E-Paper
Advertisement

Today Gold Rate: బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీగా దిగొచ్చిన పసిడి ధర!

Today Gold Rate: బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీగా దిగొచ్చిన పసిడి ధర!
Advertisement

Today Gold Rate: అబ్బా.. బంగారం ధరలు ప్రస్తుతం ఒక ఊహించని రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగుతున్నాయి. సామాన్యులకు ఇది ఒకరకమైన షాక్ ఇస్తుంటే, పెట్టుబడిదారులను మాత్రం అయోమయంలో పడేస్తున్నాయి. అయితే స్థిరత్వం లేని పసిడి పయనం ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మొన్నటి వరకు భారీగా పతనమైన ధరలు, నిన్న ఒక్కసారిగా పెరిగి మళ్ళీ నేడు తగ్గడం వెనుక ప్రధానంగా ప్రపంచ రాజకీయ పరిస్థితులు, డాలర్ ఇండెక్స్‌లో వచ్చే మార్పులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే కీలక నిర్ణయాలు దాగి ఉన్నాయి. ఈ అనిశ్చితి వల్ల సామాన్య వినియోగదారులు ఏ రోజు బంగారం కొనాలో తెలియక సందిగ్ధంలో పడుతున్నారు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,440 ఉండగా.. నేడు గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,420 వద్ద ఉంది. అలాగే బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,150 కాగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,550 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.5,020 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,54,420 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,150 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,420 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,550 వద్ద పలుకుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,420 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,550 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,570 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,41,700 వద్ద ఉంది.

Also Read: తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

నేటి సిల్వర్ ధరలు ఇలా..
అయ్యయ్యో.. సిల్వర్, బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. మార్కెట్ రోజు ప్రజలతో ఆడుకుంటోంది. నిన్న పెరిగిన సిల్వర్ ధరలు నేడు మళ్లీ భారీగా తగ్గాయి. నిన్న బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,20,000 కాగా.. నేడు గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.20,000 తగ్గింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000 వద్ద పలుకుతోంది.

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×