E-Paper
Advertisement

విమానయాన సంస్థలకు కేంద్రం బంపర్ ఆఫర్.. ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీల్లో 25% తగ్గింపు!

విమానయాన సంస్థలకు కేంద్రం బంపర్ ఆఫర్.. ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీల్లో 25% తగ్గింపు!
Advertisement

Airport Fee Reduction: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలు.. విమానయాన రంగంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమానయాన సంస్థలకు భారీ ఊరటనిస్తూ, విమానాశ్రయాల్లో వసూలు చేసే ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను 25 శాతం తగ్గించాలని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ అన్ని విమానాశ్రయాలను ఆదేశించింది.

దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియాలు ఈ యుద్ధ సెగతో భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇంధన ధరల పెరుగుదల.. విమాన మార్గాల మళ్లింపుతో పెరుగుతున్న ఖర్చుల నుండి ఉపశమనం పొందేందుకు, ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి.

Advertisement

విమానాశ్రయాలు వసూలు చేసే ల్యాండింగ్.. పార్కింగ్ ఛార్జీలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, తమపై ఉన్న ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గించాలని ఈ సంస్థలు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశాయి. పెరిగిన ఇంధన భారాన్ని నేరుగా ప్రయాణికులపై మోపకుండా ఉండేందుకు ఈ రాయితీలు ఎంతో అవసరమని ఎయిర్ ఇండియా, ఇండిగో యాజమాన్యాలు కేంద్రానికి వివరించాయి.

ఇరాన్ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో విమాన ఇంధనం (ATF) ధరలు కూడా భారీగా పెరిగాయి. దీనికి తోడు యుద్ధం జరుగుతున్న ప్రాంతాల మీదుగా విమానాలు వెళ్లేందుకు వీల్లేకపోవడంతో, విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు ఇంధన వినియోగం కూడా అధికమవుతోంది. ఈ అదనపు ఆర్థిక ఒత్తిడిని విమానయాన సంస్థలు తట్టుకునేందుకు.. దేశంలోని ప్రభుత్వ.. ప్రైవేట్ విమానాశ్రయాలన్నీ తమ వద్ద ల్యాండ్ అయ్యే దేశీయ విమానాల పార్కింగ్, ల్యాండింగ్ రుసుములలో 25% కోత విధించాలని కేంద్రం ఆదేశించింది.

Advertisement

విమానయాన సంస్థలపై పడే భారాన్ని తగ్గించడం ద్వారా, ఆ భారం ప్రయాణికులపై పడకుండా చూడాలని, విమాన టికెట్ల ధరలు అదుపులో ఉంటాయని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలకు ఈ నిర్ణయం కొంత మేర ఊపిరి పోయనుంది. యుద్ధం వల్ల ఎదురవుతున్న ఈ అసాధారణ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు విమానయాన రంగాన్ని కుప్పకూలకుండా కాపాడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు చక్కబడే వరకు ఈ తగ్గింపు ధరలు అమలులో ఉండే అవకాశం ఉంది.

Read Also: ఆంత్రోపిక్ కొత్త AI మోడల్.. బయటకు వస్తే విధ్వంసమే.. సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం!

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×