E-Paper
Advertisement

స్వేచ్ఛ ఎఫెక్ట్.. టూరిజంలో పారదర్శకత పెంపునకు కృషి!

స్వేచ్ఛ ఎఫెక్ట్.. టూరిజంలో పారదర్శకత పెంపునకు కృషి!
Advertisement

Swetcha Effect: స్వేచ్ఛ బ్యూరో: ఈనెల 28న స్వేచ్ఛ దినపత్రికలో టూరిజంలో అక్రమ దందా?.. ఒకవైపు టికెట్లు.. మరోవైపు ఇంధనం.. కొరవడిన అధికారుల పర్యవేక్షణ అనే కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి టూరిజం అధికారులు స్పందించారు. బోటింగ్ ద్వారా వచ్చే ప్రతి పైసాను మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. పారదర్శకతను పెంచేందుకు ప్రస్తుతం ఉన్న విజిలెన్స్ యంత్రాంగంతో పాటు, అధికారుల బృందాన్ని ప్రత్యేక తనిఖీలకు పంపినట్లు టీజీటీడీసీ జనరల్ మేనేజర్ (వాటర్ ఫ్లీట్) మాన్వి సోమవారం తెలిపారు.

టికెట్లు జారీ..

అధికారుల వారి నివేదిక ఆధారంగా అవసరమైన మెరుగుదలలు చేస్తామని పేర్కొన్నారు పర్యాటక బోటింగ్ విభాగంలో టికెట్ల జారీ, రికార్డుల నిర్వహణ అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందని పేర్కొన్నారు. ప్రయాణీకులందరికీ టికెట్లు జారీ చేస్తున్నామని, డూప్లికేట్ పుస్తకాలు నిర్వహించడం లేదా టికెట్ లేకుండా బోటింగ్ అనుమతించడం వంటి పద్ధతులేవీ లేవని స్పష్టం చేశారు. మా కార్యకలాపాలన్నింటిలోనూ పారదర్శకతకు ,జవాబుదారీతనానికి మేము అత్యంత ప్రాధాన్యతనిస్తామన్నారు.

Advertisement

Also Read: కల్తీ గ్యాంగులకు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్.. నెక్స్ట్ టార్గెట్..?

బోట్ల మరమ్మతుల కోసం..

బోట్ల నిర్వహణకు అయ్యే ఇంధన ఖర్చులుఆయా ట్రిప్పులు, ఇంజిన్ల పరిస్థితిపై ఆధారపడి ఉంటాయని వివరించారు. బోట్ల మరమ్మతుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని, వారి పర్యవేక్షణలోనే ప్రధాన మరమ్మతులు జరుగుతాయని పేర్కొన్నారు. సాధారణ రోజువారీ మరమ్మతులు మాత్రమే యూనిట్ స్థాయిలో జరుగుతాయని, అన్ని ఖర్చులకు సంబంధించిన బిల్లులు, ఆడిట్ పత్రాలు పక్కాగా ఉన్నాయని వెల్లడించారు.

Advertisement

Also Read: GHMC: జీహెచ్ఎంసీలో భారీ కుంభకోణం.. కాగ్ నివేదికలో వెలుగులోకి సంచలనాలు..?

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×