E-Paper
Advertisement

థియేటర్లలో 170 కోట్లు కొల్లగొట్టిన నాని ఊచకోత… ఐదు భాషల్లో ఓటీటీలోకి

థియేటర్లలో 170 కోట్లు కొల్లగొట్టిన నాని ఊచకోత… ఐదు భాషల్లో ఓటీటీలోకి
Advertisement

The Paradise OTT: ఒక మనిషిని సమాజం ఎంత కాలం అణచివేయగలదు ? కనీస హక్కులు కూడా ఇవ్వకుండా, తరతరాలుగా అవమానిస్తూ ఉంటే ఆ ప్రజలు ఎప్పటికైనా తిరగబడరా ? తమకు జరిగిన అన్యాయానికి ఎదురు నిలబడి, తమ వాళ్లకు గౌరవంగా బతికే హక్కు కల్పించాలని ఓ వ్యక్తి పోరాటం మొదలు పెడితే పరిస్థితులు ఎలా మారతాయి ? ఇలాంటి సామాజిక సంఘర్షణకు భారీ యాక్షన్‌ను జోడించి తెరకెక్కించిన చిత్రమే నాని నటించిన ‘ది ప్యారడైజ్’ (The Paradise). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అణచివేతకు వ్యతిరేకంగా ఓ వ్యక్తి సాగించే పోరాటం హైలెట్ గా ఉంటుంది. ఇప్పటికే థియేటర్లలో రచ్చ చేసిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ హిట్ మూవీని మూవీ లవర్స్ ఎక్కడ చూడొచ్చు ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

1980ల నాటి సికింద్రాబాద్‌ లోని ఓ మురికివాడ నేపథ్యంలో కథ సాగుతుంది. అక్కడ సవారీ అనే అణగారిన సంచార సమాజానికి చెందిన ప్రజలు నివసిస్తుంటారు. స్వాతంత్య్రం వచ్చినా వారి జీవితాల్లో మాత్రం ఆశించిన మార్పు కనిపించదు. కనీస గుర్తింపు, ఓటు హక్కు వంటి హక్కులు కూడా లేకుండా వివక్షను ఎదుర్కొంటుంటారు. మరోవైపు, శికంజా మాలిక్ అనే భూస్వామి తన అధికారాన్ని ఉపయోగించుకుంటూ ఆ ప్రజలను తన అదుపులో ఉంచాలని చూస్తుంటాడు. అతడి కొడుకు విక్రమ్ మాలిక్ కూడా ఈ ఆధిపత్యంలో కీలకంగా ఉంటాడు. దీంతో ఆ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛగా బతకడం కూడా కష్టంగా మారుతుంది.

Advertisement

ఇలాంటి పరిస్థితుల్లో సమ్మక్క కొడుకు జడల్ కీలక పాత్రగా ఎదుగుతాడు. అతనికి ప్రజల కష్టాలు తెలుసు. వాళ్లకు జరుగుతున్న అన్యాయాలపై తీవ్ర ఆగ్రహం ఉంటుంది. జైలు నుంచి తిరిగొచ్చిన జడల్ తన వాళ్ల జీవితాల్లో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. తరతరాలుగా అవమానాలు భరిస్తూ వచ్చిన ప్రజలు ఇకపై తలవంచి బతకకూడదని భావిస్తాడు. వారి హక్కులు, గౌరవం కోసం పోరాటం మొదలుపెడతాడు.

అయితే జడల్ ప్రయాణం అంత సులభంగా సాగదు. అతడికి అధికార బలం, డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న శత్రువులతో ఫైట్ నడుస్తుంది. తమ ఆధిపత్యానికి ఎదురు తిరిగిన జడల్‌ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. దీంతో వ్యక్తిగతంగా మొదలైన పోరాటం క్రమంగా ఓ సమాజం భవిష్యత్తుకు సంబంధించిన ఉద్యమంగా మారుతుంది. తన ప్రజలను కాపాడుకోవడానికి జడల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు ? అతడి పోరాటం అణచివేతకు ముగింపు పలుకుతుందా ? అనేదే తెరపై చూసి తెలుసుకోవాల్సిన అంశం.

ఓటీటీలో 5 భాషల్లో స్ట్రీమింగ్

Advertisement

నాని ప్రధాన పాత్రలో నటించిన ‘ది ప్యారడైజ్’ అక్టోబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. యాక్షన్‌తో పాటు సామాజిక అసమానతలు, ప్రజల హక్కుల కోసం జరిగే పోరాటం, భావోద్వేగాలు కలిసిన కథలు ఇష్టపడేవారు ఈ సినిమాను చూడొచ్చు. నాని నటన, భారీ పోరాట సన్నివేశాలు, జడల్ పాత్ర ప్రయాణం కోసం ఈ చిత్రాన్ని మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయొచ్చు, డోంట్ మిస్.

Read Also: డేంజరస్ యాక్షన్ థ్రిల్లర్… ఈసారి రక్తపాతమే… ఓటీటీలోకి మోస్ట్ అవైటెడ్ సిరీస్

Tags

Related News

భార్య మిస్సయ్యిందని వెళ్తే పోలీసులకే దిమ్మతిరిగే షాక్… 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్ – శ్వేత బసు జంటగా నటించిన సిరీస్ స్ట్రీమింగ్

రామాయణ సినిమాకు హాట్ స్టార్ బిగ్ షాక్.. ఇంట్లో చూడాలన్న డబ్బులు కట్టాల్సిందే?

ఆ ఇంట్లో చిక్కుకుంటే ప్రాణాలు దక్కవు… ఒళ్లు గగుర్పొడిచే సర్వైవల్ థ్రిల్లర్

కూతురి జాడ వెతికితే షాకింగ్ ట్విస్ట్… మైండ్ బ్లాక్ చేసే మర్డర్ మిస్టరీ

బోల్డ్ అవతార్ లో కీర్తి సురేష్.. రాధిక ఇంటెన్స్ పర్ఫార్మెన్స్.. ‘అక్క’ ట్రైలర్ రిలీజ్!

డేంజరస్ యాక్షన్ థ్రిల్లర్… ఈసారి రక్తపాతమే… ఓటీటీలోకి మోస్ట్ అవైటెడ్ సిరీస్

సముద్రంలో సాహసం… బ్లాక్‌బస్టర్ యానిమేషన్ మూవీ రియల్ మనుషులతో… స్ట్రీమింగ్ తెలుగులోనే

Big Stories

Advertisement
×