 
					Bigg Boss 9 Promo: తాజాగా బిగ్ బాస్ 54వ ఎపిసోడ్ కి సంబంధించి 3వ ప్రోమోని తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా విధించిన డీజే కెప్టెన్ అనే టాస్క్ లో ఇంటి కొత్త సభ్యులు ఎవరు అయ్యారు అనే విషయం వైరల్ గా మారింది. ప్రోమో విషయానికి వస్తే.. కెప్టెన్సీ టాస్క్ లో డీజే కెప్టెన్ అంటూ కొత్త కెప్టెన్సీ టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. ఇంటికి కొత్త కెప్టెన్ అవ్వడానికి పోటీదారులకు బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ డీజే కెప్టెన్. ఎదురుగా ఉన్న ఫ్లాట్ ఫామ్ పై ప్లే అవుతున్న మ్యూజిక్ కి కంటేస్టెంట్ డాన్స్ చేయాల్సి ఉంటుంది. డాన్స్ చేస్తున్న కంటెస్టెంట్ కెప్టెన్ అవ్వాలి అనుకుంటే.. ఎదురుగా ప్లాట్ ఫామ్ పైన మిగతా కంటెస్టెంట్స్ డాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగేసరికి ఎవరి ఫ్లాట్ ఫామ్ పై అయితే ఎక్కువ మంది ఇంటి సభ్యులు డాన్స్ చేస్తున్నారో వారే బిగ్బాస్ ఈవారం ఇంటి కెప్టెన్ అవుతారు అంటూ టాస్క్ నిర్వహించారు.
ఇక అలా దివ్య, తనూజ, గౌరవ్, సాయి ప్రతి ఒక్కరు తమ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు. ఇక దివ్య డాన్స్ చేస్తున్నప్పుడు మాధురి కింద ఉండడంతో మాధురి గారు ఎక్కండి అంటూ దివ్య చెప్పింది. ముగ్గురే ఉన్నారు మిగతా ముగ్గురు దిగేసారు అని చెప్పగా.. సంచాలక్ గా ఉన్న రాము మాత్రం సాంగ్ అయిపోయిన తర్వాత మిగతా ముగ్గురు దిగారు అంటూ తెలిపారు. ఇక తనూజ గొడవ పడుతూ రాము అలా ఎలా చెబుతావు అంటూ ఫైర్ అయ్యింది. దివ్య కూడా తన వాదనలు వినిపించింది. ఇక అలా ఒకరికొకరు వాదించుకుంటూ ఇంటి కెప్టెన్ ఎవరు అవుతారు అనే విషయంపై ప్రోమోలో సస్పెన్షన్ విధించారు. ముఖ్యంగా రాము ఇంటి కెప్టెన్ ఎవరు అంటూ చెబుతుండగానే ప్రోమో అక్కడితో కట్ చేశారు.
ఇకపోతే తాజా ఎపిసోడ్ ని బట్టి చూస్తే ఆరు ఓట్లతో దివ్య నిఖిత ఇంటి కెప్టెన్ అయింది. తనూజకు కేవలం ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి. రీతు, మాధురి, కళ్యాణ్, నిఖిల్.. తనూజాకి సపోర్ట్ చేయగా.. భరణి, సుమన్ శెట్టి, ఇమ్మానుయేల్, సాయి, గౌరవ్, సంజన దివ్యాను సపోర్ట్ చేశారు. మొత్తానికైతే కొత్త వారం దివ్య నిఖిత హౌస్ కి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది.
ALSO READ: Big TV Kissik talks: సూసైడ్ చేసుకోవాలనుకున్న విష్ణు ప్రియ.. బయట పెట్టిన నిజం!