E-Paper
Advertisement

కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటి హరిత!

కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటి హరిత!
Advertisement

Actress Haritha: బుల్లితెరపై అఖిలాండేశ్వరిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి హరిత (Haritha)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డాన్సర్ గా, నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెరపై వరుస సీరియల్స్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా బుల్లితెర సీరియల్స్ తో పాటు పలు సినిమాలలో కూడా నటించిన ఈమె తాజాగా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలోనే తన కొత్త బిజినెస్ కి సంబంధించిన వివరాలను హరిత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

అఖిలాండేశ్వరిగా గుర్తింపు..

ఇటీవల కాలంలో టీవీ సెలబ్రిటీలందరూ కూడా ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు ఎన్నో రకాల బిజినెస్లను ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా చాలామంది క్లాతింగ్ బిజినెస్(Clothing Business) లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హరిత సైతం క్లోతింగ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు అయితే ఈమె తన సీరియల్ పేరుతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం విశేషం. హరిత నటించిన ముద్దమందారం సీరియల్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్లో అఖిలాండేశ్వరిగా ఈమె పోషించిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది.

ముద్దమందారం వస్త్ర నిలయం..

Advertisement

ఇలా తనకు ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చిన ముద్దమందారం సీరియల్ పేరుతోనే ఈమె ముద్దమందారం వస్త్ర నిలయం(Muddamandaram Vastra Nilayam) పేరుతో చీరల వ్యాపారాన్ని ప్రారంభించారు హైదరాబాద్ నార్సింగ్ ఏరియాలో ఈమె ఈ స్టోర్ ప్రారంభించినట్టు తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. కొత్త బిజినెస్ ప్రారంభించిన విషయాన్ని హరిత ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. ప్రతి చీర ఒక కథ చెబుతుంది.. ప్రతి సాంప్రదాయం ఒక జ్ఞాపకంగా మారుతుంది.. మీ అందరి దీవెనలు కావాలి అంటూ ముద్దమందారం వస్త్ర నిలయం గురించి ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

?rpxt=MTZhOXJwdmNwYW55aw%3D%3D

Advertisement

ఈ విధంగా హరిత తన కొత్త వ్యాపారాన్ని ప్రారంభించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు కూడా ఈమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. హరిత ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ అంటూ ఇప్పటికే భారీ స్థాయిలో సంపాదన అందుకుంటున్నారు. ఇక తాజాగా బిజినెస్ రంగంలోకి కూడా ఈమె అడుగు పెట్టడం విశేషం. ఇక ఈమె సీరియల్స్ విషయానికి వస్తే ప్రస్తుతం హరిత ఈటీవీలో ప్రసారమవుతున్న జానకి పరిణయం అనే సీరియల్ లో రుద్రాణి అనే నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో ఈమె కుంకుమపువ్వు, ముద్దమందారం, ఋతురాగాలు, కళ్యాణం కమనీయం వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.

Also Read: తన జీవిత గాథ అలానే ముగియాలి..తన బయోపిక్ మూవీ పై సల్మాన్ ఖాన్ కామెంట్స్!

Related News

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేసిన త్రిగుణ్!

ఫోక్ సింగర్ మధుప్రియ ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

చిన్న మిస్టేక్.. కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. అసలేం జరిగిందంటే?

హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్.. మరీ అంత బుర్ర తక్కువా?

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Big Stories

Advertisement
×