E-Paper
Advertisement

Lenskart IPO: లెన్స్‌కార్ట్ ఐపీఓ.. తొలి రోజు వివరాలు.. నిపుణులు ఏమంటున్నారు?

Lenskart IPO: లెన్స్‌కార్ట్ ఐపీఓ.. తొలి రోజు వివరాలు.. నిపుణులు ఏమంటున్నారు?
Advertisement

Lenskart IPO: ఐ వేర్ రిటైలర్ ‘లెన్స్‌కార్ట్’ పబ్లిక్ ఆఫరింగ్(IPO) నేడు ప్రారంభం అయింది. మొత్తం రూ. 7,278 కోట్ల ఫండ్స్ సమీకరణ లక్ష్యంగా లెన్ కార్ట్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం NSE డేటా ప్రకారం కంపెనీ తొలి పబ్లిక్ ఇష్యూలో 9.98 కోట్ల షేర్లకు బదులుగా 10.34 కోట్లకు పైగా బిడ్‌లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లు (QIB) తమ భాగాలను బుక్ చేసుకున్నారు. ఎన్ఐఐ పెట్టుబడిదారులు తమ వాటాలో 29 శాతం సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.

లెన్స్‌కార్ట్ ఐపీఓ గురించి

లెన్స్‌కార్ట్ ఐపీఓలో మొత్తం రూ.7,278 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఇందులో రూ.2,150 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ(Fresh Issue) ద్వారా, మిగిలిన 5128.02 కోట్లను ఆఫర్ ఫర్ సేల్(OFS) ద్వారా సమీకరించనున్నారు. మొత్తం 12.75 కోట్ల షేర్లను ఆఫర్ చేయడం ద్వారా రూ.7,278 కోట్లను సేకరించనుంది. లెన్స్ కార్ట్ ఐపీఓ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 మధ్య పబ్లిక్ బిడ్డింగ్ కోసం తెరిచి ఉంటుంది. ఒక్కో షేరుకు రూ.382-402 ధరల శ్రేణిలో నిర్ణయించింది. ఈ కంపెనీ దాదాపు రూ.70,000 కోట్ల విలువను కలిగి ఉంది.

Advertisement

ఇన్వెస్టర్లు కనీసం 37 షేర్లకు బిడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం రూ. 14,874 పెట్టుబడి అవసరం ఉంటుంది. బిడ్ కేటాయింపులు నవంబర్ 5 నాటికి ప్రకటించే అవకాశం ఉంది. షేర్లు నవంబర్ 10న స్టాక్ ఎక్స్ఛేంజీ జాబితాలో చేరుస్తారు.

ఐపీఓ జీఎంపీ

లిస్టింగ్‌కు ముందు లెన్స్ కార్ట్ అన్‌లిస్టెడ్ షేర్ల ఐపీఓ ధర కంటే 17.41 శాతం(రూ.48) గ్రే మార్కెట్ ప్రీమియం (GMP)తో ట్రేడవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇది ఇష్యూ ధరలో(రూ.402) 11.94 శాతం కంటే ఎక్కువ లాభాన్ని సూచిస్తోంది. అన్‌లిస్టెడ్ షేర్లు ఐపీఓ ధర కంటే 15.92 శాతం జీఎంపీతో ట్రేడవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జీఎంపీ మార్కెట్ సెంటిమెంట్ ను తెలియజేస్తుంది.

Advertisement

పెట్టుబడిదారుల మద్దతు, స్ట్రాంగ్ బ్రాండ్‌తో లెన్స్‌కార్ట్ ఐపీఓ పై ముదుపర్లు ఆసక్తి కనబరిచారని నిపుణులు చెబుతున్నారు. సుమారు రూ. 70,000 కోట్ల విలువైన మార్కెట్ విలువ, అంతర్జాతీయంగా విస్తరిస్తుంది.

Also Read : OnlyFans: ఆదాయంలో ఓన్లీఫ్యాన్స్ జోష్.. ఆపిల్, గూగుల్ ను వెనక్కి నెట్టి మరీ..

నిపుణులు ఏంమంటున్నారు?

ఐ-వేర్ కంపెనీ లెన్స్‌కార్ట్ తొలి పబ్లిక్ ఆఫర్ ఇవాళ ప్రారంభమైంది. తొలి రోజు ప్రారంభంలో ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మందకొడిగా సాగినా, చివరి రోజుల్లో బిడ్డింగ్ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లెన్స్‌కార్ట్ ఒక బలమైన బ్రాండ్ దీంతో ఐపీఓ ధర అధికంగా ఉందంటున్నారు.

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×