E-Paper
Advertisement

స్వతహాగా ఆదివారాలు, రాత్రిళ్లు కూడా పనిచేస్తున్న ఆ కంపెనీ ఉద్యోగులు.. డబ్బు కోసం కాదు

స్వతహాగా ఆదివారాలు, రాత్రిళ్లు కూడా పనిచేస్తున్న ఆ కంపెనీ ఉద్యోగులు.. డబ్బు కోసం కాదు
Advertisement

Spite Motivation Work| బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీలో ఉద్యోగుల పని తీరు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది.
సాధారణంగా ఉద్యోగులను ఎక్కువగా పనిచేయించేందుకు కంపెనీలు బోనస్‌లు, ఇన్సెంటివ్‌లు, ఈక్విటీలు అందిస్తుంటాయి. అయితే, ఓ కంపెనీలో మాత్రం లభించకపోయినా ఉద్యోగులు తీవ్రంగా శ్రమపడుతున్నారు. దీనంతటికి కారణం ప్రత్యర్థి కంపెనీ. ఓ మాజీ కస్టమర్ తమకు ప్రత్యర్థిగా మారడంతో ఉద్యోగుల్లో పోటీ భావన పెరిగిందని సంస్థ వ్యవస్థాపకుడు తెలిపారు. దీంతో కొందరు ఉద్యోగులు రాత్రిళ్లు, ఆదివారాల్లో కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.

మాజీ కస్టమర్ ప్రత్యర్థి కంపెనీ స్థాపించడంతో సమస్యలు

ReferRush CEO ‘విక్రమ్ పై’ ఈ ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో షేర్ చేశారు. తమ టీమ్‌తో ఓ మాజీ కస్టమర్ చాలా దారుణంగా వ్యవహరించాడని ఆయన తెలిపారు. ఆ తర్వాత అదే వ్యక్తి తమకు పోటీగా మరో ఉత్పత్తిని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామం ఉద్యోగుల్లో తీవ్ర పోటీ భావనను కలిగించిందని విక్రమ్ తెలిపారు.

బోనస్‌లు, ఇన్సెంటివ్‌లు చేయలేకున్నా

Advertisement

టీమ్ వేగంగా పనిచేయాలని గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశానని విక్రమ్ తన పోస్ట్‌లో చెప్పారు. అందులో బోనస్‌లు, ఇన్సెంటివ్‌లు, డెడ్‌లైన్‌లు, ఈక్విటీ వంటి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించానన్నారు. అయితే, ఇవేవీ ఉద్యోగుల్లో ఇప్పుడు కనిపిస్తున్నంత ఉత్సాహాన్ని తీసుకురాలేకపోదట. ప్రత్యర్థి రావడంతో మాత్రం ఉద్యోగులు తమ పనిని మరింత వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

వరుసగా మూడు ఆదివారాలు పనిచేయడానికి ఉద్యోగులు సిద్ధం

విక్రమ్ తన పోస్టులో ఓ ఉద్యోగి మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. ఆ ఉద్యోగి మూడు వారాల పాటు ఆదివారాల్లో కూడా పనిచేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితి వస్తే మాత్రం ఆ పని నుంచి మినహాయింపు ఉంటుందని ఉద్యోగి పేర్కొన్నారు.
ఈ స్పందన చూసి కంపెనీ వ్యవస్థాపకుడు కూడా ఆశ్చర్యపోయారు. ‘కసి’ కూడా ఉద్యోగులకు బలమైన ప్రేరణగా మారవచ్చని ఆయన సరదాగా అన్నారు.

Advertisement

ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొంతమంది ఉద్యోగులకు పోటీ భావన నిజంగానే బలమైన ప్రేరణ ఇస్తుందని చాలా మంది ఏకీభవించారు. మరికొందరు మాత్రం ఈ విధంగా ఎక్కువ గంటలు పనిచేయడం ఎంతకాలం కొనసాగుతుందని ప్రశ్నించారు.

Also Read: నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

ఈ ఘటన ఉద్యోగుల ప్రేరణపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. డబ్బు, ప్రమోషన్లు మాత్రమే ఉద్యోగులను ప్రేరేపించే అంశాలు కావని ఈ ఘటన సూచిస్తోంది. గెలవాలనే పట్టుదల, పోటీ, సంస్థపై బాధ్యత, గుర్తింపు వంటి భావాలు కూడా ప్రభావం చూపుతాయి. అయితే, రాత్రిళ్లు, ఆదివారాల్లో నిరంతరం పనిచేయడం దీర్ఘకాలంలో అలసటకు దారితీస్తాయి. అందుకే పోటీ భావనను శాశ్వత ఉద్యోగ ప్రోత్సాహకంగా ఉపయోగించడం సాధ్యం కాకపోవచ్చు.

Also Read: ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Related News

దేశంలో అతిపెద్ద జియో ఐపీఓ.. బుధవారం నుంచి ప్రారంభం, 22 శాతానికి చేరిన జీఎంపీ

చమురు ధరలకు రెక్కలు.. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర 110 డాలర్లు, వచ్చేనెల ధరలు పెరిగే ఛాన్స్

ఖర్చు చేసేటప్పుడు కుటుంబం, స్నేహితులకు స్పష్టమైన హద్దులు పెట్టండి.. ఆర్థిక క్రమశిక్షణకు 7 టిప్స్

భర్త సంపాదన నెలకు రూ.1.5 లక్షలు.. అయినా భార్యకు భరణం ఇవ్వకూడదని చెప్పిన కోర్టు.. ఎందుకంటే

స్టాక్‌మార్కెట్‌లో బ్లాక్ మండే.. కొంప ముంచిన ఆ రంగాల షేర్లు, 4 లక్షల కోట్ల సంపద ఆవిరి

భారీ ఖర్చు చేశాక పెళ్లి వాయిదా లేదా రద్దు అయిందా.. ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ ఉందిగా

ఆస్తులు బోలెడున్నా చేతిలో నగదు ఉండదు.. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక కష్టాలు నివారించడానికి ఇలా చేయండి

పెళ్లిలో లభించిన బహుమతులుపై ట్యాక్స్ కట్టాలా? ఆదాయపు పన్ను నిబంధనలు ఇవే..

Big Stories

Advertisement
×