E-Paper
Advertisement

Home Loan Repay: రూ.50 లక్షల హోన్ లోన్ పై రూ.20 లక్షలు ఆదా.. ఇలా ఈఎంఐ కడితే!

Home Loan Repay: రూ.50 లక్షల హోన్ లోన్ పై రూ.20 లక్షలు ఆదా.. ఇలా ఈఎంఐ కడితే!
Advertisement

Home Loan Repay: ఈ రోజుల్లో సొంతం ఇల్లు కట్టడమంటే లక్షలతో కూడుకున్న వ్యవహారం. అందుకే చాలా మంది హోమ్ లోన్ తీసుకుంటున్నారు. హోంలోన్ తీసుకుంటే.. 20-30 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. హోంలోన్ లో వడ్డీతోపాటు ఒత్తిడి పెరుగుతుంటుంది. అయితే ముందస్తుగా ప్లాన్ చేసుకుంటే హోంలోన్ చెల్లింపులపై వడ్డీని తగ్గించుకోవచ్చు.

ప్రీ పేమెంట్ ఆప్షన్

గృహ రుణాలపై అసలు కంటే వడ్డీ ఎక్కువ ఉంటుంది. లోన్ తిరిగి చెల్లించే ప్రారంభ సంవత్సరాల్లో .. ఈఎంఐలో ఎక్కువ శాతం వడ్డీకే వెళ్తుంది. దీంతో 20-30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఈఎంఐ కడుతూ ఉండాలి. ఆదాయం, వయస్సు, పెరుగుతున్న వడ్డీ రేట్లతో.. హోమ్ లోన్ భారంగా మారుతుంది. మనం తెలివిగా ప్లాన్ చేసుకుంటే.. హోంలోన్ భారాన్ని తగ్గించుకోవచ్చు. ప్రీ పేమెంట్ ఆప్షన్ తో ఆదా చేసుకోవచ్చు. మీరు సాధారణంగా చెల్లించాల్సిన ఈఎంఐ కంటే అదనంగా చెల్లించడం ద్వారా.. మీ డబ్బు ఆదా అవుతుంది. అలాగే ఐదేళ్ల లోన్ వ్యవధిని కూడా తగ్గించుకోవచ్చు.

Advertisement

Also Read: హోమ్ లోన్ తీసుకోవడానికి ఈ బ్యాంక్ బెస్ట్ ? ఈఎంఐ కూడా చాలా తక్కువ

ఆదా ఎలా అంటే?

మీరు రూ. 50 లక్షల హోమ్ లోన్ 25 ఏళ్లకు తీసుకున్నారు. దీనిపై వడ్డీ రేటు 8.5 శాతం. అంటే మొత్తం ఈఎంఐ రూ.40,261 పడుతుంది. మీరు పూర్తి లోన్ చెల్లించే నాటికి వడ్డీ రూపంలోనే రూ.70.78 లక్షలు కడతారు. అసలు, వడ్డీ కలుపుకుని సుమారుగా రూ.1.21 కోట్లు అవుతుంది. అసలు కంటే వడ్డీ దాదాపుగా రూ.21 లక్షలు ఎక్కువ. హోమ్ లోన్ ను రెండో సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఈఎంఐను పెంచుకుంటూ వెళ్లండి. ఏడాదికి 5-10% అదనంగా చెల్లిస్తే.. రూ. 50 లక్షల రుణంపై దాదాపు రూ. 18.31 లక్షల వరకు వడ్డీ ఆదా చేసుకోవచ్చు. అలాగే లోన్ కాలపరిమితి కూడా 5 సంవత్సరాలు వరకు తగ్గుతుంది. హోమ్ లోన్ ప్రారంభ సంవత్సరాల్లో ఈఎంఐ ఎక్కువగా కట్టడం వల్ల వడ్డీ భారం తగ్గుతుంది.

Related News

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి

Big Stories

Advertisement
×