Gold Rate Hike: వామ్మో.. బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి.. హమ్మయ్య.. ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి అనుకున్న ప్రజలు నేడు మళ్లీ పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలు నిన్నమొన్నటి వరకు భారీగా తగ్గిన బంగారం ధరలు మళ్ళీ నేడు ఎందుకు పెరిగింది? అంటే పసిడి ప్రియులలో మళ్లీ ఆశలు రేకెత్తించడానికి తగ్గించారా? అని సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిపుణులు అన్నట్టుగా ముందు ముందు బంగారం ధరలు నిజంగానే తగ్గుతాయా? లేదా మళ్లీ పెరుగుతాయా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేటి బంగారం ధరలు చూసుకుంటే..
నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,710 ఉండగా.. నేడు శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,600 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,900 కాగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,550 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.2,890 పెరిగింది.
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,56,600 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,550 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,600 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,550 వద్ద పలుకుతోంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,600 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,550 వద్ద కొనసాగుతుంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,750 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,700 వద్ద ఉంది.
Also Read: ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం.. ఎంపీసీ మీటింగ్ లో కీలక అంశాలివే
నేటి సిల్వర్ ధరలు ఇలా..
బంగారం ధరలు భారీగా పెరిగిన.. సిల్వర్ ధరలు మాత్రం కాస్త స్వల్పంగానే పెరిగాయి.. గత రోజులతో పోల్చుకుంటే నేడు స్వల్పంగా పెరిగాయి. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. నిన్న శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,80,000 కాగా.. నేడు శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 2,85,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.5,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ. 10,000 పెరిగి.. ప్రస్తుత ధర రూ. 2,85,000 వద్ద పలుకుతోంది.