E-Paper
Advertisement

Renu Desai: చిన్న వయసులో జరిగిన ఆ సంఘటన.. నన్నే మార్చేసింది!

Renu Desai: చిన్న వయసులో జరిగిన ఆ సంఘటన.. నన్నే మార్చేసింది!
Advertisement

Renu Desai:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్యగా, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ గా, హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత పిల్లలతో కలిసి ముంబైలో జీవిస్తున్న ఈమె అక్కడే మూగజీవుల సంరక్షణ కోసం పాటుపడుతున్న విషయం తెలిసిందే. ఇక గత కొద్ది రోజులుగా సుప్రీంకోర్టులో నడుస్తున్న వీధి కుక్కల అంశంపై కుక్కల సంరక్షణ గురించి మాట్లాడుతూ కాంట్రవర్సీలో చిక్కుకుంది. దీంతో పర్సనల్ లైఫ్ గురించి కామెంట్లు చేయవద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి కూడా చేసింది రేణు దేశాయ్. అలా ఈ మధ్య గత కొన్ని రోజులుగా అటు కాంట్రవర్సీ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న ఈమె తాజాగా చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఆ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది..

రేణు దేశాయ్ తాను వేగాన్ (శాకాహారి)గా మారడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ..” నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు ఒక మేక పిల్లను బలి ఇవ్వడం నేరుగా చూశాను. అప్పటినుంచి ఇప్పటివరకు నేను నాన్ వెజ్ ముట్టుకోలేదు
మాది బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ మా నాన్న మాంసం తినేవారు. కానీ మా అమ్మ మమ్మల్ని మాంసం ముట్టుకోవద్దు అని ఎప్పుడూ ఆపలేదు. అయితే నేనే తినకూడదని నిర్ణయించుకున్నాను. ఏడేళ్ల వయసులో ఆ సంఘటన చూసినప్పటి నుంచి నేను పూర్తిగా మారిపోయాను” అంటూ తెలిపింది. మా అమ్మ కఠినమైన శాకాహారి.. వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా ఆమె తీసుకోదు అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే తాను పూర్తిగా శాకాహారిగా మారడం వెనుక ఉన్న అసలు విషయాన్నీ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్లకు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి

రేణు దేశాయ్ సినిమా వ్యక్తిగత జీవితం..

Advertisement

రేణు దేశాయ్ విషయానికొస్తే.. 1981 డిసెంబర్ 4న మహారాష్ట్ర పూణేలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో జన్మించింది . 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘జేమ్స్ పాండు’ చిత్రంతో సినిమా కెరియర్ ను ప్రారంభించిన ఈమె.. అదే ఏడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాలో ఆయన సరసన హీరోయిన్గా నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమకు బీజం పడింది. ఆ తర్వాత సహజీవనం మొదలుపెట్టిన ఈ జంట.. ఆ తర్వాత 2003లో జానీ సినిమా కూడా చేశారు. ఇక 2004లో పెళ్లికి ముందే అకీరా నందన్ కు జన్మనిచ్చారు రేణు దేశాయ్.

ALSO READ:Tollywood Movies : జపాన్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాలు ఇవే.. పుష్ప2 కలెక్షన్స్..?

భర్త నుండి విడాకులు..

Advertisement

ఇక 2009 జనవరి 28న ఐదు సంవత్సరాల అఖీరా నందన్ సమక్షంలో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇక తర్వాత ఆధ్యా పుట్టింది. ఇక 2011లో విడాకులకు అప్లై చేయగా 2012లో అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ప్రస్తుతం జంతు ప్రేమికురాలిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు రేణు దేశాయ్.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×