BigTV English

Kerala News: కేరళలో సీపీఎం నేత నరికివేత..

Kerala News: కేరళలో సీపీఎం నేత నరికివేత..
kerala news today

CPM local leader hacked to death in Kerala (telugu news live): కేరళలో మరో రాజకీయ నేత హత్యకు గురయ్యారు. సీపీఎం పార్టీకి చెందిన స్థానిక నేత కోళికోడ్ జిల్లాలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో చంపేశారు. హతుడిని పీవీ సత్యనాథన్‌గా గుర్తించారు. కొయిలాండిలోని చెరియపురం ఆలయంలో ఓ ఉత్సవానికి ఆయన హాజరైన సమయంలో దుండగులు మాటు వేసి గొడ్డలితో ఆకస్మికంగా దాడి చేశారు.


ఈ దాడిలో బాధితుడి మెడ, వెనుకభాగంపై వేట్లు పడ్డాయి. రక్తమోడుతున్న సత్యనాథన్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన మరణించారు.

Read more:మణిపూర్ వివాదంలో కొత్తకోణం.. హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమన్న సుప్రీం ధర్మాసనం


హంతకులు పరారు కాగా.. వారు ఎవరన్నదీ గుర్తించాల్సి ఉంది. వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
కొయిలాండి సీపీఎం సెంట్రల్ లోకల్ కమిటీ కార్యదర్శిగా సత్యనాథన్ పనిచేస్తున్నారు. హత్య దరిమిలా సీపీఎం పార్టీ స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చింది.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×