E-Paper
Advertisement

World’s Fastest Train: గంటకు 400 కిమీ వేగంతో దూసుకెళ్లే రైలు.. పరుగుకు సిద్ధం, ప్రపంచంలోనే ఫాస్టెస్ ట్రైన్ ఇది!

World’s Fastest Train: గంటకు 400 కిమీ వేగంతో దూసుకెళ్లే రైలు.. పరుగుకు సిద్ధం, ప్రపంచంలోనే ఫాస్టెస్ ట్రైన్ ఇది!
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. జపాన్, చైనా లాంటి దేశాల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ తలదన్నే రైలు ఒకటి అందుబాటులోకి రాబోతోంది. ఈ రైలు ఏకంగా గంటకు 400 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించబోతోంది. CR450 అని పిలిచే ఈ హై స్పీడ్ రైలు డ్రాగన్ కంట్రీ చైనా తయారు చేసింది. ఇది పట్టాలు ఎక్కిన తర్వాత ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సాంప్రదాయ రైలుగా గుర్తింపు తెచ్చుకొనుంది. చైనా స్టేట్ రైల్వే గ్రూప్ ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ 2026లో ఆపరేషనల్ టెస్టులను పూర్తి చేసుకుని, కర్షియల్ ఆపరేషన్స్ కు రెడీ కానుంది.

చైనా తయారు చేసిన నెక్ట్స్ జెనరేషన్ హైస్పీడ్ రైలు

CR450 అనేది చైనాలో అభివృద్ధి చేయబడిన నెక్ట్స్ జెనరేషన్ హై స్పీడ్ రైలు. CR400 సిరీస్‌ రైళ్లు చైనాలో నడుస్తున్నాయి. వీటి వేగం గంటకు 350 కిలో మీటర్లు. త్వరలో అందుబాటులోకి రాబోయే CR450 రైలు, ఏకంగా గంటకు 400 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించనుంది.

 హైస్పీడ్ లైన్లపై కొనసాగుతున్న పరీక్షలు

Advertisement

CR450 రైలు రెండు నమూనాలు 2024 చివరిలో పూర్తయ్యాయి. ఆ తర్వాత విస్తృతమైన టెస్టులు జరపుకున్నాయి. ఈ రైళ్లను బీజింగ్ రింగ్ రైల్వే టెస్ట్ లైన్‌లో,  చాంగ్‌ కింగ్ జియామెన్, షాంఘై- చాంగ్‌ కింగ్- చెంగ్డు హైస్పీడ్ లైన్లలో పరీక్షించారు.  ఈ రైళ్లు ఇప్పటి వరకు ఆపరేషనల్ పరీక్షల్లో భాగంగా దాదాపు 300,000 కిలోమీటర్లు ప్రయాణించాయి. అన్ని రకాల పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి.

టెస్టింగ్ దశలో గంటకు 453 కి.మీ వేగంతో ప్రయాణం  

CR450  రైళ్లు టెస్టింగ్ సమయంలో గంటకు గరిష్టంగా 453 కి.మీ వేగంతో ప్రయాణించాయి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా గంటకు 400 కి.మీ వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైళ్ల కోసం సాంకేతిక వ్యవస్థను రూపొందించారు. ఇది చైనా రైళ్ల ప్రస్తుత కమర్షియల్ రైళ్ల స్పీడ్ కంటే ఎక్కువ.  ఈ వేగంతో, రైలు అత్యవసర బ్రేకింగ్ దూరం 6,500 మీటర్ల కంటే తక్కువ ఉంటుంది. కిలోమీటరుకు 22 kWh కంటే తక్కువ పవర్ ను తీసుకుంటుంది. అంతర్గత సౌండ్ కేవలం 68 డెసిబెల్స్ ఉంటుంది.

హైస్పీడ్ రైళ్ల కోసం కొత్త టెక్నాలజీ  

Advertisement

CR450 ప్రాజెక్ట్‌ లో అనేక కొత్త టెక్నికల్ అంశాలను జోడించారు. ఈ రైళ్లు ఎక్కువగా దేశీయంగా అభివృద్ధి చేయబడ్డాయి. వీటిలో బోగీలు, పాంటోగ్రాఫ్‌లు, హై వోల్టేజ్ కేబుల్‌లు ఉన్నాయి. తేలికైన బాడీలు, పర్మినెంట్ మాగ్నటిక్ ట్రాక్షన్ సిస్టమ్‌లు, ఏరోడైనమిక్ డ్రాగ్‌ ను తగ్గించడానికి పరిష్కారాలు, హై ఫర్ఫార్మెన్స్ బ్రేకింగ్ సిస్టమ్‌ ఉంది. రైలు నమూనాలను CRRC చాంగ్‌ చున్ రైల్వే వెహికల్స్, CRRC ఇండస్ట్రియల్ గ్రూప్‌ లో భాగమైన CRRC క్వింగ్‌డావో సిఫాంగ్ అభివృద్ధి చేస్తున్నాయి.  ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రోలింగ్ స్టాక్ తయారీదారుగా గుర్తింపు తెచ్చుకుంది.

Read Also: భలే.. సరిగ్గా ఈ టైమ్‌లో విమానం టికెట్ బుక్ చేస్తే.. 60 శాతం డబ్బులు ఆదా!

Related News

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×