 
					Viral News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక అసలు నిజాలేవో.. అబద్ధాలేవో తెలియని పరిస్థితి.. ఫేక్ వీడియోలను రియల్ వీడియోలుగా చిత్రీకరిస్తున్నారు. అది ఫేక్ వీడియోనా..? రియల్ వీడియోనా..? తెలియక నెటిజన్లు సతమతం అవుతున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ను ఉపయోగించి సృష్టించిన తప్పుడు వీడియోల కారణంగా లక్నో నగరంలోని నివాసితులు కొద్దిసేపు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రుచి ఖండ్, గోమతి నగర్ వంటి ప్రాంతాల్లో చిరుతలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన తప్పుడు చిత్రాలు, వీడియో క్లిప్‌లే ఈ గందరగోళానికి కారణం అయ్యింది. చివరకు తప్పుడు ఫోటోకు గురైన యువకుడు జైలు పాలయ్యాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సోషల్ మీడియాలో చిరుతతో ఉన్న ఫేక్ ఫోటో ప్రచారం కావడంతో.. తమ నివాస ప్రాంతాలలో చిరుతలు సంచరిస్తున్నాయేమోనని స్థానికులు భయపడ్డారు. చాలా మంది నివాసితులు తమ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడం మొదలుపెట్టారు. భయంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకే పరిమితం చేయగా, మరికొందరు స్కూళ్లకు పంపలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో.. స్థానిక పోలీసులు, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఆయా ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. వారు ఇళ్లు, దుకాణాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
వెంటనే విచారణ జరిపిన అటవీ శాఖ అధికారులు ఊహించని నిజాన్ని వెల్లడించారు. వైరల్ అవుతున్న ఫుటేజీలు ఏవీ నిజమైనవి కాదని.. అదంతా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సృష్టించనవి అని .. ఫేక్ ఫోటోలు అధికారులు ధృవీకరించారు. చిరుత అడుగు జాడలు, వెంట్రుకలు లేదా మరే ఇతర ఆనవాళ్లు నగరంలో ఎక్కడా లభించలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఈ నకిలీ క్లిప్‌లను సృష్టించి, ఆన్‌లైన్‌లో వైరల్ చేసిన ఒక యువకుడిని ఆషియానా పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఈ తప్పుడు వీడియోలను ఎడిట్ చేసి నిజమైనవిగా చూపించడానికి ప్రయత్నించినట్లు అంగీకరించాడు. ఈ ఘటనపై ఆషియానా పోలీస్ స్టేషన్‌లో యువకుడిపై కేసు నమోదైంది. అధికారులు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో వీక్షణలు రావడంతోపాటు.. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ చర్యను ఖండించగా, మరికొందరు AI వినియోగానికి నియంత్రణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ‘ఏదైనా AIతో చేసిన ఆడియో, వీడియో లేదా చిత్రానికి అది AI కోడ్ ను ఉండేలా ప్రభుత్వం తప్పనిసరి చేయాలి. దీని ద్వారా గందరగోళాన్ని, తప్పుడు సమాచారాన్ని అరికట్టివచ్చు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ సంఘటన AI టెక్నాలజీ దుర్వినియోగం వల్ల సమాజంలో ఎలాంటి గందరగోళం, భయాందోళనలు సృష్టించవచ్చో తెలియజేస్తుంది.
ALSO READ: Jubilee Hills: జూబ్లీహిల్స్ గెలుపు వారిదే.. లోక్ పాల్ సంచలన సర్వే.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్