E-Paper
Advertisement

Jackpot: రూ.1800తో సరదాగా లాటరీ టికెట్ కొన్నాడు.. రూ.9 కోట్లు గెలుచుకున్నాడు, భలే లక్కీ

Jackpot: రూ.1800తో సరదాగా లాటరీ టికెట్ కొన్నాడు.. రూ.9 కోట్లు గెలుచుకున్నాడు, భలే లక్కీ
Advertisement

Jackpot: అమెరికాలో ఓ వ్యక్తి అదృష్టం బంక జలగలా పట్టింది. రూ.1800లతో ఏదో సరదాగా కొన్న లాటరీ టికెట్లు కోట్లు కురిపించింది. కొలరాడోలోని అలమోసాకు చెందిన జోనాథన్ అనే వ్యక్తి లాటరీలో $1 మిలియన్ (రూ. 9 కోట్లు) గెలుచుకున్నాడు. అలమోసాలోని వాల్‌మార్ట్ సూపర్‌సెంటర్ లో రూ. 1,800 తో సరదాగా లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడని స్థానిక మీడియా తెలిపింది. సెల్‌ఫోన్ షాపులో పని చేస్తున్న జోనాథన్.. అనుకోకుండా టికెట్ కొనుగోలు చేసినట్లు చెప్పాడు.

ఎప్పుడూ రూ.450తోనే

సాధారణంగా, జోనాథన్ అప్పుడప్పుడు లాటరీ టిక్కెట్ల కోసం దాదాపు $5 (రూ. 450) ఖర్చు చేసేవాడు. కానీ ఈసారి రూ.1800 పెట్టి లాటరీ టకెట్ కొనుగోలు చేశాడని స్థానిక మీడియా తెలిపింది. ఎప్పుడూ లాటరీ టికెట్ కోసం ఇంత డబ్బు పెట్టలేదని జోనాథన్ చెప్పాడు. ఈసారి ఎందుకో ఎక్కువ డబ్బుతో టికెట్ కొన్నానని, అది కలిసొచ్చిందన్నాడు.

పెట్టుబడి పెట్టేందుకు

Advertisement

గతంలో పనిలేక షెల్టర్ లో గడిపిన జోనాథన్.. లాటరీ తన జీవితాన్ని మార్చేసిందని చెప్పాడు. “నా స్నేహితురాలు, పిల్లలకు నేను ఎప్పుడూ సాధ్యం కాదని భావించిన జీవితాన్ని ఇప్పుడు ఇవ్వగలను. కొంచెం ఆశ, పట్టుదల, అదృష్టం.. మనం చాలా కష్టపడి సంపాదించిన జీవితాన్ని మనకు ఇస్తాయి” అని అతడు చెప్పాడు. ఈ డబ్బుతో తన కుటుంబాన్ని ఆనందం ఉంచేందుకు చిన్న చిన్న అనుభవాలను గడుపుతూ.. కొంత డబ్బును పెట్టుబడి పెట్టాలని నిర్ణయించానని చెప్పాడు.

Also Read:   ఆ అదృష్టవంతుడు ఎక్కడ?.. 30 లక్షల లాటరీ విజేత కోసం నిర్వాహకుల తిప్పలు!

రూ.9 కోట్ల లాటరీ

Advertisement

కొలరాడో లాటరీ ప్రకారం.. ప్రతి ముగ్గురిలో ఒకరు కొంత మొత్తాన్ని గెలుచుకుంటారు. చాలా మంది తమ లాటరీ డబ్బులు తిరిగి పొందుతారు. ఈ గేమ్‌లో $1 మిలియన్ (రూ. 9 కోట్లు) గెలుచుకోవడం అంటే .. దాదాపు 1,080,000లో ఒకరి అదృష్టం తగలడం వంటిది. కేవలం రూ.1800లతో జోనాథన్ జీవితం మారిపోయింది.

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×