E-Paper
Advertisement

సొంత జిల్లాలో సీన్ రివర్స్.. బోత్సకు పీడకలగా మారిన కిమిడి నాగార్జున..?

సొంత జిల్లాలో సీన్ రివర్స్.. బోత్సకు పీడకలగా మారిన కిమిడి నాగార్జున..?
Advertisement

DCCB Politics: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు సుపరితమే.. సత్తిబాబు రాజకీయం ఎలా ఉంటుందో ఎవరికీ.. ఆఖరికి సొంత పార్టీ వారికి కూడా అంతుపట్టదన్న పేరుంది. తన మాట తీరుతోనే అందన్ని కన్‌ఫూజ్ చేసే ఆ మాజీ మంత్రి రాజకీయం ప్రస్థానం కాంగ్రెస్లో దివంగత వైఎస్ సపోర్ట్‌తో మొదలైంది. కాంగ్రెస్‌లో దాదాపు అన్ని పదవులతో ఒక వెలుగు వెలిగిన సత్తిబాబు.. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఆ పార్టీలో చేరి తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఆఖరికి ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కక జగన్ నానా పాట్లు పడుతుంటే.. సత్తిబాబు మాత్రం శాసనమండలిలో ఆ హోదా దక్కించుకుని పార్టీలో కింగ్ పిన్ అవ్వాలని చూస్తున్నారన్న ప్రచారం మొదలైంది. ఆ క్రమంలో ఆయనకు సొంత జిల్లా డీసీసీబీ బ్యాంకులో చోటు చేసుకుంటున్న పరిణామాలు పెద్ద గండంగా మారాయంట.

రాజకీయ భవిష్యత్తు

బొత్స సత్యనారాయణ .. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని రాజకీయ నాయకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయనకు మాత్రం సాధ్యమైన వాక్చాతుర్యం.. రాజకీయాల్లో పావులు కదపడం, తన అనుకున్నవాళ్లకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదవులు ఇప్పించడం ఇవన్నీ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాలు చేయడంలో ఆయన స్టైల్ వేరు. అందుకే ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో ఆయనకి అనుచరగణం కూడా ఎక్కువే.

మార్క్ పాలిటిక్స్..

Advertisement

అందుకే పవర్‌తో సంబంధం లేకుండా బొత్స సత్తిబాబు వర్గం ఆయన్ని ఉత్తరాంధ్ర టైగర్ అని ఆకాశానికి ఎత్తేస్తుంటుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు నుంచి ప్రారంభమైన బొత్స రాజకీయ ప్రస్థానం నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే బొత్స ఎన్ని పదవులు చేపట్టినా, ఎంత అధికారం చలాయించినా, మొదట రాజకీయంగా ఎదగడానికి సహకరించిన డీసీసీబీ పదవి మాత్రం ఆయనకు ప్రత్యేకమేనంటారు. ఆయన ఆ పదవి అనుభవించాక తర్వాత కాంగ్రెస్ నుంచి ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా ఎంత ఉన్నతస్థాయికి చేరినా.. డీసీసీబీలో ఆయన మార్క్ పాలిటిక్స్ కొనసాగుతూనే ఉన్నాయంట.

Also Read: ఫస్ట్ ఇండియన్ సోలార్ ఎలక్ట్రిక్ కారు.. వావ్.. వైవ్ ఈవా ఎంత బాగుందో!

బ్యాంకు విధ్వంసం

Advertisement

సుమారు మూడు దశాబ్దాలు విజయనగరం డీసీసీబీలో బొత్స పెత్తనమే కొనసాగుతుందనేది కాదనలేని సత్యం. డీసీసీబీ నా అడ్డా.. ఈ బ్యాంకు నా కోసమే అన్నట్లు ఉండేదట ఆయన వ్యవహారశైలి. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ అనగానే గుర్తొచ్చేది, వినిపించేది బొత్స నామధేయమే. అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ బ్యాంకును విధ్వంసం చేశారనే విమర్శలు కూడా ఆయన మూటగట్టుకున్నారు. రాజకీయంగా బొత్సను విమర్శించాల్సి వస్తే ఆయన రాజకీయ శత్రువులు అక్కడి నుంచే మొదలుపెడుతుంటారు.

కిమిడి నాగార్జున..

అయితే వైసీపీ ప్రభుత్వం గద్దె దిగగానే డీసీసీబీ రాజకీయం పీక్ స్టేజ్‌కి చేరింది. అంతకాలం బొత్స చక్రం తిప్పిన డీసీసీబీ పాలిటిక్స్ రివర్స్ అవుతున్నాయంట. 2019 ఎన్నికల్లో బొత్స చేతిలో పరాజయం పాలైన టీడీపీ యువనేత కిమిడి నాగార్జున ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ గా ఉన్నారు. బొత్స చేతిలో ఓటమి తర్వాత కిమిడి నాగార్జున టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియామకమయ్యారు. అప్పటి నుండి నేటి వరకు అవకాశం దొరికిన ప్రతిసారి పాలసీ పరంగా బొత్స ను ఎక్కడా విడిచిపెట్టలేదు. బొత్స మంత్రిగా చేసిన శాఖల్లో జరిగే అవినీతిపై గళమెత్తుతూనే వున్నారు. ఇక అన్నిటికీ మించి గతేడాది విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో నాగార్జున తీసుకున్న నిర్ణయం పై ఇప్పటికే ప్రజలు చర్చించుకుంటూనే ఉన్నారు.

అనుచరుల్ని టార్గెట్..

మూడు దశాబ్దాలుగా డీసీసీబీ బ్యాంకు ఆవరణ పైనుంచి అమ్మవారి సిరిమానోత్సవాన్ని తిలకించిన బొత్స ను ఈ సారి అలా కుదరదంటూ.. తాము తమ సిబ్బంది అక్కడ నుంచి వీక్షిస్తామని కిమిడి నాగార్జున ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో అదో సెన్సేషన్ గా మారింది. అది బొత్సకు పీడకలలా మిగిలిపోయిందంట. ఆ క్రమంలో అప్పటివరకు బొత్స ని టార్గెట్ చేసిన నాగార్జున ఇపుడు బొత్స అనుచరుల్ని టార్గెట్ చేశారనేది జిల్లా రాజకీయాల్లో కోడై కూస్తోంది. డీసీసీబీలో బొత్స అనుచరులు తీసుకున్న లోన్ల మొండి బకాయిలపై ప్రెజెంట్ డీసీసీబీ అధ్యక్షుడైన నాగార్జున దృష్టి సారించారట. సుమారు 100 నుండి 150 కోట్ల రూపాయల బ్యాంకు సొమ్ము బొత్స అనుచరుల దగ్గరే ఉందని టాక్ గట్టిగానే నడుస్తోంది.

Also Read: రూటు మార్చిన వైసీపీ.. మరోసారి అదే రాగం అందుకున్న నేతలు, రాయలసీమ ప్రాజెక్ట్‌లపై శ్రీకాంత్‌రెడ్డి కామెంట్స్

కోట్ల రూపాయల లోన్లు..

బొత్స అనుచరులు లోన్లు తీసుకొని డబ్బులు తిరిగి కట్టలేదన్న విమర్శలు జోరుగానే వినిపిస్తున్నాయి. వీరంతా కట్టేస్తే బ్యాంకుకు పునర్జీవం కూడా వస్తదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇన్నాళ్లు బకాయిలు వసూలు చేయడం మాటలవరకే పరిమితమైతే నేడు నాగార్జున దానిని నిజం చేసి చూపించాలనే కృత నిశ్చయంతో ఉన్నారనే టాక్ జిల్లాలో రీసౌండ్ ఇస్తోంది. బొత్స వర్గీయులంతా కాంగ్రెస్, వైసీపీ హయాంలలో కోట్లాది రూపాయలు లోన్లు పొంది తిరిగి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కట్టలేదట. దీంతో నిజమైన హక్కు దారులు, వాటాదారులైన రైతులకు లోన్లు ఇవ్వడం కష్టతరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు కూడా బ్యాంకు పట్ల నమ్మకం సన్నగిల్లుతోందట.

రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్..

రైతుల్లో బ్యాంకు పట్ల నమ్మకం కలిగించేందుకు డీసీసీబీ చైర్మన్ నాగార్జున నడుం బిగించారనే వార్తలు వినిపిస్తున్నాయి. బొత్స కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల కు చెందిన వారి దగ్గరే మొత్తం సొమ్ము లాక్ అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 30 నుండి 40 మంది చేతుల్లోనే 100 నుండి 120 కోట్ల రూపాయలు మొండి బకాయిలుగా ఉన్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బొత్స అండతోనే వీరందరికీ ఇష్టానుసారంగా లోన్లు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అన్ని వర్గాల నుండి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదొక మైల్ స్టోన్..

మద్దతు ధరల్లేక, సాగు నీరు లేక అన్ని విధాలా ఇబ్బందులు పడుతున్న రైతును ఆదుకోవాలనే ఆలోచన లేకపోవడం ఒకెత్తైతే.. వారి ఆస్తిని కూడా దోచుకునే కుట్రలకు పాల్పడ్డారని బొత్స టీమ్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ. దాంతో యువనేత నాగార్జున ప్రమేయంతో బ్యాంకు అధికారులు కూడా మొండి బకాయిదారులకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు వైసీపీ నుండి కూటమి పార్టీల్లో జాయిన్ అయినవారికి కూడా నోటీసులు అందాయనే ప్రచారం జరుగుతోంది. నిజంగా బకాయిలు వసూలు చేయగలిగితే బ్యాంకు చైర్మన్ గా కిమిడి నాగార్జున కి ఇదొక మైల్ స్టోన్ అయ్యే అవకాశం లేకపోలేదు.

ఎలా ఛెక్ పెడతారో..

అయితే నాగార్జునది నిజంగా రైతులపై ప్రేమనా లేక బొత్స పై ద్వేషమా అనేది పక్కన పెడితే బ్యాంకు మాత్రం బాగుపడుతుందనేది రైతుల అభిప్రాయంగా తెలుస్తోంది. మరోవైపు ఇదంతా రాజకీయంగా నాగార్జున మైలేజ్ పెంచుకోవడానికేనని భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ పార్టీకి లాయల్ గా ఉన్న నాగార్జున, పదవి వచ్చినా కూడా అలానే ఉంటారు అని అధినాయకుడు చంద్రబాబు వద్ద నిరూపించుకోవడానికి తహ తహ లాడుతున్నారనే వాదనలు ఉన్నాయి. మరి ఈ మొండి బకాయిల వ్యవహారంలో నాగార్జున.. తన రాజకీయ ప్రత్యర్ధి బొత్స వర్గానికి ఎలా ఛెక్ పెడతారో చూడాలి.

Also Read: ఆస్తుల్లో అగ్రకులాలు.. అప్పుల్లో వెనుకబడిన వర్గాలు.. సర్వేలో బట్టబయలైన సంచలనాలు..!

Related News

ఫిఫా ఫైనల్ కురుక్షేత్రం.. 16 ఏళ్ల కల నెరవేరిన వేళ.. కన్నీళ్లతో మెస్సీ వీడ్కోలు!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

Big Stories

Advertisement
×