BigTV English

7 Seater Cars Under Rs. 10 Lakh: కేవలం రూ. 10 లక్షలకే 7- సీటర్ కారు.. అద్భుతమైన మోడల్స్.. ఓ లుక్కేయండి!

7 Seater Cars Under Rs. 10 Lakh: కేవలం రూ. 10 లక్షలకే  7- సీటర్ కారు.. అద్భుతమైన మోడల్స్.. ఓ లుక్కేయండి!

7-Seater Cars Under Rs 10 Lakhs: ప్రస్తుతం కాలంలో కార్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వినియోగదారుల భధ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ వాహన తయారీ కంపెనీలు అప్‌డేటెడ్ వెర్షన్లతో మార్కెట్‌లోకి కొత్త కొత్త మోడళ్లను పరిచయం చేస్తున్నాయి.


5,7 సీటర్లతో దర్శనమిచ్చి సరికొత్త లుక్‌తో వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ అప్డేటెడ్ వెర్షన్లతో వస్తున్న కార్ల ధరలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. అందువల్ల వీటిని కొనేందుకు చాలామంది ఆసక్తి చూపించడం లేదు. అయితే ఇప్పుడు కేవలం రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే 7-సీటర్ కార్లు, వాటి ధరల గురించి తెలుసుకుందాం..

రూ.10 లక్షల లోపు 7-సీటర్ కార్లు:


రూ.10 లక్షల కంటే తక్కువ ధరకు 7-సీటర్ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇక్కడ మూడు కార్ల జాబితా ఉంది. అందులో మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా బొలెరో/నియో, రెనాల్ట్ ట్రైబర్ వంటి కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్ల ధరలపై ఓ లుక్కేద్దాం.

READ MORE: ఆ కంపెనీ కార్లకే క్రేజ్..

మారుతీ ఎర్టిగా:

మారుతి ఎర్టిగా దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన MPV (Multi-Purpose Vehicle)లలో ఒకటి. అంతేకాకుండా అత్యధికంగా అమ్ముడవుతున్న MPV కూడా ఇదే. అయితే దీని ధర రూ.8.69 లక్షల నుండి రూ.13.03 లక్షల (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.

దీని బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ.10 లక్షల కంటే తక్కువగా ఉంటుంది. అయితే, దీని మిగతా వేరియంట్‌ల ఆన్-రోడ్ ధర రూ.10 లక్షల కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇందులో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు.

రెనాల్ట్ ట్రైబర్:

రెనాల్ట్ ట్రైబర్ దేశంలోనే అత్యంత సరసమైన MPV (Multi-Purpose Vehicle)గా ఉంది. ట్రైబర్ ధర రూ.6 లక్షల నుండి రూ.8.97 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇందులోని వేరియంట్‌ల ఆన్-రోడ్ ధర రూ.10 లక్షల కంటే తక్కువగా ఉంటుంది. ఇది 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది.

READ MORE: ఈ కార్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్స్.. రూ.1.82 లక్షల వరకు.. ఫిబ్రవరి 29 చివరి తేదీ!

మహీంద్రా బొలెరో/బొలెరో నియో:

మహీంద్రా బొలెరో అద్భుతమైన డిజైన్, లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే దీని ధర రూ.9.90 లక్షల నుండి రూ.10.91 లక్షల వరకు ఉంటుంది. అలాగే బొలెరో నియో ధర రూ.9.90 లక్షల నుంచి రూ.12.15 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

అయితే ఇక్కడ తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటటే.. ఈ రెండు వేరియంట్లు కూడా రూ.10 లక్షల కంటే తక్కువ ఆన్-రోడ్ ధరలో అందుబాటులో లేవు. రెండింటిలోనూ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నప్పటికీ బొలెరో నియో ఇంజన్ మరింత శక్తివంతమైనదిగా ఉంది.

Tags

Related News

BSNL Offers: రీఛార్జ్ చేసుకోండి.. 2% డిస్కౌంట్ పొందండి, కస్టమర్లకు BSNL క్రేజీ ఆఫర్!

GST 2.0: కొత్త జీఎస్టీతో పన్ను తగ్గలేదా? నెంబర్ ఇదిగో, సామాన్యుడు ఫిర్యాదు చేయొచ్చు

Dasara Offers: ఫ్లిప్‌ కార్ట్ కళ్లు చెదిరే దసరా ఆఫర్లు, ఎథ్నిక్ వేర్ పై ఏకంగా 85 శాతం తగ్గింపు!

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

Big Stories

×