E-Paper
Advertisement

Instant Curd: ఇంట్లోనే రుచికరమైన గడ్డపెరుగు కేవలం 15 నిమిషాల్లో రెడీ.. చాలా సింపుల్.. ఇలా చేసేయండి

Instant Curd: ఇంట్లోనే రుచికరమైన గడ్డపెరుగు కేవలం 15 నిమిషాల్లో రెడీ.. చాలా సింపుల్.. ఇలా చేసేయండి
Advertisement

Instant Curd Trick: పెరుగంటే ప్రతి ఇంట్లో ఎంతో ఇష్టంగా తింటారు. భోజనంలో పెరుగుంటే రుచి మరింత పెరుగుతుంది. వేసవికాలంలో పెరుగు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దక్షిణాది వంటకాలైనా, నార్త్ ఇండియన్ మీల్స్ లో లస్సీ కోసం అయినా పెరుగు ఉంటే ఆ మజానే వేరు. అయితే కొన్ని సార్లు రాత్రి పెరుగు కోసం పాలలో తోడు వేయడం మరచిపోతారు. రోజూ మార్కెట్ నుంచి పెరుగు కొనడం అసౌకర్యంగా ఉంటుంది. పైగా పాల కెంద్రం, ప్యాకెట్ పెరుగు అంత రుచిగా కూడా ఉండదు. అలాంటి సమయంలో త్వరగా పెరుగు కావాలంటే.. నిమిషాల వ్యవధిలో ఇంట్లోనే గట్టి పెరుగు తయారు చేసుకోవచ్చు.

1.పాలు సరిగ్గా తయారు చేయడం

సగం లీటర్ పాలు తీసుకోండి. పాలను మూడు నుంచి నాలుగు నిమిషాలు పాటు మెల్లగా వేడి చేయండి. పాలు మరిగిన తరువాత.. అందులోని నీరు తగ్గిపోతుంది. పెరుగు గట్టి రావడానికి ఇలా చేయడం అవసరం. ఎక్కువగా మరగించకండి. పాలు కొంచెం చల్లబడిన తర్వాత వేలు పెట్టి చూడండి. పాలు వెచ్చగా ఉండాలి, వేడిగా ఉండకూడదు.

Advertisement

తోడు సరిగ్గా కలపడం

పాలలో కాస్త ఒక చెంచా తోడు పెరుగు కలపండి. వెచ్చని పాలలో బాగా కలపండి. ఈ తోడు వేసి పాలలో బాగా కలపడం వల్ల పెరుగు సమానంగా వస్తుంది. ఇలా చేయడం చాలా ముఖ్యం.

2.మట్టి కుండ ఉపయోగించండి

Advertisement

ఒక గిన్నెలో కంటే మట్టి కుండలో పెరుగు పండిస్తే దాని రుచి, ఆకృతి బాగుంటాయి. మట్టి కుండ పాలలోని అదనపు తేమ పీల్చేసుకుంటుంది. దీంతో పెరుగు గడ్డగా, క్రీమీగా పెరుగు ఇస్తుంది.

3.మట్టి కుండను ముందుగా సిద్ధం చేయడం

మట్టి కుండను కొంత సేపు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత నీరు ఆరిపోయాక, లోపల చిన్నగా తోడు పెరుగు పూయండి. 10 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత తయారు వెచ్చని పాలు పోయండి.

పాలు పోసి పెరుగు పండించడం

తయారు చేసిన వెచ్చని పాలను మట్టి కుండలో పోయండి. పైన కొంచెం తోడు పెరుగు కూడా వేయవచ్చు. కుండపై ఫాయిల్ లేదా సరిగా మూతతో కప్పండి.

Also Read: మీరు రోజూ తినే ఆహారంతోనే క్యాన్సర్‌‌ను నిరోధించవచ్చు.. ఆ సూపర్ ఫుడ్స్ ఇవే

15 నిమిషాల్లో పెరుగు తయారు చేయడం

ప్రెజర్ కుక్కర్ ట్రిక్
మట్టి కుండను ప్రెజర్ కుక్కర్‌లో ఉంచండి. కుక్కర్ కింది భాగంలో కొంచెం నీరు పోయండి. కుక్కర్ విజిల్ తీసేసి మూత పెట్టండి. మంటను చిన్నగా పెట్టి 15 నిమిషాలు వేడి చేయండి. ఈ వేడి వల్ల పెరుగు త్వరగా పండుతుంది.

15 నిమిషాల తర్వాత మంట ఆపేయండి. కుండను జాగ్రత్తగా తీసి 5 నిమిషాలు చల్లబరచండి. తెరిచి చూస్తే మంచి గట్టి, క్రీమీ పెరుగు సిద్ధమవుతుంది. ఈ పెరుగు రుచి, ఆకారం చూస్తే అందంగా ఉంటుంది.

ఈ సులభమైన ట్రిక్‌తో సమయం, శ్రమ ఆదా అవుతుంది. రోజూ ప్యాకెట్ పెరుగుపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే తాజా, గట్టి పెరుగు తయారు చేసుకోవచ్చు. ఈ ట్రిక్ ప్రయత్నించి రోజూ రుచికరమైన ఇంటి పెరుగు ఎంజాయ్ చేయండి.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×