E-Paper
Advertisement

Chiranjeevi: ‘మన శంకర వర ప్రసాద్ గారు’కి 50 రోజులు.. ఆ థియేటర్‌లో!

Chiranjeevi: ‘మన శంకర వర ప్రసాద్ గారు’కి 50 రోజులు.. ఆ థియేటర్‌లో!
Advertisement

Chiranjeevi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైతే అది మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కే సాధ్యమని మరోసారి నిరూపితమైంది. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో, చిరంజీవి-నయనతార జంటగా తెరకెక్కిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి దాదాపు రూ. 400 కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకున్నట్లుగా ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. విజయవాడలోని ప్రతిష్టాత్మక అలంకార్ ఏసీ థియేటర్‌లో ఈ చిత్రం 50 రోజుల ప్రదర్శించబడినట్లుగా పోస్టర్ తెలియజేస్తుంది. ఈ మేరకు ఈ స్పెషల్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మెగా అభిమానులు ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.

Also Read- Allu Sirish Nainika wedding: అల్లు స్టూడియోస్ లో అల్లు శిరీష్ నైనిక రిసెప్షన్..ఎప్పుడంటే?

మెగాస్టార్ ట్రాక్‌ ఇది..

Advertisement

ప్రస్తుత కాలంలో ఒక సినిమా థియేటర్లలో రెండు వారాలు ఉండటమే గగనమైపోతోంది. ఓటీటీల హవా, మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల మధ్య.. ఒక సినిమా ఏకంగా 50 రోజులు థియేటర్లలో నిలదొక్కుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సాధించిన ఈ ఘనత టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసింది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌‌టైన్‌మెంట్, చిరంజీవి గ్రేస్ తోడవ్వడంతో ఈ సినిమా క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. పాత రోజుల్లో మెగాస్టార్ సినిమాలు ఎలాగైతే థియేటర్ల వద్ద హంగామా చేసేవో, మళ్లీ ఆ వైభవాన్ని ఈ చిత్రం కళ్లముందు ఉంచిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టర్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ తన పాత ట్రాక్‌ను మళ్లీ తిరగరాశారని స్పష్టమవుతోంది.

Also Read- Sree Vishnu: రెండు సినిమాలు ఏకకాలంలో.. ఓటీటీ సమస్యతో పాటు ఇంకో సమస్య కూడా ఉంది!

మెగా ప్రభంజనం

Advertisement

ఈ చిత్రం ఇంతటి భారీ విజయం సాధించడంలో నిర్మాత సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాణ విలువలు, భీమ్స్ సిసిరోలియో అందించిన చార్ట్‌బస్టర్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, అనిల్ రావిపూడి టేకింగ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ‘హై’ ఇచ్చాయి. విజయవాడ అలంకార్ థియేటర్‌‌తో పాటు ఇంకా పలు థియేటర్లలో ఈ సినిమా 50 రోజుల ప్రదర్శించబడుతోంది. ఒక వైపు ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా మెగా ప్రభంజనం ఇలా ఉండటం మాములు విషయం కాదు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ అలాంటిది మరి. ప్రస్తుతం చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బాబీతో చేయబోతున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read- VenkyAnil5: అఫీషియల్.. ఈసారి కూడా మల్టీస్టారరే.. వెంకీతో పాటు ఎవరంటే?

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×