E-Paper
Advertisement

Zomato Free Order: జొమాటోలో ఫ్రీ ఆర్డర్.. పౌష్టికాహారం కోసం రివార్డ్స్.. ఎలా చేయాలంటే?

Zomato Free Order: జొమాటోలో ఫ్రీ ఆర్డర్.. పౌష్టికాహారం కోసం రివార్డ్స్.. ఎలా చేయాలంటే?
Advertisement

Zomato Free Order| ఈ రోజుల్లో చాలామంది ఆన్‌లైన్‌లో భోజనం ఆర్డర్ చేస్తుంటారు. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ వినియోగదారుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జొమాటో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. కస్టమర్లకు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. రుచికరమైన ఆహారంతో పాటు శారీరకంగా ఫిట్‌గా ఉండాలని కంపెనీ కోరుకుంటోంది. ఆరోగ్య స్పృహ ఉన్న యూజర్ల కోసం హై-ఫైవ్ ఛాలెంజ్ ప్రారంభించింది. రెగ్యులర్‌గా హెల్తీ మీల్స్ ఆర్డర్ చేస్తే రివార్డ్ ఇస్తుంది. ఛాలెంజ్ పూర్తి చేస్తే ఒక ఉచిత హెల్తీ మీల్ దొరుకుతుంది. ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.

జొమాటో హెల్తీ మోడ్ అంటే ఏమిటి?

జొమాటో గతంలో హెల్తీ మోడ్ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఈ మోడ్‌లో మంచి న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫుడ్ ఐటెమ్స్ చూపిస్తుంది. బ్యాలెన్స్‌డ్, న్యూట్రిషియస్ డిషెస్ సులభంగా దొరుకుతాయి. హై ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఫుడ్ ఆర్డర్‌లపై ఈ ఛాలెంజ్ ఫోకస్ ఉంటుంది. అవసరమైన మైక్రోన్యూట్రియెంట్స్ ఉన్న డిషెస్‌ను హైలైట్ చేస్తుంది. ఇవి ఎనర్జీ ఇస్తాయి. ఓవరాల్ ఫిట్‌నెస్ మెరుగుపరుస్తాయి.

ఏంటి హై-ఫైవ్ ఛాలెంజ్ ?

Advertisement

హై-ఫైవ్ ఛాలెంజ్ ద్వారా వరుసగా అన్నీ ఆరోగ్యకరమైన ఫుడ్ ఆర్డర్లు చేస్తుంటే రివార్డ్ ఇస్తారు. హెల్తీ మోడ్ సెక్షన్ నుంచి మీల్స్ ఆర్డర్ చేయాలి. ప్రతి హెల్తీ ఆర్డర్‌కు ఒక హై-ఫైవ్ పాయింట్ వస్తుంది. నాలుగు పాయింట్లు సేకరిస్తే ఉచిత మీల్ అన్‌లాక్ అవుతుంది. ఐదవ హెల్తీ ఆర్డర్ పూర్తిగా ఉచితం అవుతుంది. ఈ రివార్డ్ సిస్టమ్ హెల్తీ ఫుడ్ ఛాయిస్‌లను కొనసాగించేలా ప్రోత్సహిస్తుంది.

ఛాలెంజ్‌కు ఎలాంటి మీల్స్ ఆర్డర్ చేయాలి?

హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న మీల్స్ మాత్రమే ఛాలెంజ్‌కు అర్హత పొందుతాయి. డిష్‌లో కనీసం 20 గ్రాముల ప్రోటీన్ ఉండాలి. ఫైబర్, బ్యాలెన్స్‌డ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి. మంచి మైక్రోన్యూట్రియెంట్స్ ఉన్న మీల్స్‌కు హై హెల్తీ స్కోర్ వస్తుంది. హెల్తీ మోడ్ మెనూలో ఇలాంటి డిషెస్ స్పష్టంగా మార్క్ చేసి ఉంటాయి. వీటిని ఎంచుకుంటేనే హై-ఫైవ్ పాయింట్లు వస్తాయి.

ఉచిత మీల్ ఎలా క్లెయిమ్ చేయాలి?

Advertisement

నాలుగు హై-ఫైవ్ పాయింట్లు వచ్చిన తర్వాత మీకు రివార్డ్ అర్హత వస్తుంది. హై హెల్తీ స్కోర్ మెనూలో నుంచి ఉచిత మీల్ క్లెయిమ్ చేయవచ్చు. ఐదవ ఆర్డర్‌కు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఛాలెంజ్‌ను ఎన్నిసార్లైనా రిపీట్ చేయవచ్చు. ఉచిత మీల్స్‌కు ఎలాంటి లిమిట్ లేదు. కేవలం హెల్తీ డిషెస్ ఆర్డర్ చేస్తూ పోతే సరిపోతుంది.

హై-ఫైవ్ ఛాలెంజ్ వాలిడిటీ

ఈ ఛాలెంజ్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 28 వరకు మాత్రమే ఈ ఆఫర్ రన్ అవుతుందని జొమాటో ప్రకటించింది. డెడ్‌లైన్ ముందే ఛాలెంజ్ పూర్తి చేయాలి.

Also Read: ప్రకృతి నాశనం.. మనుషుల కంటే ఎక్కువ నీరు తాగేస్తున్న ఏఐ టెక్నాలజీ

ఈ ఆఫర్ ఏ నగరాల్లో అందుబాటులో ఉంది?

ఈ ఛాలెంజ్ సెలెక్టెడ్ పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, పూణే, చెన్నైలో ఈ ఆఫర్ పనిచేస్తుంది. ఈ సిటీల్లో ఉండే యూజర్లు సులభంగా పాల్గొనవచ్చు. మిగతా సిటీల్లో త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ ఛాలెంజ్ ఎందుకు ఉపయోగకరం?

ఈ ఛాలెంజ్ యూజర్లలో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పెంచుతుంది. తరచూ ఆర్డర్ చేసేటప్పుడు ఖర్చు తగ్గుతుంది. న్యూట్రిషియస్ మీల్స్ (పౌష్టికాహారం) తిని డబ్బు ఆదా చేసుకోవచ్చు. జొమాటో ఆరోగ్యకరమైన ఫుడ్ కల్చర్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ ఛాలెంజ్ రెండు విధాల లాభాకరం. జొమాటోకు రివార్డ్ సిస్టమ్ వల్ల ఆర్డర్లు పెరుగుతాయి. మరోవైపు యూజర్లు ఆరోగ్యకరమైన ఆహారం తక్కువ ధరలో లభిస్తుంది.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×