E-Paper
Advertisement

Allu Cinemas: అల్లు సినిమాస్ గ్రాండ్ లాంచ్ ముహూర్తం ఫిక్స్.. థియేటర్ ప్రత్యేకతలు ఇవే!

Allu Cinemas: అల్లు సినిమాస్ గ్రాండ్ లాంచ్ ముహూర్తం ఫిక్స్.. థియేటర్ ప్రత్యేకతలు ఇవే!
Advertisement

Allu Cinemas: సినిమా అంటే చాలామందికి ఒక వినోదం మాత్రమే కాకుండా ఎమోషన్ లాంటిదని చెప్పాలి .ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించడం కోసం ఎన్నో ప్రత్యేకతలతో కూడిన థియేటర్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే అధునాతన టెక్నాలజీతో థియేటర్లను రూపొందించగా త్వరలోనే మరో కొత్త థియేటర్ కూడా అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది హీరోలు థియేటర్ బిజినెస్ లో కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలోనే అల్లు కుటుంబం కూడా థియేటర్ బిజినెస్ ప్రారంభించారు. ఇప్పటికే కోకాపేటలో అల్లు సినిమాస్(Allu Cinemas) పేరుతో అధునాతన సౌకర్యాలతో థియేటర్ ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే అల్లు సినిమాస్ థియేటర్ ప్రారంభం కాబోతోంది.

ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం..

Advertisement

కోకాపేటలో ఈ థియేటర్ నిర్మాణం పూర్తి అయింది ఈ అల్లు సినిమాస్ థియేటర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. నిజానికి ఈ థియేటర్ ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రారంభం కావాల్సి ఉండగా కాస్త పనులు ఆలస్యమైన నేపథ్యంలో ఈ థియేటర్ ప్రారంభం కూడా ఆలస్యమైంది. థియేటర్ ఏర్పాటు పనులు పూర్తి కావడంతో ఘనంగా ఈ అల్లు సినిమా థియేటర్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ థియేటర్లో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా ప్రసారం కాబోతోందని సమాచారం.

ఇక ఈ థియేటర్ ప్రత్యేకతలు విషయానికి వస్తే..

ప్రపంచంలో ఇప్పటివరకు ఏ థియేటర్లో లేని విధంగా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయబడిందని తెలుస్తోంది. క్రిస్టల్ క్లియర్ ప్రొజెక్షన్, అదిరిపోయే డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, అత్యంత సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది.అల్లు సినిమాస్‌లో ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా స్క్రీన్ మన దేశంలోనే 3 వ అత్యంత పెద్దదైన స్క్రీన్. హైదరాబాదులో ఇది మొదటిది కావటం విశేషం. డ్యూయల్ డాల్బీ విజన్ 4కే ప్రొజెక్టర్లు, స్టూడియో-గ్రేడ్ డాల్బీ అట్మాస్ సౌండ్‌తో 75 అడుగుల డీసీ ఫ్లాట్ రేషియో గల మెయిన్ స్క్రీన్, 4 ఇమ్మర్సివ్ డిజైన్ స్క్రీన్లు ఈ మల్టీప్లెక్స్ లో ఉన్నాయి. ఇప్పటివరకు హైదరాబాదులో ఏ మల్టీప్లెక్స్ లో లేని విధంగా అల్లు సినిమాస్ లో ఈ సౌకర్యాలు అన్నింటిని కూడా ఏర్పాటు చేశారని తెలుస్తుంది.

Advertisement

థియేటర్ బిజినెస్ లోకి అల్లు ఫ్యామిలీ…

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అల్లు కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది . అల్లు స్టూడియోస్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా నిర్మాతలుగా హీరోలుగా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న అల్లు కుటుంబం ఇప్పుడు థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెట్టడంతో ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.. ఇక ఈ థియేటర్ కోసం అల్లు కుటుంబం బారీగా ఖర్చు చేశారని తెలుస్తుంది. చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు అన్ని భాగాలలో సక్సెస్ అందుకున్న అల్లు కుటుంబం థియేటర్ బిజినెస్ లో సక్సెస్ సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.

Also Read: Tollywood Actress: చేతిలో ఒక్కసినిమా లేదు.. సంపాదన మాత్రం కోట్లలో..ఈ నటి ప్లానింగ్ మామూలుగా లేదు భయ్యా!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×