Hyderabad JNTU: హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య ఏం జరిగింది? విద్యార్థులు రెండు గ్రూపులుగా ఎందుకు చెదిరిపోయారు? ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? పాత గొడవల నేపథ్యమా? లేకుంటే అమ్మాయి వ్యవహారమా? ఈ గొడవకు అసలు కారణమేంటి? పోలీసుల విచారణలో ఏం తేలనుంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
హైదరాబాద్‌లో జేఎన్టీయూ క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణతో రణరంగంగా మారింది. అర్ధరాత్రి రెండు వర్గాలకు చెందిన విద్యార్థులు దాడులకు దిగారు. ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ గొడవల్లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 8 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ విద్యార్థి వర్గాల మధ్య ఘర్షణ వెనుక ఏం జరిగింది? మహిళా స్నేహితురాలిపై ఓ స్టూడెంట్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలు విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అప్పుడు సమయం రాత్రి 2:30 గంటలు అవుతోంది. అదే సమయంలో క్యాంపస్‌లో తీజ్ పండుగ వేడుకల సందర్భంగా ఓ విద్యార్థిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ అంశాలు కలిసి విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీసినట్టు సమాచారం .
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోల్లో హాస్టల్ గేట్ల వద్ద విద్యార్థుల గుంపులు కొట్టుకుంటున్నట్లు దృశ్యాలు కనిపించాయి. కొందరు కర్రలు పట్టుకుని మరికొందరిపై దాడి చేసినట్టు ఉంది. విద్యార్థుల రెండు గ్రూపులు మంజీరా-గౌతమి హాస్టల్‌లకు చెందినవారని పోలీసులు చెబుతున్నారు. మొదట మంజీరా హాస్టల్ లోపల జరిగిన చిన్న గొడవ, ఆ తర్వాత ముదిరి యూనివర్సిటీ గేటు వైపుకు వ్యాపించినట్టు తెలుస్తోంది. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది
మొత్తం 19 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు 8 మంది విద్యార్థుల అరెస్ట్ చేశారు. పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని డీసీపీ వెల్లడించారు. ఘర్షణ సమయంలో విద్యార్థులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ చేస్తున్నామని, జరిగిన ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేఎన్టీయూ ప్రిన్సిపల్ డాక్టర్ జి.వి. నరసింహారెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న విద్యార్థుల కోసం గాలింపు చేపట్టారు పోలీసులు.
Tension prevailed at the Jawaharlal Nehru Technological University (JNTU) Hyderabad hostel in Kukatpally after a group of https://t.co/t2vTz2Y9AK students allegedly clashed during Teej celebrations on Thursday night, leaving several students injured.
According to reports,… pic.twitter.com/hS7GMO3HJf
— Hate Detector 🔍 (@HateDetectors) September 4, 2026