BigTV English

Aman Sehrawat: ప్రపంచ రెజ్లింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 2 గా అమన్ సెహ్రావత్.. ఒలింపిక్స్ పతకంతో అత్యధిక పాయింట్లు

Aman Sehrawat: ప్రపంచ రెజ్లింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 2 గా అమన్ సెహ్రావత్.. ఒలింపిక్స్ పతకంతో అత్యధిక పాయింట్లు

Aman Sehrawat world ranking(Latest sports news telugu): పారిస్ ఒలింపిక్స్ లో భారతదేశం కోసం పతకం సాధించిన ఏకైక రెజ్లర్ అమన్ సెహ్రావత్. తన తొలి ఒలింపిక్స్ లోనే కాంస్య పతకం సాధించి రికార్డ్ నెలకొల్పిన అమన్ సెహ్రావత్ దేశంలో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయాడు. ఈ క్రమంలో సెహ్రావత్ రెజ్లింగ్ లో మరో ఫీట్ సాధించాడు. 57 కేజీల రెజ్లింగ్ క్యాటగిరీలో కుస్తీ చేసే అమన్ సెహ్రావత్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్స్ లో ప్రపంచ నెంబర్ 2 స్థానానికి ఎదిగాడు.


21 ఏళ్ల అమన్ సెహ్రావత్ పారిస్ ఒలింపిక్స్ లో పతకం సాధించిన అతిపిన్న వయస్కుడు. ఒలిపిక్స్ కు ముందు రెజ్లింగ్ 57 కేజీల క్యాటగిరీ ప్రపంచ ర్యాంకింగ్స్ అమన్ 6వ స్థానంలో ఉన్నాడు. ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించడంతో అతను రెండో స్పాట్ కు ఎదిగాడు. పారిస్ ఒలింపిక్స్ కుస్తీ పోటీల్లో 57 కేజీల క్యాటగిరీలో కాంస్య పతకం కోసం అమన్ సెహ్రావత్ .. ప్యూర్టో రికో కు చెందిన డేరియన్ టోయ్ క్రుజ్ అనే రెజ్లర్ తో తలపడ్డాడు. ఈ కాంస్య పతకం మ్యాచ్ లో 13-5తో అమన్ విజయం సాధించాడు. ఈ విజయంతో ప్రపంచ రెజ్లింగ్ పాయింట్ల పట్టికలో అమన్ సెహ్రావత్ కు 51,600 పాయింట్లు లభించాయి.

పురుషుల క్యాటగిరీలో భారత్ తరుపున ఒలింపిక్స్ రెజ్లింగ్ లో పోటీ చేసిన ఏకైక రెజ్లర్ అమన్ సెహ్రావత్, తన ఆటతీరుతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందాడు. ప్రపంచ రెజ్లింగ్ 57 కేజీ క్యాటగిరీలో ప్రస్తుతం.. జపాన్ కు చెందిన రెయ్ హిగూచీ టాప్ ర్యాంక్ లో సాధించాడు. అతను 59 వేల పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్ ర్యాంకర్ రెయ్ హిగూచీ చేతిలో అమన్ సెహ్రావత్ ఒలింపిక్స్ పోటీల సెమీ ఫైనల్ రౌండ్ లో ఓడిపోయాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో అల్బేనియాకు చెందిన జెలిమ్ ఖాన్ అబకనోవ్ పై అమన్ సెహ్రావత్ 12-0 తో విజయం సాధించాడు. అలాగే 16వ రౌండ్ లో నార్త్ మెసిడోనియాన చెందిన వ్లాదిమిర్ ఎగోరోవ్ ని 10-0 తో అమన్ చిత్తుచేశాడు.


ఒలింపిక్స్ కు ముందు అంతర్జాతీయ రెజ్లింగ్ ర్యాంకింగ్స్ లో 4వ స్థానంలో అమన్ ఉన్నాడు. ఒలింపిక్స్ లో అర్హత సాధించేందుకు జరిగిన జాతీయ పోటీల్లో.. టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ రవికుమార్ దహియాను అమన్ సెహ్రావత్ ఓడించాడు. ఈ విజయంలో అమన్ పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. ఈ విజయమే అమన్ కెరీర్ లో కీలకంగా మారింది.

హర్యాణా రాష్రంలోని ఝాజ్జర్ జిల్లాకు చెందిన సెహ్రావత్ జూలై 16, 2003న జన్మించాడు. పదేళ్ల వయసులో కుస్తీ పోటీల శిక్షణ తీసుకునేందుకు ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో చేరాడు. అమన్ కు 9 ఏళ్ల వయసున్నప్పుడు అతని తల్లి అనారోగ్యం కారణంగా చనిపోయింది. మరో ఏడాది కాలంలోనే అతని తండ్రి డిప్రెషన్ వల్ల చనిపోయారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన రెజ్లర్ సుశీల్ కుమార్ ను తన ఆదర్శమని అమన్ చెప్పేవాడు. ఆ తరువాత 2022 ఏషియన్ గేమ్స్ లో అమన్ సెహ్రావత్ 57 కేజీల కేటగిరీలో కాంస్య పతకం సాధించాడు.

Also Read: ఎప్పటికైనా నిజం గెలవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా: రెజ్లర్‌ వినేష్‌

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×