BigTV English

MLA Lasya Nanditha Car Accident: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో ట్విస్ట్.. ఆ అజాగ్రత్తే ప్రాణం తీసిందా..?

MLA Lasya Nanditha Car Accident: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో ట్విస్ట్.. ఆ అజాగ్రత్తే ప్రాణం తీసిందా..?
MLA Lasya Nanditha Car Accident Details

Reason for MLA Lasya Death: లాస్య నందిత కారు ప్రమాదానికి కారణం ఏంటన్న దానిపై పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఉదయం నుంచి ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ప్రమాదానికి గురైన కారుపై సిమెంట్‌ ఉండటంతో.. సిమెంట్‌ మిక్స్డ్‌ లారీగా నిర్ధారణకు వచ్చారు. కారు వేగంగా ముందుగా వెళ్తున్న సిమెంట్‌ మిక్స్డ్‌ లారీని ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారుపై కాంక్రిట్‌సిమెంట్‌ ఉండటంతో నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కాగా.. లాస్యనందిత కారులో ప్రయాణిస్తున్న సమయంలో సీటుబెల్టు పెట్టుకోలేదని తెలుస్తోంది. ఆ అజాగ్రత్తే ఆమె మృత్యువుకు కారణమైనట్లు పోలీసులు తెలిపారు. సీటుబెల్టు పెట్టుకుని ఉంటే.. తీవ్రగాయాలైనా.. ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేదన్నారు.


అత్యంత పిన్న వయస్సులో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లాస్య నందితను మృత్యువు పదే పదే వెంటాడింది. తెల్లవారుజామున ORRపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్‌ BRS ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం చెందారు. వారం క్రితమే నల్గొండలో జరిగిన ప్రమాదంలో గాయపడి కోలుకున్న లాస్య నందితను.. మరోసారి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువు కాటేసింది. లాస్య నందిత మృతి.. అటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు కార్యకర్తలు, అభిమానులను శోకసంద్రంలోకి నెట్టింది.

ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు పటాన్‌ చెరు సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై.. అదుపు తప్పి ముందుగా వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. లారీ వెనుక భాగంలోకి చొచ్చుకెళ్లిన కారును.. దాదాపు 100 మీటర్ల వరకు లారీ ఈడ్చుకెళ్లి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నందిత అక్కడకక్కడే మృతి చెందగా.. కారు నడిపిన పీఏ ఆకాశ్, డ్రైవర్ లు తీవ్రంగా గాయపడ్డారు. కారు ముందుభాగం నుజ్జు నుజ్జైంది. సదాశివపేటలో ఓ కార్యక్రమానికి హాజరైన లాస్య నందిత.. తిరిగి హైదరాబాద్ వస్తుండగా ORRపై ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వివరించారు.


Read More: బాసర ట్రిపుల్‌ ఐటీలో విషాదం.. హాస్టల్ గదిలో విద్యార్థిని సూసైడ్

లాస్య నందిత కారు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సదాశివపేటలో దర్గాకు కుటుంబ సభ్యులతో వెళ్లిన లాస్య నందిత అక్కడ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం కుటుంబంతో కలిసి మూసాపేట చేరుకున్నారు. ఆ తరువాత పీఏ ఆకాశ్‌తో కలిసి మరోసారి సదాశివపేటకు వెళ్లారు లాస్య. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా పఠాన్‌చెరు వద్ద ORRపై లాస్య కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో లాస్య పీఏ ఆకాశ్‌ కారు నడిపినట్లు తేలింది. లాస్య ఫ్రంట్‌ సీట్‌లో కూర్చుని ఉండగా.. కారు డ్రైవ్‌ చేస్తున్న ఆకాశ్‌ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కారు 100 స్పీడ్‌లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

కంట్మోనెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణవార్త రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఎమ్మెల్యే మృతితో బీఆర్ఎస్ శ్రేణులు షాకయ్యాయి. నిన్నటి వరకు తమ మధ్యే ఉన్న నేత ఇప్పుడు మృత్యుఒడికి చేరుకోవడంతో తీవ్రదిగ్భ్రాంతికి గురయ్యాయి.

Read More: 3 నెలల్లో మూడుసార్లు వెంటాడిన మృత్యువు.. అచ్చిరాని ఫిబ్రవరి

గాంధీ ఆస్పత్రిలో లాస్య నందిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఆమె మృతదేహాన్ని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని నివాసానికి తరలించనున్నారు. లాస్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాంధీ ఆస్పత్రికి చేరుకున్న మాజీ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కల్వకుంట్ల కవిత.. లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.

https://youtu.be/wEQhYQpTtQE?si=WZdva5u9Wu0NdBmu

Tags

Related News

TGSRTC Dasara Offer: బస్సెక్కితే బహుమతులు.. దసరాకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

Weather News: నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక.. పిడుగులు పడే ఛాన్స్

Ganja Seized: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

CM Revanth Reddy: భారీ వర్షాలున్నాయి.. అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశం

Hydra Commissioner: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ..

Telangana New Liquor Shop: తెలంగాణలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

Big Stories

×