BigTV English

Storie Epic Electric Scooter: ధర తక్కువ మైలేజ్ ఎక్కువ.. మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు..!

Storie Epic Electric Scooter: ధర తక్కువ మైలేజ్ ఎక్కువ.. మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు..!
BattRE Storie EPIC Launched: ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరిగిపోయింది. అందులోనూ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనే వారు అధికం అయిపోయారు. పెట్రోల్ ధరలు పెరగడంతో వాటి ఖర్చులు తగ్గించుకునేందుకు వీటివైపు మొగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా స్కూటర్లు ప్రతి ఒక్కరికీ నిత్యవసర వస్తువుగా మారిపోయాయి. తమ పిల్లలను స్కూల్‌కి డ్రాప్ చేయడానికి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి, ట్రాఫిక్‌లో సులువుగా డ్రైవ్ చేయడానికి స్కూటర్లు ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అందువల్లనే ప్రతి ఒక్కరూ వీటినే ఎంచుకుంటున్నారు.

దీంతో ప్రముఖ కంపెనీలు సైతం కొత్త కొత్త స్కూటర్లను ఎలక్ట్రిక్ రూపంలో తీసుకొస్తూ వాహన ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరో కంపెనీ తన లైనప్‌లో ఉన్న ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అతి తక్కువ ధలో లాంచ్ చేసింది. ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాల తయారీ కంపెనీ BattRE ఇటీవల స్టోరీ ఎపిక్ పేరుతో ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేసింది. రోజు వారి ప్రయాణానికి ఈ స్కూటర్ బెస్ట్‌గా కంపెనీ చెప్పుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్‌పై 100 కి.మీ పైగా మైలేజీ అందిస్తుంది.


Also Read: ఆగండి ఆగండి.. ఎలక్ట్రిక్‌ స్కూటర్ కొంటున్నారా.. దీనిపై వేలల్లో తగ్గింపు పొందొచ్చు..!

అంతేకాకుండా ఇది గంటకు 65 కి.మీ గరిష్ట వేగంతో పరుగులు పెడుతుంది. కాగా కంపెనీ ఈ స్కూటర్‌ బ్యాటరీపై 3 ఏళ్లు లేదా 30,000 కి.మీ వారంటీని అందిస్తున్నట్లు తెలిపింది. ఇక దీని ధర విషయానికొస్తే.. ఈ స్టోరీ ఎపిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ.84,999 ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ అయింది. ఇందులో 60V 40Ah బ్యాటరీ IP67 రేటెడ్‌తో వస్తుంది. అంటే ఇది వాటర్ అండ్ డస్ట్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇందులో రిమూవబుల్ బ్యాటరీని అందించారు.


అందువల్ల ఛార్జింగ్ అయిపోయినా ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. స్కూటర్‌లో బ్యాటరీ రిమూవ్ చేసి ఛార్జింగ్ పాయింట్‌కు వెళ్లి పెట్టుకోవచ్చు. కాగా బ్యాటరీ ఫుల్‌గా ఛార్జింగ్ చేయడానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించారు. దీని ద్వారా బ్యాటరీ టెంపరేచర్, ఛార్జింగ్ టైం వంటి ఇన్‌ఫర్‌మేషన్‌ను చూపిస్తుంది. ఈ స్కూటర్‌ను బాడీ మెటల్‌తో తయారు చేశారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కలర్ల విషయానికొస్తే.. ఇందులో ఎక్రూ ఎల్లో, ఐస్ బ్లూ, స్టార్‌లైట్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, స్టార్మీ గ్రే, గన్‌మెటల్, పెరల్ వైట్, బ్లేజింగ్ బ్రాంజ్, కాస్మిక్ బ్లూ, హంటర్ గ్రీన్ బ్లాక్, గోల్డ్ రష్ వంటి కలర్ ఆప్షన్లలో ఈ ఈవీ స్కూటర్ రానుంది.

Related News

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Big Stories

×