E-Paper
Advertisement

వార్ నాయనో.. ఆమె భార్యా? రాక్షసిలా? భర్త గొంతు కోసి.. రాత్రంతా అదే గదిలో!

వార్ నాయనో.. ఆమె భార్యా? రాక్షసిలా? భర్త గొంతు కోసి.. రాత్రంతా అదే గదిలో!
Advertisement

Wife Kills Husband: అక్రమ సంబంధం మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ కిరాతక భార్య. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. ఏమీ ఎరగనట్టు రాత్రంతా ఆ శవం పక్కనే పిల్లలతో కలిసి నిద్రించింది. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకుంది.

అమ్రోహా జిల్లా పిప్లాపటి కాలా గ్రామానికి చెందిన మెహరాజ్ తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య రూహికి తన స్వంత సోదరి భర్త (బావ)తో ఏర్పడిన వివాహేతర సంబంధం ఈ ఘోరానికి దారితీసింది. వీరి వ్యవహారంపై మెహరాజ్‌కు అనుమానం రావడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన రూహి, ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది.

Advertisement

పక్కా ప్లాన్ ప్రకారం రాత్రి భర్త తినే ఆహారంలో మత్తు మందు కలిపింది. అతను స్పృహ కోల్పోయిన తర్వాత, తన ప్రియుడిని ఇంటికి పిలిపించి అతడి సాయంతో మెహరాజ్ గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, ఇంట్లో దోపిడీ దొంగలు పడ్డారని నమ్మించాలని చూసింది. ఆ భీభత్సాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, రాత్రంతా భర్త మృతదేహం పక్కనే తన పిల్లలతో కలిసి ఏమీ తెలియనట్టు నిద్రపోయింది.

మరుసటి రోజు ఉదయం మెహరాజ్ తండ్రికి తన కోడలి ప్రవర్తనపై అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు రూహిని తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం బయటపడింది. వివాహేతర సంబంధం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఈ ఘటన సమాజంలో నైతిక విలువల పతనాన్ని చాటిచెబుతోంది. ప్రస్తుతం నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Advertisement

Also Read: అసెంబ్లీలో సైలెంట్.. పార్లమెంట్‌లో వాయిలెంట్.. అమరావతిపై వైసీపీ ‘డబుల్ గేమ్’!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×