Pan Card Fraud: హైదరాబాద్ చెందిన ఓ వ్యక్తికి లోన్ రికవరీ సిబ్బంది నుంచి కాల్ వచ్చింది. మీరు తీసుకున్న లోన్ వెంటనే తిరిగి చెల్లించాలని కాస్త గట్టిగానే అడిగారు. అయితే అతడు ఎలాంటి లోన్ తీసుకోలేదు. కానీ అతడి పాన్ కార్డుపై వేరొకరు లోన్ తీసుకున్నారు. ఈ విషయం బాధితుడికి తెలియలేదు. లోన్ తీసుకున్న వాళ్లు డబ్బులు కట్టకపోవడం.. పాన్ కార్డు హోల్డర్ తిప్పలు మొదలయ్యాయి. ఇటీవల ఇలాంటి మోసాలు పెరిగిపోయాయి. మన పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారా? దానిపై మనకు తెలియకుండా ఏమైనా లోన్లు ఉన్నాయా?అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
రెగ్యులర్ గా మీ క్రెడిట్ రిపోర్ట్ ను గా చెక్ చేసుకోవాలి. ఇలా చేస్తే పాన్ తో లింక్ అయిన లోన్ మోసాన్ని ముందుగానే కనిపెట్టవచ్చు. సిబిల్, ఈక్విప్యాక్స్, సీఆర్ఐఎఫ్ వంటి అధికారిక క్రెడిట్ బ్యూరోలు..పాన్‌తో లింక్ అయిన అన్ని రుణాలు, క్రెడిట్ కార్డుల వివరాలను రికార్డు చేస్తాయి. వీటి నుంచి ఏడాదికి ఒకసారి ఫ్రీగా క్రెడిట్ రిపోర్టును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్రెడిట్ బ్యూరో వెబ్‌సైట్ లో మీ పాన్, వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి క్రెడిట్ రిపోర్టును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫిన్ టెక్ ప్లామ్ ఫామ్స్ లో క్రెడిట్ రిపోర్టులను ఈజీగా చెక్ చేసుకోవచ్చు. క్రెడిట్ రిపోర్టును పరిశీలిస్తే మీకున్న ప్రతి లోన్ లేదా క్రెడిట్ కార్డుల గురించి తెలుస్తుంది. ఏదైనా అనుమానపు లావాదేవీలు ఉంటే వెంటనే బ్యాంకు లేదా సైబర్ క్రైమ్ విభాగాలను సంప్రదించవచ్చు. క్రెడిట్ రిపోర్టులో మీకు తెలియని బ్యాంకు లేదా నాన్ బ్యాంకింగ్ సంస్థల పేర్లు ఉన్నారా? మీరు ఎప్పుడూ వెళ్లని నగరాల్లో లావాదేవీలు జరిగినట్లు ఉన్నాయా? అని విషయాలను పరిశీలించండి. మీ క్రెడిట్ స్కోరు ఊహించని విధంగా తగ్గిపోవడం, EMIలు కట్టాలని సమాచారం రావడం? వంటి విషయాలను చెక్ చేయండి. మీకు తెలియకుండా పాన్ కార్డు ఆధారంగా ఏదైనా కొత్త క్రెడిట్ కార్డు ఉందా? ఇలా ఈ విషయాలను క్రెడిట్ రిపోర్టులో చెక్ చేయండి.
Also Read: పాన్ కార్డు రూల్స్ మారుతున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచి వీటికి మాత్రమే తప్పనిసరి
లోన్ మోసాల నుంచి మీ పాన్ కార్డును సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని స్మార్ట్ చిట్కాలు పాటించండి. తెలియని ఏజెంట్లు, కాలర్స్, వెబ్‌సైట్‌లలో పాన్ వివరాలను ఇవ్వకండి. ఏడాదికి కనీసం రెండుసార్లు క్రెడిట్ రిపోర్టును చెక్ చేసుకోండి. ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు ఉంటే ముందుగానే గుర్తించండి. మీ క్రెడిట్ స్కోర్ ఉన్నట్టుండి తగ్గిపోతుంటే.. వెంటనే క్రెడిట్ రిపోర్టును చెక్ చేసి, దానికి కారణం తెలుసుకోండి. రుణాలు, క్రెడిట్ కార్డుల అప్డేట్స్ తెలిసేలా బ్యాంకులో ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ నమోదు చేసుకోండి. పాన్ దుర్వినియోగ కేసులు ఎక్కువగా ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లలో జరుగుతున్నాయి. ఫిన్ టెక్ యాప్ లలో పాన్ వివరాలు ఇచ్చే ముందు ఒకటి వందసార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే పాన్ కార్డు దుర్వినియోగం నుంచి బయటపడవచ్చు.