Credit Card Mistakes: మీరు కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్నారా? అయితే కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. స్టార్టింగ్ లో చక చకా కొనుగోలు చేస్తుంటారు. కానీ బిల్లు చెల్లింపులలో అసలు ఇబ్బందులు ఉంటాయి. క్రెడిట్ కార్డు లిమిట్ విషయంలో కూడా చాలా మంది ఇలానే పొరపడుతుంటారు. క్రెడిట్ లిమిట్ ను అదనపు ఆదాయంగా భావిస్తుంటారు. కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్న ఈ నాలుగు తప్పులు చేయొద్దంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ క్రెడిట్ కార్డ్ బిల్లును ఎప్పుడూ మిస్ చేయవద్దు. పొరపాటున ఒకసారి ఆలస్యం అయితే.. ఆ తర్వాత భారీ భారం పడుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్లును ఎప్పుడూ గడువు తేదీలోగా చెల్లించాలి. పేమెంట్ ఆలస్యమైతే, రివాల్వింగ్ క్రెడిట్ పై భారీగా వడ్డీ పడుతుంది. కొన్నిసార్లు ఏడాదికి 50 శాతం వరకు ఇది పెరుగుతుంది.
కొన్నిసార్లు అనవసర ఖర్చులు చేస్తుంటాం. కరెన్సీ మారకం అస్థిరంగా ఉన్నప్పుడు లగ్జరీ వస్తువుల కొనుగోలు, విదేశీ ప్రయాణాలు వద్దంటున్నారు ఎక్స్ పర్ట్స్.
క్రెడిట్ కార్డులను తెలివిగా ఉపయోగిస్తే రివార్డులు, క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు లభిస్తాయి. బిల్లింగ్ సైకిల్, ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ పీరియడ్ ను అర్థం చేసుకుంటే, అనవసరమైన ఖర్చులు లేకుండా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.
క్రెడిట్ కార్డు లిమిట్ ను చాలా మంది అదనపు ఆదాయంగా భావిస్తారు. కానీ అది అప్పు మాత్రమే. చివరికి, అప్పు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డును ఆన్ లైన్ కొనుగోళ్లకు, రివార్డుల కోసం లేదా ఓవర్‌డ్రాఫ్ట్ గా ఉపయోగించవచ్చు. కానీ మీ ఆదాయానికి ప్రత్యామ్నాయం కాదు. మీ క్రెడిట్ లిమిట్ ను అదనపు ఆదాయంగా భావించి ఖర్చు చేస్తే తిప్పలు తప్పవు.
క్రెడిట్ కార్డు వాడకం ఫైనాన్షియల్ పజిల్ లాంటిది. అప్పు చేయకుండా ఉండేందుకు క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. కానీ చాలా మంది అనవసరాల కోసం ఖర్చు చేస్తుంటారు. క్రెడిట్ కార్డులో ఖర్చు చేసే ముందు అప్పు తీర్చే సామర్థ్యంపై అంచనా వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: క్రెడిట్ కార్డు ఖర్చులు కంట్రోల్ ఉంచే 6 టిప్స్
1. ఎమర్జెన్సీ ఫండ్ : ఎమర్జెన్సీ పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి క్రెడిట్ కార్డు వాడుకోవచ్చు. ఎక్కువ వడ్డీకి అప్పు చేయవలసిన అవసరం లేకుండా ఇది ఉపయోగపడుతుంది.
2. స్టాక్‌లు, బాండ్‌లు, గోల్డ్, విదేశీ ఆస్తులు సహా వివిధ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలను నిర్వహించడానికి క్రెడిట్ కార్డు అమౌంట్ వాడుకోవచ్చు.
3. ఆటోమేటెడ్ సేవింగ్ : ఆటోమేటెడ్ సేవింగ్స్ కోసం క్రెడిట్ కార్డులను వాడుకోవచ్చు. దీంతో మీ పెట్టుబడలకు మార్కెట్ ఒడిదుడుకుల భయం ఉండదు.