E-Paper
Advertisement

Old Gold Recycling: పాత బంగారంతో కొత్త ఆదాయం.. ఏం చేయాలంటే?

Old Gold Recycling: పాత బంగారంతో కొత్త ఆదాయం.. ఏం చేయాలంటే?
Advertisement

Old Gold Recycling: బంగారానికి భారతీయులకు వీడదీయలేని బంధం ఉంటుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇలా ఏ ఈవెంట్ అయినా బంగారు ఆభరణాలు ఉండాల్సిందే. మన ఇళ్లలో ఎప్పటివో పాత బంగారు ఆభరణాలు, దెబ్బతిన్న ముక్కలు, చిన్న చిన్న చెవి పోగులు ఉంటుంటాయి. పాత బంగారాన్ని రీసైక్లింగ్ చేసి ఆదాయం పొందవచ్చు. పాత ఆభరణాలను నుంచి ఆదాయం పొందేందుకు రీసైక్లింగ్ ఒక మార్గం. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో చేరుకుంటున్నాయి. ఈ టైమ్ లో కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించకుండా.. ఉన్న పాత బంగారం విలువను అన్ లాక్ చేయండి. ప్రస్తుత జనరేషన్ బంగారం కొనాలి, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అమ్మకూడదని భావిస్తుంటారు. ఏదైనా వస్తువును ఏళ్ల పాటు ఉపయోగించకుండా వదిలేస్తే.. దాని వల్ల ఉపయోగం కంటే భారం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇదే ఫార్ములా గోల్డ్ కు వర్తిస్తుంది.

డబ్బు ఆదా

మీ పాత బంగారాన్ని నగదుగా మార్చుకోవచ్చు. లేదా పాత ఆభరణాలను కొత్త డిజైన్లలోకి మార్చవచ్చు. దీంతో మనం కొత్తగా జ్యువెలరీ కొనాల్సిన అవసరం తగ్గుతుంది. అలాగే మీ డబ్బు ఆదా అవుతుంది. పాత ఆభరణాలను కొత్తగా మార్చేందుకు మేకింగ్ ఛార్జీలు మాత్రమే అవుతుంటాయి. ఉదాహరణకు, ఒక మహిళ తన పాత జ్యువెలరీ ఉపయోగించి కొత్త నెక్లెస్ చేయించుకుంటే.. బంగారానికి చెల్లించాల్సిన నగదు భారీగా భాగాన్ని తగ్గుతుంది. నాణ్యతలో రాజీ పడకుండా కొత్త ఆభరణాల ధరను గణనీయంగా తగ్గిస్తుంది. బంగారంపై ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారు కూడా ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుత మార్కెట్ ధరకు కొత్త బంగారాన్ని కొనుగోలు చేయడం కంటే పాత బంగారాన్ని రీసైకిల్ చేసి..పాత బంగారానికి ప్రస్తుత మార్కెట్ విలువను తీసుకురావొచ్చు.

Advertisement

Also Read: కుప్పకూలుతున్న బంగారం ధరలు.. నేడు తులంపై ఎంత తగ్గిందంటే?

పాత ఆభరణాల రీసైక్లింగ్

ఏటా బంగారం ధర పెరుగుతుండటం వల్ల కొత్తగా బంగారం కొనుగోలు అంటే భారీగా ఖర్చు అవుతుంది. అయితే, తమ పాత బంగారు ఆభరణాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా.. వాటికి ప్రస్తుత మార్కెట్ వాల్యూ యాడ్ చేయవచ్చు. గతంలో తక్కువకు కొన్న బంగారానికి ప్రస్తుత మార్కెట్ ధర లభిస్తుంది. చాలా మంది వ్యాపారులు పాత బంగారాన్ని సేకరించి సరైన టైం వచ్చినప్పుడు వాటిని లేటెస్ట్ డిజైన్లలోకి మార్చి విక్రయిస్తుంటారు.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×