E-Paper
Advertisement

IRCTC Share Price: దూసుకెళ్తున్న IRCTC షేర్ ధర, కారణం ఏంటో తెలుసా?

IRCTC Share Price: దూసుకెళ్తున్న IRCTC షేర్ ధర, కారణం ఏంటో తెలుసా?

IRCTC Share Price Hike: IRCTC షేర్లు భారతీయ స్టాక్ మార్కెట్లలో లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఇవాళ ఉదయం 10:53 గంటలకు ఈ సంస్థ షేర్ వ్యాల్యూ రూ. 682.75గా ట్రేడవుతుంది. షేర్ వ్యాల్యూ రూ. 1.10 నుంచి 0.16 శాతం పెరిగింది. గత ఐదు సెషన్లలో ఈ స్టాక్ దాదాపు 2 శాతం లాభపడింది. కానీ, గత ఆరు నెలల్లో దాదాపు 10 శాతం తగ్గింది. ఫిబ్రవరి 25, 2026 నుంచి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగం నుంచి ఈ స్టాక్‌ను తొలగిస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకటించిన తర్వాత ప్రారంభ ట్రేడింగ్‌లో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) షేర్లు భారీగా పెరుగుతుండటం విశేషం.

స్టాక్స్ తొలగింపునకు కారణం ఏంటంటే?

డెరివేటివ్స్ ట్రేడింగ్ కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కఠినమైన అర్హత నిబంధనలను అనుసరిస్తూ.. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగం నుంచి IRCTC  స్టాక్స్ తొలగించాలని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిర్ణయించింది.    సవరించిన నియమాల ప్రకారం లిక్విడిటీ, సగటు రోజువారీ డెలివరీ విలువ నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. కానీ, IRCTC స్టాక్స్ అందుకు అనుగుణంగా లేకపోవడంతో తొలగింపు నిర్ణయం తీసుకుంది.

డిసెంబర్ 2025, జనవరి 2026, ఫిబ్రవరి 2026కి సంబంధించిన ప్రస్తుత F&O ఒప్పందాలకు సంబంధిత గడువు ముగిసే వరకు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయని ఎక్స్ఛేంజ్ స్పష్టం చేసింది. అయితే, ఈ ఒప్పందాలకు మించి కొత్త డెరివేటివ్ సిరీస్‌లు ప్రవేశపెట్టబడవని వెల్లడించింది. డెరివేటివ్స్ విభాగం నుంచి స్టాక్ చివరికి బయటికి వెళ్లే ముందు మార్కెట్ పాల్గొనేవారు తమ స్థానాలను సర్దుబాటు చేసుకోవడం లేదంటే నిలిపివేయడం వల్ల మార్కెట్ లో ఈ కంపెనీ షేర్స్ వ్యాల్యూ పెరగడం విశేషం.

ట్రేడర్స్ తెలుసుకోవాల్సిన  విషయాలు ఇవే! 

IRCTC F&O విభాగం నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత లివరేజ్ బేస్డ్ వ్యూహాలు ఇకపై సాధ్యం కావు. ఆప్షన్స్ ట్రేడింగ్ డిసప్పియరెన్స్ డెరివేటివ్స్ పాల్గొనేవారి నుంచి లిక్విడిటీని కూడా తగ్గిస్తుంది. నెమ్మదిగా ఇది ఇంట్రాడే అస్థిరతను తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ ఇది డెరివేటివ్స్ ట్రేడర్స్ సాధారణంగా కోరుకునే స్వల్పకాలిక ట్రేడింగ్ అవకాశాలను కూడా పరిమితం చేస్తుంది. క్యాష్ మార్కెట్లో, ఆన్‌ లైన్ రైల్వే టికెటింగ్, క్యాటరింగ్, టూరిజం సేవలలో IRCTC గుత్తాధిపత్యం కొనసాగిస్తోంది. కంపెనీకి ఎలాంటి రుణం లేదు. స్థిరమైన ఫైనాన్షియల్ ప్రొఫైల్‌ను కలిగి ఉంది. F&O విభాగం నుంచి తొలగింపు కంపెనీ ఫండమెంట్స్ మార్చదు. అయితే, ట్రెడర్స్, ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ స్టాక్‌ తో ఎంగేజ్ అయ్యే విధానాన్ని మారుస్తుంది.

Read Also: అప్పు తీర్చిన అధినేత, ఓలా షేర్లు ఒక్కసారి 10 శాతం జంప్!

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×