E-Paper
Advertisement

Hyderabad HRA Hike: హైదరాబాద్ లో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. హెచ్ఆర్ఏ క్లెయిమ్ 50 శాతానికి పెంపు

Hyderabad HRA Hike: హైదరాబాద్ లో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. హెచ్ఆర్ఏ క్లెయిమ్ 50 శాతానికి పెంపు
Advertisement

Hyderabad HRA Hike: హైదరాబాద్ నగరం లక్షలాది మందికి ఉపాధి అందిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అద్దె ఇంట్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటారు. ఇలాంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం తాజాగా సూపర్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న వారికి ఇంటి అద్దెభత్యం (HRA) మినహాయింపు పరిమితిని 50 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 6 దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తుంది. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ నిబంధనలను నోటిఫై చేస్తూ గెజిట్‌ జారీ చేసింది.

హెచ్ఆర్ఏ 50 శాతం

ప్రధానంగా మెట్రో నగరాల్లో నివసిస్తు్న్న ఉద్యోగులకు పన్ను మినహాయింపు కలిగించేందుకు.. ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ లో హెచ్ఆర్ఏ 50 శాతం ఉంటుంది. తాజాగా ఈ నగరాల జాబితాలో హైదరాబాద్ చేరింది. గతంలో దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నైలను మాత్రమే మెట్రో నగరాలుగా పరిగణించేవారు. ఈ నగరాల్లో హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పరిమితిని 50 శాతంగా ఉంది. తాజాగా ఈ జాబితాలో హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌ పేర్లను కూడా చేర్చారు. మొత్తం 8 నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులు తమ జీతంలో 50 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.

Advertisement

Also Read: హెచ్ఆర్ఏ క్లెయిమ్ లో ఈ తప్పు చేస్తే 200% జరిమానా.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్

ఏప్రిల్ 1 నుంచి

మిగిలిన నగరాల్లోని వారికి 40 శాతం వరకు హెచ్ఆర్ఏ పన్ను కొనసాగుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే 2027 జులైలో ఫైల్‌ చేసే ఐటీ రిటర్స్ కు ఇది వర్తించనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రానున్న సంగతి తెలిసిందే. కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ చట్టంలో హెచ్ఆర్ఏ మినహాయింపుల కోసం మరికొన్ని మెట్రో నగరాలను 50 శాతం కేటగిరీలోకి చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×