BigTV English

McDonald Shravan Burger: శ్రావణ మాసం మెక్‌డొనాల్డ్స్ స్పెషల్ బర్గర్.. మండిపడుతున్న నెటిజెన్లు!

McDonald Shravan Burger: శ్రావణ మాసం మెక్‌డొనాల్డ్స్ స్పెషల్ బర్గర్.. మండిపడుతున్న నెటిజెన్లు!

McDonald Sawan Burger| కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీలు ప్రతి సీజన్ లో ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ప్రస్తుతం హిందువులకు పవిత్రమైన శ్రావణ మాసం నడుస్తోంది. ఈ నెలంతా హిందువులు మహాశివుడి పూజలు చేస్తుంటారు. హిందువులు ఈ నెలలో మాంసాహారం తినరు. చాలామంది ఉల్లి, వెల్లులి కూడా ముట్టుకోరు. అందుకే హిందూ కస్టమర్ల కోసం మెక్ డొనాల్డ్స్ కొత్త మెనూ తీసుకువచ్చింది. మెనూలో పూర్తిగా వెజ్ బర్గర్లు ఆఫర్ చేస్తోంది.


మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ లో మెక్ చీజ్ బర్గర్, మెక్ ఆలూ టిక్కీ ఈ కొత్త మెనూలో శ్రావణ మాసం స్పెషల్ ఐటెమ్స్ గా ఉన్నాయి. ఈ వెజ్ బర్గర్లలో ఇందులో ఉల్లి, వెల్లులి కూడా ఉపయోగించ లేదని తెలిపింది. అయితే సోషల్ మీడియాలో మెక్ డొనాల్డ్స్ వెజ్ బర్గర్లపై నెటిజెన్లు మండిపడుతున్నారు.

మెక్ డొనాల్డ్స్ శ్రావణ మాసం స్పెషల్ బర్గర్ల గురించి ఒక ఇన్స్‌టాగ్రామ్ యూజర్ ‘ఈట్ అరౌండ్ ది సిటీ’ అనే వీడియో షేర్ చేశాడు. ఈ వీడియో బర్గర్లు ప్యూర్ వెజిటేరియన్ అని.. ఈ నెలలో మాత్రమే లభించే ఈ బర్గర్లు చాలా రుచికరంగా ఉన్నాయంటూ వీడియోలో చెప్పాడు. మెక్ డొనాల్డ్స్ ఇండియా వెజ్ బర్గర్ల ప్రత్యేక కిచెన్ లో తయారు చేయడం జరుగుతుందని, నాన్ వెజ్ బర్గర్లు తయారు చేసే ప్రదేశం విడిగా ఉందని తెలిపాడు. అయితే అతని వీడియోపై యూజర్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.


ఈ వెజ్ స్పెషల్ బర్గర్లన్నీ కంపెనీ పబ్లిసిటీ కోసమే చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు. అసలు బర్గర్ తయారు చేయడానికి ఉపయోగించే మైదా పిండి కూడా శ్రావణ మాసంలో తినకూడదని ఒక యూజర్ పోస్ట్ చేశాడు. మరి కొందరైతే.. ”పవిత్రమైన శ్రావణ మాసంలో ఇంటి భోజనం చేయలేమా? బయటి భోజనం ఎందుకు?” అని ప్రశ్నిస్తున్నారు.

Also Read:  ‘నా ఇష్టం మీకేంటి?’.. 16 ఏళ్ల అబ్బాయిని డేట్ చేస్తున్న 21 ఏళ్ల భామ..

ఇంకొక యూజర్ అయితే.. ”నాన్ వెజ్ బర్గర్లే ప్రధానంగా విక్రయించే మెక్ డొనాల్డ్స్ వద్ద పవిత్రమైన శ్రావణ మాసంలో ఎందుకు తినాలి? వెజ్ బర్గర్లు మరెవరైన పూర్తి శాఖాహార రెస్టారెంట్ లో విక్రయిస్తుంటే. పర్లేదు కానీ మెక్‌డొనాల్డ్స్ కొనడం ఎలా కరెక్ట్ అని ప్రశ్నించాడు. ఫుడ్ రెగులేటరీ అథారటీ చేసిన టెస్టింగ్ లో మెక్ డొనాల్స్ లో చాలాతప్పులు జరుగుతున్నట్లు తేలింది. ఒక్కసారి ఉపయోగించి వంటనూనె పదే పదే ఉపయోగిస్తున్నారని తెలిసింది. ఒకే ఓవన్ మెషీన్ లో మాంసాహారం, శాఖాహారం రెండు రకాల వంటలు వండుతారని బయటపడింది. మరి మెక్ డొనాల్స్ వెజ్ బర్గర్లు తినడం అవసరమా?.. వీరంతా డబ్బు సంపాదించడానికి ఏదో ఒకటి ఆఫర్ చేస్తూ ఉంటారు.” అని కామెంట్ చేశాడు.

Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?

”శ్రావణ మాసంలో ఉపవాసం ఉండే వారికి సగ్గుబియ్యం బర్గర్ కూడా పెట్టారా?” అని ఒక యూజర్ హాస్యాస్పదంగా కామెంట్ పెట్టాడు.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×