E-Paper
Advertisement

ఇంట్లో చెదపురుగులు రావడానికి ఈ తప్పులే కారణం.. చెదలు నివారణకు ఈ చిట్కాలు పాటించండి

ఇంట్లో చెదపురుగులు రావడానికి ఈ తప్పులే కారణం.. చెదలు నివారణకు ఈ చిట్కాలు పాటించండి
Advertisement

Termite causes| ఇంట్లో చెదపురుగులు ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ చిన్న కీటకాలు, మీ ఇంటికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. ప్రధానంగా చెక్కను తింటాయి. ఇంట్లో ఫర్నిచర్, కిటికీలను లోపలి నుండి నాశనం చేస్తాయి. పైగా చెదల సమస్య ఉన్నట్లు.. నష్టం తీవ్రంగా జరిగే వరకు ఇంట్లో చెదల సమస్య ఉన్నట్లు సాధారణంగా బయటపడదు. అందుకే చెదపురుగులు ఇంట్లో రావడానికి కారణాలు, వాటి నివారణలను అర్థం చేసుకుంటే మీ ఇంటిని రక్షించుకోవచ్చు.

ఇంట్లో చెదలు రావడానికి కారణాలు ఇవే

చెదపురుగులు తేమ, తడి వాతావరణం ఉన్న చోట త్వరగా వస్తాయి. నీరు లీక్ అయ్యే పైపులు, తడి గోడలు, తేమతో కూడిన ప్రాంతాలు సులభంగా చెదపురుగులను ఆకర్షిస్తాయి. నేలపై దగ్గరగా ఉన్న చెక్క వస్తువులు ఉంటే అవి మరింత వేగంగా ఇంటి లోపలికి వచ్చేస్తాయి. గోడలు, స్లాబ్‌లలో పగుళ్లు ఉంటే చెదపురుగులు సులభంగా లోపలికి వచ్చేస్తాయి. ఇంటి సమీపంలో నిల్వ చేసిన పాత చెక్క లేదా కార్డ్ బోర్డ్ ఉంటే చెదపురుగులు వెంటనే వాటిని తమ ఆహారంగా, నివాస స్థలంగా మార్చుకుంటాయి.

చెదపురుగులు ఫర్నీచర్‌ను ఎలా నాశనం చేస్తాయి

Advertisement

చెదపురుగులు చెక్క పదార్థాలలో ఉండే సెల్యులోజ్‌ను ఆహారంగా తింటాయి. అవి చెక్కను లోపలి నుండి తింటాయి, ఒక సన్నని బయటి పొరను వదిలివేస్తాయి. ఫర్నీచర్ బయటి నుంచి సాధారణంగా కనిపించవచ్చు కానీ లోపలి నుండి డొల్లగా మారుతుంది. కాలక్రమేణా.. ఆ ఫర్నీచర్ వస్తువు బలహీనమై విరిగిపోతుంది.

చెదపురుగుల సమస్య సంకేతాలు

తేలికగా నొక్కినప్పుడు చెక్క లోపల డొల్ల శబ్దం రావొచ్చు. ఫర్నీచర్ లేదా తలుపులు, కిటికీలలో చిన్న చిన్న రంధ్రాలు లేదా పగుళ్లను కనిపిస్తాయి. గోడలపై ఎండిపోయిన బురద లాంటి మట్టి గొట్టాలు.. ఉంటే వాటి లోపలి నుంచి చెదపురుగులు రాకపోకలు చేస్తున్నట్లు. కిటికీల సమీపంలో ఎగిరే చెదపురుగులు మరింత సమస్యను సూచిస్తాయి. చెక్కలో రంగు మార్పులు కూడా చెదపురుగుల సమస్యను సూచిస్తాయి.

వేప నూనె: సహజ, ప్రభావవంతమైన నివారణ

Advertisement

వేప నూనె ఒక సహజ చెదపురుగుల నివారిణిగా పనిచేస్తుంది. ప్రభావిత చెక్క ఉపరితలాలపై దీన్ని నేరుగా అప్లై చేయండి. మీరు క్రమం తప్పకుండా వేప నూనె ద్రావణాన్ని కూడా స్ప్రే చేయవచ్చు. ఇది నెమ్మదిగా చెదపురుగులను చంపుతుంది. మరింత వ్యాప్తిని నివారిస్తుంది.

బోరిక్ యాసిడ్‌తో రక్షణ

బోరిక్ యాసిడ్ ఒక పవర్‌ఫుల్ విస్తృతంగా ఉపయోగించే ద్రావణం. ప్రభావిత ప్రాంతాలపై జాగ్రత్తగా బోరిక్ పౌడర్ లేదా స్ప్రే అప్లై చేయండి. ఇది చెదపురుగులను నాశనం చేస్తుంది. వాటి పెరుగుదల చక్రాన్ని ఆపివేస్తుంది. మంచి దీర్ఘకాలిక రక్షణ కోసం దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించండి.

Also Read: మీ పక్కనే ఉంటూ తన స్వార్థం కోసం ఉపయోగించుకునే స్నేహితులు వీరే.. ఈ సంకేతాలతో గుర్తుపట్టండి

ఫర్నీచర్ కోసం సూర్యరశ్మి చికిత్స

ఎండ తీవ్రంగా ఉంటే చెదపురుగులు ఆ ప్రభావాన్ని తట్టుకోలేవు. చెదలు పట్టిన ఫర్నీచర్‌ను కొన్ని రోజులు నేరుగా ఎండలో ఉంచండి. వేడి, కాంతి సహజంగా చెదపురుగులను తొలగించడానికి సహాయపడతాయి. ఈ పద్ధతి కదిలించదగిన చెక్క వస్తువులకు బాగా పనిచేస్తుంది.

చెదలు నివారణకు వంటగది చిట్కాలు

ఇంగువ ద్రవం చెదపురుగులు తరిమికొట్టగలదు. ప్రభావిత ప్రాంతాలపై ఇంగువ ద్రవం స్ప్రే చేయండి. వేప ఆకులతో కలిపిన కాకరకాయ రసం కూడా పనిచేస్తుంది. నీటిలో ఎర్ర కారం పొడి కలిపి ఘూటు స్ప్రే చేస్తే చెదలు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోతాయి.

మీ ఇంటిని పరిశుభ్రంగా, తేమలేకుండా ఉంచండి

తేమను తగ్గించడానికి అన్ని ఇంట్లో మూలలు, గోడల నుంచి నీరు కారుతుంటే వాటిని వెంటనే రిపేర్ చేయండి. వంటగది, బాత్రూమ్ ప్రాంతాలను పొడిగా, గాలి బాగా వీచే విధంగా ఉంచండి. మీ ఇంటి సమీపంలో చెక్క వ్యర్థాలను నిల్వ లేకుండా చూడండి. పరిసరాలు శుభ్రంగా ఉంటే చెదపురుగులు అక్కడ దాగి ఉండేందుకు అవకాశం ఉండదు.

భద్రత కోసం అదనపు చిట్కాలు

చెక్క ఫర్నీచర్ ను నేలపై నేరుగా పెట్టవద్దు. ఫర్నీచర్ కింది భాగానికి ఏదైనా ఐరన్ లేదా ప్లాస్టిక్ పదార్థం అమర్చండి. గోడలలో పగుళ్లు, ఖాళీలను మూసివేయండి. ఫర్నీచర్ ను క్రమం తప్పకుండా చెక్ చూస్తూ ఉండండి. మంచి రక్షణ కోసం చెదపురుగులను నిరోధించే చెక్కను ఉపయోగించండి.

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×