E-Paper
Advertisement

చదువుతూనే సంపాదన.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా మారిన లా స్టూడెంట్.. తొలిరోజు సంపాదన ఎంతంటే?

చదువుతూనే సంపాదన.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా మారిన లా స్టూడెంట్.. తొలిరోజు సంపాదన ఎంతంటే?
Advertisement

Blinkit Delivery: కాలేజీలో చదువుకుంటూనే ఖర్చుల కోసం పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన ఓ లా (LLB) విద్యార్థి బ్లింకిట్ (Blinkit) డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేసి తన మొదటి రోజు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా, అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. విద్యార్థులు ఇలాంటి గిగ్ ఎకానమీ (Gig Economy) ఉద్యోగాలను సద్వినియోగం చేసుకోవడం నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.

ఆరున్నర గంటల్లో 19 ఆర్డర్లు

కవల్ దేశాయ్ అనే ఎల్‌ఎల్‌బీ విద్యార్థి అక్టోబర్ 13న (మంగళవారం) తొలిసారిగా బ్లింకిట్ డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేశారు. తన వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం డబ్బు సంపాదించేందుకు ఈ పార్ట్‌టైమ్ గిగ్‌ను ఎంచుకున్నట్లు దేశాయ్ తెలిపారు. తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రోజంతా తిరిగి కష్టపడి ఆర్డర్లు డెలివరీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన అనుభవాన్ని వివరిస్తూ.. ‘నా తొలి రోజు బాగా ముగిసింది. సుమారు 6 గంటల 30 నిమిషాల వ్యవధిలో మొత్తం 19 ఆర్డర్లను విజయవంతంగా డెలివరీ చేశాను. కేవలం ఆర్డర్ల డెలివరీ కోసమే సుమారు 51 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు.

తొలిరోజు సంపాదన ఎంతంటే?

Advertisement

తొలి రోజు ఆరున్నర గంటల కష్టానికి రూ. 508 ఆర్జింజినట్లు దేశాయ్ తన పోస్ట్ లో తెలిపారు. ఇందులో రూ. 75 ఇన్సెంటివ్‌తో పాటు, నిర్దేశిత లక్ష్యాలను (Delivery Targets) పూర్తి చేసినందుకు అదనంగా వచ్చిన రూ.100 బోనస్ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. పెట్రోల్ ఖర్చు లేకపోవడంతో ఈ లాభం పూర్తిగా తన జేబులోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవడం వల్ల ఎలాంటి అదనపు ఖర్చును తొలి రోజు పెట్టాల్సి రాలేదని తెలియజేశారు. దీంతో తాను సంపాదించిన రూ. 508 నికర ఆదాయంగా మిగిలిందన్నారు.

Also Read: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఒక్క రీఛార్జ్‌తో మరో నెల ఉచితం.. అర్హులు ఎవరో తెలుసా?

సోషల్ మీడియా రియాక్షన్

Advertisement

లా విద్యార్థి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఫుల్ టైమ్‌గా కాకుండా పార్ట్‌టైమ్‌గా బ్లింకిట్ జాబ్ ను వాడుకోవడంపై ప్రశంసల వర్షం కురిపించారు. మరికొందరు మాత్రం రైడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ హితవు పలికారు. ‘రైడింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు బ్రో. నీకు మరింత శక్తి రావాలని కోరుకుంటున్నాను’ అని ఒక యూజర్ పేర్కొన్నారు. మరొకరు స్పందిస్తూ.. ‘సేఫ్‌గా రైడ్ చేయి. ఊహించని ప్రమాదాల నుంచి రక్షణ కోసం నీ వాహనానికి బీమా, నీకు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవడం మర్చిపోవద్దు’ అని హితవు పలికారు.

Also Read: భార్యపై భర్త పైశాచికత్వం.. నచ్చిన కూర వండలేదని.. శరీరంపై పలుమార్లు కొరికి, బండరాయితో దాడి!

Tags

Related News

లింక్డ్‌ఇన్ డేటాతో యువతికి వేధింపులు.. జాబ్ కోసం నంబర్ ఇస్తే.. ఇదా పరిస్థితి?

బంగారం-వెండి ధరలు పతనం, కొనుగోళ్లదారుల్లో ఆనందం, మార్కెట్లో రేటు ఎంత?

పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ఎలా కొంటే లాభం.. ఎక్స్‌పర్ట్స్ ఇస్తున్న సలహలివే?

యూపీఐలో సరికొత్త ఫీచర్.. మీ ఖాతాతో కుటుంబ సభ్యులూ పేమెంట్స్ చేయెుచ్చు.. ఇదెలాగో తెలుసా?

పీఎఫ్ విత్‌డ్రాపై న్యూ రూల్స్.. 10 సార్లు డబ్బులు తీసుకోవచ్చు, డీటేల్స్ ఇవిగో

చెక్ బౌన్స్ టెన్షనా?అకౌంట్ క్లోజ్ చేసే రైట్స్ బ్యాంకులకు ఉన్నాయా?

మారుతున్న పరిణామాలు.. పండగ వేళ బంగారం ధర పతనం, మార్కెట్లో రేటు ఎలా ఉంది?

Big Stories

Advertisement
×