E-Paper
Advertisement

Rupee US Dollar Rate: రూపాయి రికార్డు స్థాయి పతనం.. డాలర్ తో పోలిస్తే 90కి చేరువలో మారకపు విలువ

Rupee US Dollar Rate: రూపాయి రికార్డు స్థాయి పతనం.. డాలర్ తో పోలిస్తే 90కి చేరువలో మారకపు విలువ
Advertisement

Rupee US Dollar Rate: ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూపాయి మారకపు విలువ భారీగా పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 42 పైసలు తగ్గి 89.95 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. స్పెక్యులేటర్ల నుంచి షార్ట్-కవరింగ్, అమెరికన్ కరెన్సీకి ఇంపోర్టర్ల డిమాండ్ కొనసాగడంతో రూపాయి విలువ పతనమైంది. ఈక్విటీల నుండి విదేశీ పెట్టుబడులు వెనక్కి మరలడం, ఇండో-యూఎస్ వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నాయని ఫారెక్స్ నిపుణులు తెలిపారు.

ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ 89.70 వద్ద ప్రారంభమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో మారకపు విలువ 90 కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే 47 పైసలు తగ్గింది.

Advertisement

మంగళవారం వాణిజ్యం ముగిసే సమయానికి, డాలర్‌తో పోలిస్తే రూపాయి రికార్డు స్థాయిలో 89.95 (తాత్కాలిక) వద్ద స్థిరపడింది, ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 42 పైసలు తగ్గింది. సోమవారం రూపాయి మారకం విలువ ఎనిమిది పైసలు తగ్గి యూఎస్ డాలర్‌తో పోలిస్తే 89.53 వద్ద ముగిసింది.

రంగంలోకి ఆర్బీఐ

“90కి చేరువలో రూపాయి విలువ ఉండడం ఆందోళనకరం. రూపాయి మరింత క్షీణించకుండా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకోవాలి. సరైన చర్యలు తీసుకోకపోతే రూపాయి మార్కెట్ విలువ 91.00 లేదా అంతకంటే ఎక్కువగా ట్రెండింగ్ దశలోకి చేరవచ్చు” మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఆరు కరెన్సీల బాస్కెట్‌తో గ్రీన్‌బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.06% అధికంగా 99.41 వద్ద ట్రేడవుతోందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

అంతర్జాతీయ మార్కెట్ లో చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 63.03 డాలర్ల వద్ద 0.25% తక్కువగా ట్రేడవుతోంది. దేశీయ ఈక్విటీ మార్కెట్ లో సెన్సెక్స్ 503.63 పాయింట్లు పడిపోయి 85,138.27 వద్ద ఉండగా, నిఫ్టీ 143.55 పాయింట్లు పడిపోయి 26,032.20 వద్ద స్థిరపడింది. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సోమవారం రూ.1,171.31 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.

Also Read: DMart Dec 2025 Offer: డిమార్ట్ లో ఇయర్ ఎండింగ్ ఆఫర్లు, ఆ వవాటిపై ఏకంగా 80 శాతం తగ్గింపు!

రూపాయి బలహీన పడడానికి కారణాలు

పెరుగుతున్న వాణిజ్య లోటు: దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యాత్యాసం పెరడంతో వాణిజ్య లోటు అధికమవుతోంది.
పెట్టుబడులు తరలింపు: విదేశీ పెట్టుబడిదారులు తమ పోర్ట్ ఫోలియో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం
విదేశీ మారక ద్రవ్య విలువలు: రూపాయి మారక విలువలను ఆర్బీఐ అనుమతించడం

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×