Vastu Tips: చాలా మంది ఎంత సంపాదించినా చేతిలో.. చిల్లిగవ్వ కూడా మిగలడం లేదని బాధపడుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం దీనికి ఇంటి ఉత్తర దిశలో ఉండే దోషాలే కారణం కావచ్చు. ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు. ఈ దిశను సరిగ్గా మేనేజ్ చేస్తే.. ఆర్థిక అవకాశాలు మెరుగు పడటమే కాకుండా.. వ్యాపారంలో లాభాలు కూడా వస్తాయి. డబ్బు ఆకర్షించబడాలన్నా, కెరీర్‌లో గ్రోత్ ఉండాలన్నా ఉత్తర దిశలో పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర దిశ వాస్తు – సంపద, ఆర్థిక అభివృద్ధికి చిట్కాలు:
హిందూ ధర్మశాస్త్రం , వాస్తు ప్రకారం, ఉత్తర దిశ అత్యంత పవిత్రమైనది. దీనిని సంపదకు మూలమైన ‘కుబేర దిశ’ అంటారు. ఈ దిశను ఎంత శుభ్రంగా.. ఖాళీగా ఉంచితే అంతగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
1. నీటి మూలం:
ఉత్తర దిశ నీటికి సంకేతం. అందుకే ఈ దిశలో నీటికి సంబంధించిన వస్తువులు ఉండటం చాలా మంచిది.
నీటి ఫౌంటెన్: ఇంటి ఉత్తర దిశలో ఒక చిన్న నీటి ఫౌంటెన్ లేదా నీటి కుండను ఉంచండి. నీరు ఎప్పుడూ కదులుతూ ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ వృద్ధి చెందుతుంది.
అక్వేరియం: ఉత్తర దిశలో అక్వేరియం ఉంచడం వల్ల ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఇందులో కనీసం ఒక నల్లటి చేప,ఎనిమిది గోల్డ్ ఫిష్‌లు ఉండేలా చూసుకోండి.
2. రంగుల ఎంపిక:
ఉత్తర దిశలో రంగులు కూడా డబ్బు ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి.
ఈ దిశలోని గోడలకు నీలం లేదా ఆకుపచ్చ రంగులు వేయడం బెస్ట్.
ఎరుపు, మెరూన్ వంటి ముదురు రంగులను ఈ దిశలో వాడకూడదు. ఎందుకంటే అవి అగ్ని తత్వానికి సంకేతం, ఇది ఉత్తర దిశకు వ్యతిరేకం.
3. కుబేర యంత్రం, విగ్రహం:
డబ్బు లావాదేవీలు చేసే చోట లేదా ఆఫీసులో ఉత్తర దిశలో కుబేర యంత్రాన్ని ఉంచండి. అలాగే లక్ష్మీదేవి, కుబేరుడు కలిసి ఉన్న ఫోటో ఈ దిశలో ఉంచడం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
4. మొక్కలు:
ఉత్తర దిశలో పచ్చదనం ఉండటం చాలా శుభప్రదం.
మనీ ప్లాంట్: నీలం రంగు బాటిల్ లేదా కుండలో మనీ ప్లాంట్‌ను ఉత్తర దిశలో పెంచండి. ఇది ధనాన్ని ఆకర్షిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
కాక్టస్ లేదా ముళ్ల మొక్కలను మాత్రం ఇక్కడ అస్సలు ఉంచకూడదు.
Also Read: మంచం కింద సామాన్లు పెడుతున్నారా? వాస్తు ప్రకారం అది ఎంత ప్రమాదమో తెలుసా?
5. ఉత్తర దిశలో చేయకూడని పనులు :
బరువులు ఉండకూడదు: ఉత్తర దిశ ఎప్పుడూ తేలికగా.. ఖాళీగా ఉండాలి. ఇక్కడ మెట్లు, బీరువాలు లేదా స్టోర్ రూమ్‌లు ఉండకూడదు.
చెత్తాచెదారం: ఈ దిశలో చెత్తను లేదా మురికిని ఉంచితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి.
టాయిలెట్: ఉత్తర దిశలో టాయిలెట్ ఉంటే.. అది తీవ్రమైన ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది. ఒకవేళ ఉంటే దానికి తగిన వాస్తు నివారణలు చేసుకోవాలి.
6. సేఫ్ లేదా లాకర్ స్థానం:
మీరు డబ్బు దాచుకునే బీరువా లేదా సేఫ్ బాక్స్‌ను ఇంటి దక్షిణ గోడకు ఆనించి ఉంచాలి. అది తెరిచినప్పుడు దాని ముఖం ఉత్తరం దిశకు ఉండాలి. ఇలా ఉండటం వల్ల కుబేరుడు మీ సంపదను ఎప్పుడూ నిండుగా ఉంచుతారని నమ్మకం.