 
					అడల్ట్ కంటెంట్ యాప్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓన్లీఫ్యాన్స్ ఓ అరుదైన ఘనతను సాధించింది. ఒక్కో ఉద్యోగికి అత్యధిక ఆదాయాన్ని కలిగి ఉన్న సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ విషయంలో ఆపిల్, ఎన్విడియా, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ లాంటి అతిపెద్ద టెక్ దిగ్గజాలను కూడా అధిగమించింది. మార్కెటింగ్, ఫైనాన్స్ కన్సల్టెన్సీ అయిన బార్ చార్ట్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఓన్లీఫ్యాన్స్ ప్లాట్ ఫామ్ ఒక్కో ఉద్యోగికి 37.6 మిలిన్ డాలర్లు సంపాదిస్తున్నట్లు తెలిపింది. ఎన్విడియాకు చెందిన ఒక్కో ఉద్యోగి $3.6 మిలియన్లు, ఆపిల్ $2.4 మిలియన్లు, మెటా$2.2 మిలియన్లు, గూగుల్, ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్ $1.9 మిలియన్లు సంపాదిస్తున్నారు. 2023 ఆర్థిక సంవత్సరానికి ఓన్లీఫ్యాన్స్ మొత్తం ఆదాయం $1.3 బిలియన్లు. టెక్ దిగ్గజాలతో పోల్చితే తక్కువే అయినా, ఉద్యోగుల సంపాదనలో మాత్రం వాటిని దాటేసి ముందు వరుసలో ఉంది.
ఓన్లీఫ్యాన్స్ కేవలం 42 మంది ఉద్యోగులతో ప్రారంభం అయ్యింది. తొలి ఏడాది వార్షిక ఆదాయంలో దాదాపు $1.3 బిలియన్లకు చేరింది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్లాట్ ఫామ్ లో దాదాపు 2.1 మిలియన్ల మంది ఇండిపెండెంట్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. వారు తమ కంటెంట్ నుంచి డబ్బులు పొందుతున్నారు. సబ్ స్క్రిప్షన్స్, టిప్స్ ద్వారా సంపాదిస్తున్నారు. కంపెనీ తమ ప్లాట్ ఫామ్ నుంచి ప్రాసెస్ చేసిన ప్రతి లావాదేవీ మీద 20% కమిషన్ తీసుకుంటుంది. ఈ ప్లాట్ ఫారమ్ లోని కంటెంట్ క్రియేటర్స్ వారి సబ్‌స్క్రైబర్స్ నుంచి దాదాపు 80% లాభాలను తీసుకుంటారు.
చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ రకరకాల ప్లాట్ ఫారమ్స్ ద్వారా ఆదాయాన్ని పొందుతారు. కొంత మంది ఉపయోగపడే సమాచారం అందిస్తూ, మరికొంత మంది కామెడీ వీడియోలు షేర్ చేస్తూ మంచి వ్యూస్ తో ఆదాయం పొందుతున్నారు. అలాగే కొంత మంది తమ అందచందాలను ఎదుటి వారికి ఎరగా వేసి డబ్బును పొందుతున్నారు. అలాంటి కంటెంట్ ఎక్కువగా దొరికే యాప్స్ లో ఒకటి ఓన్లీఫ్యాన్స్. కంటెంట్ క్రియేటర్స్ తమ ఫాలోవర్స్ కు నచ్చే కంటెంట్ అందిస్తూ ఆకట్టుకుంటారు. అదే సమయంలో సబ్ స్క్రిప్షన్ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ప్లాట్ ఫారమ్ లో అన్ని రకాల కంటెంట్ ను పోస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఎక్కువగా అందిస్తుంది. చాలా మంది దీన్ని అడల్ట్ కంపెంట్ యాప్ గానే గుర్తిస్తారు. ఈ యాప్ యూజర్స్ క్రియేటర్స్ కంటెంట్‌ను చూడటానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
ఓన్లీఫ్యాన్స్ యాప్ గురించి పలు ఆందోళనలు ఉన్నాయి. ఈ ప్లాట్ ఫారమ్ ను తక్కువ వయసు ఉన్న వారు ఉపయోగిస్తున్నారు. డబ్బుకోసం వాళ్లు కూడా అడల్ట్ కంటెంట్ అప్ లోడ్ చేసే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. అటు ఇందులోని వినియోగదారులు తమ గుర్తింపును దాచుకోవాల్సి ఉంటుంది. వారి వాస్తవ గుర్తింపు బయటకు వస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఈ యాప్ కు చట్టబద్దమైనది కావడం విశేషం.
Read Also: నవంబర్ 1 నుంచి కొత్త ఆధార్ రూల్స్, అలా చేయకపోతే పాన్ కార్డ్ ఔట్!