E-Paper
Advertisement

పసిడి ప్రియులకు గట్టి షాక్.. తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఆకాశానికి చేరుకున్న ధరలు.. నేడు తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు గట్టి షాక్.. తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఆకాశానికి చేరుకున్న ధరలు.. నేడు తులం ఎంతంటే?
Advertisement

Gold Rate Today: షాకింగ్.. నిన్నటి వరకు కాస్త ఊరటనిస్తూ తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు, ఒక్కసారిగా యూ-టర్న్ తీసుకున్నాయి. నిన్నటి తగ్గుదలను చూసి “ఇక ధరలు దిగివస్తాయేమో” అని ఆశపడ్డ సామాన్యుడికి నేటి పెరుగుదల నిజంగా పెద్ద షాక్ అనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ కారణంగా దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయి దిశగా దూసుకుపోతున్నాయి. ఒక్క రోజులోనే భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఇప్పుడు షోరూమ్‌ల వైపు వెళ్లాలంటేనే సంకోచిస్తున్నారు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,260 ఉండగాగా.. నేడు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,290 వద్ద పలుకుతుంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,900 కాగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,850 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,030 పెరిగింది.

Advertisement

ఇప్పుడే కొనాలా? మరికొద్ది రోజులు ఆగాలా?
ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు సరికదా, గంట గంటకూ మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు మొగ్గు చూపుతుండటమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనిస్తూ భీతిని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మీరు గనుక త్వరలో శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకుంటే, ప్రతిరోజూ మారుతున్న ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,49,290 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,850 వద్ద కొనసాగుతుంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,290 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,850 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,290 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,850 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,440 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,37,000 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
అయితే నేడు బంగారం ధరలు పెరిగినా.. సిల్వర్ ధరలు మాత్రం తగ్గడంతో ప్రజలు సంబరపడిపోతున్నారు. ముందు ముందు కూడా సిల్వర్ ధరలు ఇలాగే తగ్గితే సామాన్య ప్రజలకు ఊరటనిచ్చినట్లవుతుంది.. అయితే నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,55,000 వద్ద ఉండగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,50,000 వద్ద్ కొనసాగుతుంది.. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ. 2,45,000 వద్ద పలుకుతోంది.

Also Read: బంగారం, వెండిలో పెట్టుబడులు.. ఒకటి నుంచి కొత్త రూల్స్, మార్పులు చేర్పులు ఏంటి?

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×