E-Paper
Advertisement

అరె వా ఏమి సౌండ్! బడ్జెట్‌లో నంబర్ 1 పార్టీ స్పీకర్ ఇదే..

అరె వా ఏమి సౌండ్! బడ్జెట్‌లో నంబర్ 1 పార్టీ స్పీకర్ ఇదే..
Advertisement

GOBOULT Groove 20W : ప్రస్తుత కాలంలో మ్యూజిక్ లవర్స్ కేవలం సౌండ్ క్వాలిటీ మాత్రమే కాకుండా.. డిజైన్, లుక్స్ , పోర్టబిలిటీకి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ బ్రాండ్ అయిన బోల్ట్ సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ స్పీకర్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. జెట్ బ్లాక్ రంగులో ఉండే.. ఈ స్పీకర్ చూడటానికి ఎంతో స్టైలిష్‌గా, మోడ్రన్‌గా ఉండటమే కాకుండా పర్ఫెక్ట్ పార్టీ వైబ్స్‌ను అందిస్తుంది. అంతే కాకుండా దీన్ని ఎక్కడికైనా ఈజీగా మీ బ్యాగులో సర్దుకుని తీసుకెళ్లొచ్చు, ఇది మీ ప్రయాణాలకు, ట్రిప్స్‌కు మంచి మ్యూజిక్ పార్టనర్‌గా ఉంటుంది. దీని డిజైన్ కూడా రోజువారీ వాడకానికి కూడా  ఎంతో అనుకూలంగా ఉంటుంది.

పూర్తి వివరాలు:

పవర్ ఫుల్ సౌండ్:

ఈ స్పీకర్ పేరుకు తగ్గట్టుగానే ఏకంగా 20 వాట్ల పవర్ ఫుల్ ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇది ఈ బడ్జెట్‌లో నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఇందులో వాడిన డ్యూయల్ డైనమిక్ డ్రైవర్లు, పాసివ్ బాస్ రేడియేటర్ కారణంగా క్రిస్టల్ క్లియర్ వాయిస్‌తో.. పాటు డీప్ బేస్ లభిస్తుంది. చిన్నపాటి హౌస్ పార్టీలకు, ఇండోర్ గ్యాథరింగ్స్‌కు లేదా అవుట్‌డోర్ పిక్నిక్‌లకు ఈ స్పీకర్ సౌండ్  సరిపోతుంది. పాటల్లోని చిన్న బీట్‌ను, హై ఫ్రీక్వెన్సీ వాయిస్‌ను కూడా చాలా స్పష్టంగా వినేలా ఇది అద్భుతమైన ఆడియో ఫీల్ ఇస్తుంది. మీ రూమ్ మొత్తం మ్యూజిక్‌తో నిండిపోవాలంటే.. ఈ 20W స్పీకర్ చక్కటి ఆప్షన్.

ఆకర్షణీయమైన లైటింగ్:

Advertisement

పార్టీ మూడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు ఇందులో ప్రత్యేకమైన డైనమిక్ ఆర్జీబీ ఎల్ఈడీ లైట్లను వాడారు. మ్యూజిక్ బీట్స్‌కు, రిథమ్‌కు తగినట్లుగా ఈ లైట్లు ఆటోమేటిక్‌గా మారుతుంటాయి. ఇది చూడటానికి కంటికి చాలా ఆకర్షణీయంగా ఉండి అచ్చం మినీ డిస్కో థియేటర్ ఫీల్ కలిగిస్తుంది. చీకటి రూమ్స్ లో లేదా రాత్రి పూట జరిగే చిన్న పార్టీల్లో ఈ లైటింగ్ సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. లైటింగ్ లవర్స్ కు పార్టీ యానిమేషన్ కోరుకునే వారికి ఈ ఫీచర్ బాగా నచ్చుతుంది.

లేటెస్ట్ కనెక్టివిటీ ఆప్షన్లు:

ఈ స్పీకర్‌లో అందించిన లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ కారణంగా.. స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా లాప్‌టాప్‌కు క్షణాల్లో కనెక్ట్ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా పాటలను మీరు ఎంజాయ్ చేయొచ్చు. బ్లూటూత్‌తో పాటు USB డ్రైవ్, TF కార్డ్ , AUX సపోర్ట్ వంటి మల్టీ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఇందులో.. ఉంటాయి. దీని వల్ల మీ దగ్గర బ్లూటూత్ డివైస్ లేకపోయినా.. పెన్ డ్రైవ్ ద్వారా నేరుగా.. పాటలు ప్లే చేసుకోవచ్చు. అంతేకాకుండా.. ఒకే సమయంలో రెండు స్పీకర్లను కనెక్ట్ చేసి మరింత ఎక్కువ సౌండ్ ఆస్వాదించేలా పవర్ ఫుల్ TWS మోడ్ సపోర్ట్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.

Advertisement

Also Read:  రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ సపోర్ట్:

ఒక పోర్టబుల్ స్పీకర్ విషయంలో.. బ్యాటరీ బ్యాకప్ అనేది అత్యంత కీలకం. ఈ విషయంలో.. ఈ మోడల్ యూజర్లను ఎక్కడా నిరాశపరచదు. ఇందులో ఉన్న పవర్ ఫుల్ బ్యాటరీ కారణంగా, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 8 గంటల వరకు నిరంతరం  మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు ఛార్జింగ్ గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీనికి  టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం వలన త్వరగా ఛార్జ్ అవుతుంది.

రూ. 2,199 బడ్జెట్ ధర పరిధిలో బెస్ట్ లుక్స్, 20W పవర్ ఫుల్ సౌండ్, డ్యూయల్ డ్రైవర్లు , అట్రాక్టివ్ RGB లైటింగ్ కోరుకునే వారికి ఈ మోడల్ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే ప్రతీ మ్యూజిక్ లవర్‌కు ఈ స్పీకర్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. మీరు కూడా ఒక మంచి బడ్జెట్ పార్టీ స్పీకర్ కొనాలని ఆలోచిస్తుంటే ఇది మీకు బెస్ట్.

Related News

మెకానికల్ కీబోర్డ్ కొనేముందు ఈ 5 విషయాలు తెలుసుకోకపోతే తిప్పలు తప్పవు!

ఇంటి గోడనే స్క్రీన్‌లా మార్చేయండి! ఇక టీవీ కొనేపనే లేదు, ఈ ప్రొజెక్టర్ ఉంటే చాలు

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

Big Stories

Advertisement
×