార్డు 50 రోజుల ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ .. కండీషన్ అప్లై!
Advertisement

Credit Card Bill: ఇప్పుడు స్వైప్ చేయండి, తర్వాత చెల్లించండి, రివార్డులు, తగ్గింపులు అంటూ క్రెడిట్ కార్డులపై ఆఫర్లు ఇచ్చి మరీ ఖర్చు చేయిస్తారు. తీరా బిల్లు కట్టేటప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అనుకున్న సమయానికి అకౌంట్ లో డబ్బులు లేకపోయినా.., బిల్లు అమౌంట్ కాస్త తగ్గినా భారీగా ఛార్జీలు పడతాయి. ఒక్కోసారి కార్డుదారులు చిన్న మొత్తాలను చెల్లించకుండా వదిలేస్తుంటారు. కనీసం 100 రూపాయల బిల్లు కట్టకపోయినా.. చైన్ ఎఫెక్ట్ తో మీ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ ను తుడిచిపెట్టేస్తుంది. అసలు బ్యాంకులు వడ్డీని ఎలా లెక్కిస్తాయి.

ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్?

క్రెడిట్ కార్డులకు చాలా వరకు 50 రోజుల పాటు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది. పూర్తి బిల్లును ఇన్ టైమ్ లో చెల్లిస్తేనే ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అప్లై అవుతుంది. ఈ పీరియడ్ ను రెండు భాగాలుగా డివైడ్ చేస్తారు. మొదటి భాగం బిల్లింగ్ సైకిల్, మీరు ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పటి నుంచి 30 రోజులు వరకు ఉంటుంది. రెండో భాగం గ్రేస్ పీరియడ్, ఇది సుమారు 20 రోజులు ఉంటుంది. బిల్లు జనరేట్ అయిన తర్వాత బకాయిలు చెల్లించడానికి 20 రోజుల టైం ఇస్తారు.

Advertisement

ఉదాహరణకు, మీ బిల్లింగ్ సైకిల్ జనవరి 1 నుంచి జనవరి 31 వరకు.. బిల్లు డ్యూ డేట్ ఫిబ్రవరి 19. అంటే జనవరి 1న ఏదైనా కొనుగోలు చేస్తే ఆ బిల్లు చెల్లించడానికి మీకు దాదాపుగా 50 రోజుల టైం ఉంటుంది. జనవరి 31న కొనుగోలు చేస్తే 20 రోజుల టైం మాత్రమే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ పొందాలంటే డ్యూ డేట్ లోపు బిల్లు మొత్తం కట్టేయాలి. లేకపోతే వడ్డీ ఛార్జీలు విధిస్తారు.

క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం చెల్లించకపోతే ఏమవుతుంది?

క్రెడిట్ కార్డు బిల్లు పూర్తిగా చెల్లించకపోతే, దాని ఎఫెక్ట్ అనేక విధాలుగా ఉంటుంది. డ్యూ డేట్ నాటికి మీరు చెల్లించాల్సిన మొత్తం కంటే తక్కువ చెల్లిస్తే, ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ను క్యాన్సిల్ చేస్తారు. పెండింగ్ బ్యాలెన్స్ నెక్ట్స్ సైకిల్‌కు ట్రాన్స్ ఫర్ చేస్తారు. దీంతో పాటు వడ్డీ వేయడం స్టార్ట్ చేస్తారు. కానీ అది అక్కడితో ఆగదు. కొత్త కొనుగోళ్లకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ బెనిఫిట్స్ ఉండవు. లావాదేవీ జరిగిన రోజు నుంచే వడ్డీ పడుతుంది. దీనికి తోడు, లేట్ ఫీజు కూడా యాడ్ అవుతుంది.

Advertisement

ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు మొత్తం బిల్లు 50,100 రూపాయలు. మీరు 50 వేల రూపాయలు చెల్లించి, 100 రూపాయలు పెండింగ్ లో పెట్టారు. ఇది చాలా చిన్న మొత్తమే కదా అనుకున్నారు. కానీ బ్యాంకు దృష్టిలో, ఆ బిల్లు క్లియర్ కానట్లే. చెల్లించని ఆ చిన్న మొత్తం.. మీ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ను పూర్తిగా రద్దు చేస్తుంది. నెక్ట్స్ బిల్లింగ్ సైకిల్‌లో మరో 30,000 రూపాయలు ఖర్చు చేశారనుకుందాం. ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ లేకపోవడంతో డే 1 నుంచి మొత్తం 30,100 రూపాయలపై వడ్డీ పడుతుంది. 3.75 శాతం నెలవారీ వడ్డీ రేటుతో, ఫైనాన్స్ ఛార్జీ సుమారుగా 1,129 రూపాయలు అవుతుంది. దీనికి జీఎస్టీని కూడా కలిపితే, మొత్తం ఖర్చు దాదాపు 1332 రూపాయలు అవుతుంది. కాబట్టి, క్రెడిట్ కార్డు నుంచి టోటల్ బెనిఫిట్స్ పొందాలనుకుంటే, ప్రతిసారీ పూర్తి బిల్లును చెల్లించాలి.

Also Read:   క్రెడిట్ కార్డు ఖర్చులు కంట్రోల్ ఉంచే 6 టిప్స్

 

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×