GHMC Debt: రాష్ట్రంలోని సింహాభాగం జనాభా అవసరాలకు తగిన విధంగా అభివృద్ది, పౌర, అత్యవసర సేవలందిస్తున్న కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో విభిన్నమైన పరిస్థితులు నెలకున్నాయి. ముఖ్యంగా మూడు కార్పొరేషన్లలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న జీహెచ్ఎంసీ పరిస్థితి ఆర్ధికంగా కుదేలైంది. రాష్ట్ర రాజధాని నగరంతో కలిపి ఏర్పడిన ఒకే క్యూర్ సిటీ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో ఆర్థికంగా విభిన్నమైన పరిస్థితులు నెలకొనటం చర్చనీయాంశంగా మారింది. కానీ కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిధులు పుష్కలంగా ఉండగా, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితులను జీహెచ్ఎంసీతో పోల్చితే ఫర్వాలేదన్న విధంగా ఉంది.
గత గులాబీ పాలకుల హయాంలో చేసిన రూ. 6553 కోట్ల అప్పులను తీర్చేందుకు, అందుకు సంబంధించిన నెల మిత్తీ, అసలు చెల్లింపులతో పాటు సుమారు మూడున్నర వేల మంది పర్మినెంట్ ఉద్యోగులతో పాటు మరో 24 వేల పై చిలుకు ఔట్ సోర్స్, కాంట్రాక్టు కార్మికులకు జీతాలు, రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు జీహెచ్ఎంసీ అష్టకష్టాలు పడుతుంది. క్యూర్ సిటీ పరిధిలో జరిగిన అభివృద్దికి సంబంధించిన అప్పులను మూడు కార్పొరేషన్లకు పంచుతారన్న ధీమాతో ఉన్న జీహెచ్ఎంసీకి సర్కారు ఇటీవలే క్లారిటీ ఇచ్చింది. జీహెచ్ఎంసీ అప్పులు జీహెచ్ఎంసీయే చెల్లించాలని, అందుకు సర్కారు నుంచి ఆర్థిత సహాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు సర్కారు నుంచి అందిన ఆర్థిక సహాయం అంతంత మాత్రం కావటంతో ఆర్థికంగా జీహెచ్ఎంసీ పరిస్థితి మరింత వీక్ అవుతుంది.
గత సెప్టెంబర్ మాసం జీతాలు కూడా నిధుల్లేకపోవటంతో ఈ నెల 8వ తేదీన చెల్లించింది. నెలకు అసలు మిత్తీలతో కలిపి సుమారు రూ. 110 నుంచి రూ. 115 కోట్ల మధ్య కుస్తీలు చెల్లిస్తున్న జీహెచ్ఎంసీ మొత్తం అప్పుల్లో ఇప్పటి వరకు సగం వరకు రీ పేమెంట్ చేసినట్లు తెలిసింది. మిగిలిన సగం చెల్లించేందుకు సర్కారు భరోసా ఇచ్చిన ఆర్థిక సహాయం కోసం ఎదురచూస్తుంది. ఇక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేన్ లోని ఐటీ కారిడార్ తో పాటు అత్యంత విలువైన భూముల్లో నిర్మాణ అనుమతులు జారీ చేస్తూ కార్పొరేషన్ ఆర్థికంగా మిగులులో కొనసాగుతుంది. ఇక మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి జీహెచ్ఎంసీతో పోల్చితే ఫర్వాలేదన్నట్టుగా ఉంది. దీంతో ఆ రెండు కార్పొరేషన్లు అభివృద్ది పనులతో పాటు పౌర సేవలను మరింత మెరుగుగా నిర్వహించేందుకు వీలుగా కొత్త సంస్కరణలు తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలను సిద్దం చేస్తున్నట్లు తెలిసింది.
Also read: భారీగా పెరిగిన సోనా మసూరి, బీపీటీ బియ్యం ధరలు.. క్వింటల్ ఎంతో తెలుసా?
జీహెచ్ఎంసీలో కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు గానీ ప్రతి నెల ఉద్యోగులు, కార్మికులకు జీతాలు చెల్లించేందుకు కూడా అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రొటీన్ మెయింటనెన్స్ కూడా పడకేసిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో గత గులాబీ సర్కారు హయాంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నుంచి వాహనదారులకు ఉపశమనం కల్గించేందుకు అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ (ఎస్ఆర్ డీపీ) కింద ఏళ్ల క్రితం జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కు చుట్టూ సుమారు రూ. 1090 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన ఏడు అండర్ గ్రౌండ్ లు, ఏడు స్టీల్ ఫ్లై ఓవర్ల ఏర్పాటు ప్రతిపాదనను జీహెచ్ఎంసీ ఇటీవలే సవరించుకున్నసంగతి తెల్సిందే.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఎస్ఆర్ డీపీని కాస్త హెచ్ సిటీగా మార్చిన సంగతి తెల్సిందే. ఈ హెచ్ సిటీ పనుల కింద కేబీఆర్ పార్కు చుట్టు ఏర్పాటు చేయాల్సిన ఏడు అండర్ పాస్ లు, మరో ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లకు భూ సేకరణ కోసం నేరుగా కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రయత్నాలు చేసినా ఫలితంచకపోవటం, స్థలాల యజమానులు ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్స్ (టీడీఆర్)లకు స్థలాలిచ్చేందుకు అంగీకరించకపోవటంతో పాటు స్థల సేకరణకు ఏకంగా రూ. 800 కోట్లు వెచ్చించాల్సి ఉండగా, నిదుల్లేక జీహెచ్ఎంసీ ఆ ప్రతిపాదనను సవరించుకుంది. కానీ పంజాగుట్ట ఎన్ఎఫ్ సీఎల్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు ఆరు లేన్ల స్టీల్ ఫ్లై ఓవర్ గా జీహెచ్ఎంసీ సవరించింది. ఈ ప్రాజెక్టుకు కూడా స్థల సేకరణకు ఎంతో అంత చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లై ఓవర్ ను ప్రతిపాదించిన ప్రాంతాల్లో స్థల సేకరణ పెద్ద సమస్యగా మారే అవకాశమున్నా, నష్టపరిహారం చెల్లించేందుకు నిధుల్లేకనే కేబీఆర్ పార్కు చుట్టూ
చేసిన అప్పులు చెల్లించేందుకు జీహెచ్ఎంసీ అష్టకష్టాలు పడుతుంటే, మరో వైపు మిగిలిన రెండు కార్పొరేషన్లు సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లు మాత్రం భారీ ప్రాజెక్టులకు నిధుల కొరత ఏర్పడకుండా ముందు చూపుతో ఏకంగా రూ. 4500 కోట్లను రుణంగా సమకూర్చుకునేందుకు సిద్ధమయ్యాయి. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూ. 3 వేల కోట్లు, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ రూ. 1500 కోట్లు ముందస్తు రుణాలు తీసుకునేందుకు ఇప్పటికే ప్రతిపాదనలను తయారు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ రెండు కొత్త కార్పొరేషన్లు సొంత ఆఫీసు భవనాలను నిర్మించుకునేందుకు ఇప్పటికే సర్కారు స్థలాలు కేటాయించగా, ఆ భవనాల నిర్మాణానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తరాదన్న ఉద్దేశ్యంతోనే ఈ ముందస్తు రుణాలకు వెళ్లినట్లు తెలిసింది. ఈ రకంగా ఒక కార్పొరేషన్ చేసిన అప్పులను తీర్చేందుకు అష్టకష్టాలు పడుతుంటే, కొత్తగా ఏర్పడిన రెండు కార్పొరేషన్లు ముందస్తు రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
Also read: ఏపీ 22వ SIPB సమావేశంలో.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు?