E-Paper
Advertisement

PPF,SSY పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఖరారు చేసిన కేంద్రం.. పెరిగాయా? తగ్గాయా?

PPF,SSY పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఖరారు చేసిన కేంద్రం.. పెరిగాయా? తగ్గాయా?
Advertisement

PPF SSY Interest Rates: చిన్న పొదుపు పథకాలు PPF, NSC, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్రం సమీక్షిస్తుంది. ఈసారి వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఊహాగానాలు వినిపించాయి. కానీ ప్రభుత్వం ఈ పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఏప్రిల్ 1, 2026 నుంచి జూన్ 30, 2026 వరకు, ఈ వడ్డీ రేట్లు అమల్లో ఉంటాయి. వరుసగా ఎనిమిదోసారి పెట్టుబడి పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటన చేసింది.

కొత్త వడ్డీ రేట్లు

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ( PPF) వడ్డీ రేటును 7.1% కొనసాగించింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వడ్డీ రేటును 7.7%గా నిర్ణయించారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాల వడ్డీ రేటును 8.2% గా నిర్ణయించింది. ఈ వడ్డీ రేట్లన్నీ ఏప్రిల్-జూన్ 2025 త్రైమాసిక రేట్లతో సమానంగా ఉన్నాయి. 3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్‌పై 7.1%, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్ స్కీమ్‌లపై 4%, కిసాన్ వికాస్ పత్ర (115 నెలల్లో మెచ్యూర్)పై 7.5%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పై 7.7%, మంథ్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై 7.4%, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 8.2% వడ్డీ రేటును కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా నిర్ణయంతో పోస్టాఫీసులు, బ్యాంకులలోని పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు వరుసగా 8వ త్రైమాసికంలోనూ యథాతథంగా ఉన్నాయి. చివరిసారిగా 2023-24 నాల్గో త్రైమాసికంలో పలు ప్రభుత్వ పథకాలకు వడ్డీ రేట్లను సవరించింది.

Also Read: SIP Vs FD VS PPF నెలకు రూ.10 వేల పెట్టుబడి.. 10 ఏళ్లలో రాబడి ఎంతంటే?

పోస్టాఫీసు వడ్డీ రేట్లు ఎలా నిర్ణయిస్తారు?

Advertisement

కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు పోస్ట్ ఆఫీసు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. శ్యామల గోపీనాథ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ రేట్లను నిర్ణయిస్తారు. పలు పథకాల మెచ్యూరిటీ కాలానికి ప్రభుత్వ బాండ్లపై వచ్చే రాబడి కంటే ఈ పథకాలపై వడ్డీ రేట్లు 25 నుంచి 100 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉండాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఈ పథకాలను పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉండేలా వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు.

Related News

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

Big Stories

Advertisement
×