E-Paper
Advertisement

Okaya Electric Scooters: ఆఫర్లే ఆఫర్లు.. రూ.1తో బుక్ చేసుకోవచ్చు.. రూ.31,000 భారీ డిస్కౌంట్.. ఎప్పటివరకంటే..?

Okaya Electric Scooters: ఆఫర్లే ఆఫర్లు.. రూ.1తో బుక్ చేసుకోవచ్చు.. రూ.31,000 భారీ డిస్కౌంట్.. ఎప్పటివరకంటే..?
Advertisement

Okaya Electric Scooter Offers: పండుగ సీజన్ మొదలైపోయింది. వాహనాలు కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఎందుకంటే ప్రముఖ వాహన తయారీ కంపెనీలు తమ వెహికల్స్‌పై భారీ తగ్గింపులను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా ప్రతి నెల మాదిరిగానే ఈ ఆగస్టు నెలలో కూడా పలు కంపెనీలు తమ వాహనాలపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరో కంపెనీ తన వాహనాలపై ఆఫర్లు ప్రకటించింది. అందువల్ల తక్కువ ధరలో ఒక మంచి స్కూటర్‌ని కొనుక్కోవాలంటే ఇదే సరైన సమయం.

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఒకాయా ఈవీ (Okaya EV) తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఈ నెలలో భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. Okaya Electric Scooter కొనేవారి కోసం వివిధ ఫైనాన్స్ స్కీమ్‌లను తీసుకొచ్చింది. వీటితో సహా కొత్తగా Electric Scooter కొనాలనుకునే వారికోసం మరో ఆఫర్ అందిస్తుంది. కస్టమర్లు తమకు నచ్చిన మోడల్‌ని రూ.1కి బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదండోయ్ ఈ ఆగస్టు నెలలో ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్‌ను కొనుక్కుంటే ఏకంగా రూ.31,000 వరకు బెనిఫిట్స్‌ అందిస్తున్నట్లు తెలిపింది.

Advertisement

Also Read: ధర తక్కువ మైలేజ్ ఎక్కువ.. మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు..!

అందువల్ల ఎప్పటి నుంచో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుక్కోవాలని అనుకున్నవారికి ఇది చక్కటి అవకాశం. ఈ ఆఫర్లతో ఒకాయా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు భారీగా తగ్గుతాయి. ఈ స్కూటర్‌ ప్రారంభ ధరల విషయానికొస్తే.. రూ.78,557గా ఉండగా ఇప్పుడు రూ .74,899 నుంచే స్టార్ట్ అవుతాయి. అలాగే లాగ్‌షిప్‌ ఇ-స్కూటర్‌ మోటోఫాస్ట్ రూ.1.54 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ .1.29 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. ఇక ఒకాయా ఫాస్ట్ ఎఫ్3 మునుపటి ధర రూ .1.34 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ .1.09 లక్షలకే పొందొచ్చు. కంపెనీ తమ వాహనాల సేల్ మరింత పెంచుకునేందుకు ఫైనాన్స్ స్కీమ్స్‌ని తీసుకొచ్చింది. అలాగే కొనుగోళ్లపై 100% లోన్స్‌ అందిస్తుంది. ఈ ఆఫర్లు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

అంతేకాకుండా కంపెనీ ఈఎంఐ ఆప్ఫన్‌ కూడా అందిస్తుంది. ప్రతి నెలా EMI రూపంలో రూ.2,999 లు చెల్లించాల్సి ఉంటుంది. కాగా కంపెనీ ఫెర్రాటో డిస్ట్రప్టర్ ఎలక్ట్రిక్ మోటార్ స్కూటర్‌‌పై ఎలాంటి ఆఫర్‌ని ప్రకటించలేదు. కాగా డిస్ట్రప్టర్ ఎలక్ట్రిక్ మోటార్ స్కూటర్‌‌‌లో లిట్ సీట్లు, డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్ సెటప్, ఫేరింగ్ సైడ్ స్కర్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కాగా ఈ ఆఫర్లకు ఓ కండీషన్ కూడా కంపెనీ పెట్టింది. ప్రస్తుతం షోరూమ్‌ల్లో స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Related News

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

Big Stories

Advertisement
×