Bank FDs Rates Latest: భారత్ లో సంప్రదాయ పెట్టుబడిదారుల బెస్ట్ ఆప్షన్ ఫిక్స్ డ్ డిపాజిట్లు. ఎన్ని పథకాలు ఉన్నప్పటికీ, బ్యాంకు డిపాజిట్‌లపై ఉన్న నమ్మకంతో చాలా మంది బ్యాంకు ఎఫ్‌డీలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులు 0.5-1% వరకు అదనపు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. తక్కువ రిస్క్ , స్థిరమైన ఆదాయం కోసం ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఎఫ్‌డీలలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. 1, 3, 5 సంవత్సరాలకు ఎఫ్డీ రేట్లను అందిస్తున్నాయి బ్యాంకులు.
మూడు పరిణామాల్లో ఎఫ్డీలు
ఈక్విటీ మార్కెట్ వృద్ధి ఆరేళ్లలో కనిష్ఠానికి పడిపోవడంతో, సంప్రదాయ పెట్టుబడిదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎఫ్డీలలో ఒకటి నుంచి ఐదు సంవత్సరాల మధ్య నిర్దిష్ట కాల వ్యవధికి అమౌంట్ ను ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. నష్ట భయం తక్కువ, స్థిరమైన ఆదాయం కోరుకునే వాళ్లు FDలలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే, NBFCలు, గృహ రుణాల సంస్థలు కాస్త ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
బ్యాంకు — 1 సంవత్సరం- 3 సంవత్సరాలు – 5 సంవత్సరాలకు (వార్షిక వడ్డీ రేటు)
- బంధన్ బ్యాంకు – 7.00% – 7.25% – 5.85%
- సిటీ యూనియన్ బ్యాంకు – 6.80% – 6.50% – 6.25%
- ఇండస్ఇండ్ బ్యాంకు – 6.75% – 6.90% – 6.65%
- యెస్ బ్యాంకు – 6.65% – 7.00% – 6.75%
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు – 6.50% – 6.10% – 6.10%
- కర్ణాటక బ్యాంకు – 6.50% – 6.15% – 6.15%
- ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు – 6.50% – 7.00% – 7.00%
- కోటక్ మహీంద్రా బ్యాంకు – 6.50% – 6.40% – 6.25%
- కెనరా బ్యాంకు -6.25% – 6.25% – 6.25%
- బ్యాంక్ ఆఫ్ ఇండియా – 6.25% – 6.25% – 6.00%
- ఐసీఐసీఐ బ్యాంకు – 6.25% – 6.45% – 6.50%
- ఎస్బీఐ – 6.25% – 6.30% – 6.05%
- HDFC బ్యాంకు – 6.25% – 6.45% – 6.40%
- యాక్సిస్ బ్యాంకు – 6.25% – 6.45% – 6.45%
- కరూర్ వైశ్యా బ్యాంకు- 6.25% – 6.40% – 6.25%
- సౌత్ ఇండియన్ బ్యాంకు – 6.35% – 6.20% – 5.70%
- యూనియన్ బ్యాంకు – 6.30% – 6.25% – 6.00%
- పంజాబ్ నేషనల్ బ్యాంకు – 6.25% – 6.30% – 6.10%
- ఫెడరల్ బ్యాంకు – 6.25% – 6.75% – 6.40%
- ధనలక్ష్మీ బ్యాంకు – 6.25% – 6.50% – 6.50%
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 6.20% – 6.00% – 6.00%
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర – 6.20% – 5.25% – 5.00%
- ఐడీబీఐ బ్యాంకు – 6.20% – 6.35% – 6.25%
- బ్యాంక్ ఆఫ్ బరోడా – 6.10% – 6.25% – 6.30%
- యూకో బ్యాంకు – 6.10% – 6.00% – 6.00%
Also Read: లైఫ్ ఇన్సూరెన్స్ వర్సెస్ ఫిక్స్ డ్ డిపాజిట్.. ఈ పెట్టుబడి ఏది బెస్ట్?
ప్రైవేట్ సంస్థలు
- ప్రైవేట్ బ్యాంకుల రేటింగ్
- శ్రీరామ్ ఫైనాన్స్ – 7% – 7.60% – 7.60%
- మహీంద్రా ఫైనాన్స్ – 6.60% – 7% – 7%
- మణిపాల్ హౌసింగ్ ఫైనాన్స్ – 8.25% – 8.25% – 7.75%
- పీఎన్‌బీ హౌసింగ్ – 6.60% – 6.90% – 6.90%
- సుందరం హోమ్ ఫైనాన్స్ – 6.70%- 7% – 7.15%
- ముతూత్ క్యాపిటల్ సర్వీసెస్ -7.90% – 8.95% – 8.50%
- కాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ – 6.50% – 7.50% – 6.75%
- బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ – 6.60% – 6.95% – 6.95%
- ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ – 6.70% – 6.85%-6.90%

Share