E-Paper
Advertisement

Ananth ambani Wedding : అంబానీ ఇంట పెళ్లిసందడి.. అతిథుల లిస్ట్ లో దేశవిదేశాల రాజులు, రాణులు

Ananth ambani Wedding : అంబానీ ఇంట పెళ్లిసందడి.. అతిథుల లిస్ట్ లో దేశవిదేశాల రాజులు, రాణులు
Advertisement

Ananth ambani Wedding Guests List : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు అంబానీ ఫ్యామిలీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో అట్టహాసంగా జరుగనున్నాయి.

ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ ను వివాహమాడనున్నాడు. 2022 డిసెంబర్ లోనే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఈ సంవత్సరం జూలైలో వీరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే, ఈ పెళ్ళి వేడుక కంటే ముందు గుజరాత్ లోని జామ్ నగర్ లో అతిపెద్ద ఈవెంట్ జరగనుంది. దీనికి వివిధ దేశాలకు చెందిన అపర కుబేరులు, వివిధ కంపెనీల సీఈఓలు, పలు దేశాల రాజకీయ ప్రముఖులు హాజరుకానుండడంతో సందడి వాతావరణం నెలకొంది.

Advertisement

మార్చి 1 నుండి 3 తేదీల మధ్య జామ్ నగర్ లోని రిలయన్స్ కాంప్లెక్స్ లో అనంత్ – రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుక తర్వాత జులై 12వ తేదీ ముంబైలో అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు.

Read More : 7-సీటర్ కార్ల కోసం ప్లాన్ చేస్తున్నారా? రూ.10 లక్షల లోపు అద్భుతమైన మోడల్స్ ఇవే..!

Advertisement

ఈవెంట్‌కు మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ హాజరుకానున్నారు. వీరితో పాటు బ్లాక్ రాక్ సీఈఓ ల్యారీ పింక్, బ్లాక్ స్టోన్ ఛైర్మన్ స్టీఫెన్ స్క్వార్జ్ మ్యాన్, డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్, ఇవాంకా ట్రంప్, ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్థాని రానున్నారు. మోర్గన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బెర్క్ షైర్ హాథ్ వే వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పాటు.. కెనెడా, స్వీడన్, ఆస్ట్రేలియా, బలీవియా దేశాల మాజీ ప్రధానులు, భూటాన్ రాజు, రాణి వేడుకకు హాజరవుతారు.

ఈ వేడుకకు వచ్చే విశిష్ట అతిథులకు సాదరంగా స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులకు స్వాగతం పలికేందుకై గుజరాత్‌లోని లాల్‌పుర్, కచ్‌లో మహిళలు తయారు చేసిన కండువాలను సిద్ధం చేశారు. అలాగే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భారతీయ సంస్కృతిని ఇంటర్నేషనల్ సెలబ్రిటీలకు పరిచయం చేయాలని అంబానీ ఫ్యామిలీ ఆలోచిస్తోందట.

ముకేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధికా మర్చంట్ నిశ్చితార్థం గతేడాది జనవరిలో జరిగింది. ముంబైలోని ఆంటిలియాలో సంప్రదాయ పద్ధతిలో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. రిలయన్స్ ఫౌండేషన్ పేరుతో అంబానీ పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే గేట్స్ ఫౌండేషన్ ద్వారా బిల్ గేట్స్ సైతం విద్య, ఆరోగ్య రంగాల్లో సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో అంబానీ పెళ్లిలో వ్యాపార దిగ్గజాలు అందరూ ఒక్కచోట చేరుతుండటంతో మరిన్ని కొత్త ఆలోచనలు పురుడుపోసుకునే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి.

Related News

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

Big Stories

Advertisement
×