E-Paper
Advertisement

ICICI Bank: న్యూఇయర్ నుంచి షాక్ తప్పదా? ఐసీఐసీఐలో కొత్త బాదుడు, రివార్డు పాయింట్ల విషయంలో

ICICI Bank: న్యూఇయర్ నుంచి షాక్ తప్పదా? ఐసీఐసీఐలో కొత్త బాదుడు, రివార్డు పాయింట్ల విషయంలో
Advertisement

ICICI Bank: వడ్డీ రేట్లు తగ్గడంతో బ్యాంకులు ఆలోచనలో పడ్డాయి. ఛార్జీల రూపంలో ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడ్డాయి. వడ్డీ రేట్లు తగ్గడంతో కస్టమర్లు బ్యాంకుల వైపు కన్నెత్తి చూడలేదు. కస్టమర్లు ఉపయోగిస్తున్న క్రెడిట్ కార్డులపై బాదుడు మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాయి. ఈ విషయంలో ఐసీఐసీఐ బ్యాంకు ముందు ఉందనే చెప్పాలి.

న్యూఇయర్ నుంచి ఐసీఐసీఐలో షాక్?

Advertisement

మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? కొత్త ఏడాది నుంచి జాగ్రత్త. ఛార్జీల రూపంలో వినియోగదారులపై బాదుడు మొదలు పెట్టనుంది ఐసీఐసీఐ బ్యాంకు. ఆన్ లైన్ గేమింగ్, యూపీఐ వ్యాలెట్ల్లో డబ్బులు జమ చేస్తే చార్జీ వసూలు చేయనుంది. ఈ విషయాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ స్వయంగా వెల్లడించింది.

Advertisement

కేవలం క్రెడిట్ కార్డ్ విషయంలో మార్పులు చేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు రివార్డు పాయింట్ల విషయంలో స్వల్పంగా మార్పులు చేసింది. 2026 ఏడాది జనవరి- ఫిబ్రవరి మధ్యలో ఆయా మార్పులను విడతల వారీగా అమలులోకి తీసుకురానుంది.  చాలామంది వినియోగదారులు ఆన్ లైన్ గేమింగ్ ప్లాట్ ఫారమ్‌ల్లో జరిపే క్రెడిట్ కార్డు లావాదేవీలపై 2 శాతం వడ్డించనుంది.

కస్టమర్లపై కొత్త బాదుడు, రివార్డు పాయింట్ల విషయంలో

అమెజాన్ పే, పేటీఎం వ్యాలెట్లలో 5 వేల కంటే ఎక్కువ డబ్బు లోడ్ చేస్తే ఒక శాతం ఛార్జీలు మోపనుంది. రూ. 50 వేలకు మించి చేసే ట్రావెల్ ఖర్చులపై అదనపు ఛార్జీలు ఒకశాతం వసూలు చేయనుంది. దీనికితోడు ఐసీఐసీఐ బ్రాంచ్ లలో క్రెడిట్ కార్డ్ బిల్లు నగదు రూపంలో చెల్లిస్తే రూ.150 అదనంగా సమర్పించుకోవాలి.

ఐసీఐసీఐ ఎమెరాల్డ్ మెటల్ క్రెడిట్ కార్డ్‌పై గతంలో గరిష్టంగా రివార్డు పాయింట్స్ పొందేవారు. ప్రభుత్వ సేవలు, ఫ్యూయెల్, రెంట్, పన్ను, వ్యాలెట్ లావాదేవీలపై రివార్డులు పూర్తిగా నిలిపి వేయనుంది. ఇది 2026 ఏడాది జనవరి 15 నుంచి అమల్లోకి రానుంది. రవాణా ఖర్చుల కోసం కార్డు ఉపయోగిస్తే నెలకు రూ. 20 వేల వరకు రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. యాడ్ ఆన్ కార్డు కోసం రూ.3,500 వసూలు చేయనుంది.

ALSO READ:  దూసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ షేర్లు, కారణమేంటో తెలుసా?

సినిమా ప్రయోజనాలు, యాడ్-ఆన్ కార్డ్ ఛార్జీలలో మార్పులు చేసింది. ఫిబ్రవరి 1, 2026 నుండి ICICI బ్యాంక్ ఇన్‌స్టంట్ ప్లాటినం కార్డులకు కాంప్లిమెంటరీ Book My Show ప్రయోజనాలు నిలిపివేయ బడతాయి. బుక్ మై షోలో ఒకటి కొంటే ఒకటి ఉచితం పొందాలంటే మూడు నెలల్లో కార్డుపై కనీసం రూ. 25 వేలు ఖర్చు చేయాలని షరతు విధించింది.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×