E-Paper
Advertisement

ఇదేంట్రా బాబు.. పశువులకు సోకే ఈ వైరస్ ఇప్పుడు మనుషులకు వస్తోందా?

ఇదేంట్రా బాబు.. పశువులకు సోకే ఈ వైరస్ ఇప్పుడు మనుషులకు వస్తోందా?
Advertisement

Shamonda Virus: ఎప్పటికప్పుడు కొత్త కొత్త వైరస్‌లు వచ్చి మనుషుల్ని పరేషాన్ చేస్తుంటాయి. కరోనా వైరస్ ని అయితే జనాలు ఎప్పటికీ మర్చిపోరు. అంతులేని విషాదాన్ని సృష్టించింది ఈ వైరస్. ఇలా వైరస్ అంటేనే వనికిపోయే సిచువేషన్ లో ఉన్న మనకు ఇప్పుడు మరో కొత్త వైరస్ పేరు వినిపించింది. అదే షమోండా వైరస్. హిస్టరీలో ఫస్ట్ టైం ఇది మనుషులకు సోకడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అసలు ఏంటి ఈ షమోడా వైరస్..? ఇది నిజంగా మనుషుల ప్రాణాలు తీస్తుందా..? ఈజీగా అందరికీ స్ప్రెడ్ అవుతుందా..? రండి తెలుసుకుందాం..

షమోండా వైరస్ అంటే ఏంటనేది చూద్దాం..

Advertisement

షమోడా వైరస్ అనేది ప్రధానంగా పశువులకు సోకే ఒక వైరస్. ఇది సింబూ సెరో గ్రూప్ అనే వైరస్ల సమూహానికి చెందింది. ఈ సమూహంలోనే స్మాలెన్బర్గ్ వైరస్ కూడా ఉంటుంది. ఈ వైరస్ పశువుల్లో ముఖ్యంగా గర్భస్రావాలు పిండం ఎదుగుదలలో లోపాలు వంటి సమస్యలకు కారణం అవుతుంది. షమోడా వైరస్ ను తొలిసారిగా 1965లో నైజీరియాలోని పశువుల్లో గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికా ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ వైరస్ బయటపడింది. ఇప్పటివరకు ఈ వైరస్ ప్రధానంగా జంతువులకు మాత్రమే సమస్యగా ఉండేది. మనుషులకు ఇది సోకినట్లు గతంలో ఆధారాలు లేవు. అయితే, అక్టోబర్ 22 న ఫ్రాన్స్ లో ఒక మనిషికి ఈ వైరస్ సోకినట్లు వచ్చిన వార్త కాస్త టెన్షన్ పెట్టింది.

ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది..?

Advertisement

అసలు ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందో అర్థమైతే మనుషులకు ఎలా సోకిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. షమోడా వైరస్ వ్యాప్తిలో చిన్న కీటకాలది కీ రోల్. ముఖ్యంగా మిడ్జెస్ అనే చిన్న రక్తం పీల్చే ఈగల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇవి దోమలా కనిపిస్తాయి కానీ దోమలు కావు. ఈ వైరస్ ను మోసుకెళ్లే కీటకం ఒక జంతువును కుట్టినప్పుడు ఆ జంతువుకు వైరస్ సోకే అవకాశం ఉంటుంది. ఫ్రాన్స్ లో నమోదైన కేసులో కూడా వైరస్ ఉన్న మిడ్జ్ కాటు వల్లే వ్యక్తికి ఇన్ఫెక్షన్ వచ్చి ఉండవచ్చు అనేది ఓ అనుమానం. ఇంకా ఈ వైరస్ ఎలా సోకింది అనే దానిపై పూర్తి క్లారిటీ లేదు. ఫ్రాన్స్ లో ఈ వైరస్ సోకిన వ్యక్తి మరణించాడు. దీంతో ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనదా అనే ఆందోళన మొదలైంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి.
వైరస్ సోకిన వ్యక్తి మరణించాడని మాత్రమే తెలుసు. ఆ మరణానికి వైరస్‌సే కారణమని ఇంకా తేలలేదు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాటా ప్రకారం..

యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి అంతకుముందే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ టైంలోనే వైరస్ సోకినట్లు గుర్తించారు. సో ఆ వ్యక్తి మరణానికి షమోండా వైరస్ కారణమా లేక అప్పటికే ఉన్న అనారోగ్యమే కారణమా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాటా ప్రకారం ఇలాంటి కేసు ప్రపంచం మొత్తంలో ఒక్కటే నమోదయింది. అది కూడా ఇదే అయితే ఈ వైరస్ పెద్ద ఎత్తున వ్యాపించే అవకాశం మాత్రం తక్కువగా ఉంది అంటున్నారు. గతంలో ఎప్పుడూ ఈ వైరస్ సోకక పోవడం వల్ల మనుషులకు ఈ వైరస్ సోకితే ఏమవుతుంది అనే దానిపై ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. అందుకే ఇది డెడ్లీ వైరస్ అని ఇప్పుడే చెప్పలేం.

పశువులలో కనిపించే లక్షణాలు..

మనుషుల విషయం ఏమో గానీ పశువులకు మాత్రం ఈ వైరస్ చాలా డెడ్లీనే. ఈ వైరస్ ప్రధానంగా ఆవుల్లో కనిపిస్తుంది. గొర్రెలు, మేకలు, గుర్రాలు వంటి జంతువులకు కూడా సోకిన సందర్భాలు ఉన్నాయి. జ్వరం రావడం, విరోచనాలు కావడం, పాల ఉత్పత్తి తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. గర్భంతో ఉన్న పశువుల్లో గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో నాడ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా కనిపించొచ్చు. అందుకే పశువులని పెంచే వారికి చాలా నష్టాన్ని తెస్తుంది ఈ వైరస్.

Also Read: కాంగ్రెస్‌లో కుర్చీ లాటరీ.. జెండా మోసినోళ్లకు హ్యాండ్.. జంప్ జిలానీలకే హవా!

మనుషులకు ఎలా సోకుతుంది అనే దానిపై క్లారిటీ..?

మనుషుల విషయంలోనే ఇంకా క్లారిటీ లేదు. పశువుల్లో అయితే మిడ్జెస్ వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. మరి మనుషులకు ఎలా సోకుతుంది అనే దానిపై క్లారిటీ లేదు. అందుకే ఒక్క మనిషిలో కేసు నమోదయిందని వెంటనే ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వచ్చే ప్రమాదం ఉందని అనుకోవద్దు. ఎక్స్పర్ట్స్ కూడా అదే చెబుతున్నారు. ప్రజలు ఈ వైరస్ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది వారి మాట. అయితే ఈ వైరస్ గురించి ఇంకా రీసెర్చ్ జరగాల్సి ఉంది. ముఖ్యంగా మనుషులకు ఇది ఎలా సోకింది? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? భవిష్యత్తులో ఇలాంటి కేసులు మరిన్ని నమోదు అవుతాయా..? అనే దానిపై క్లారిటీ రావాలి. ఓవరాల్ గా చెప్పాలంటే క్షమోండా వైరస్ కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ కాదు దీన్ని 1965 లోనే పశువులో గుర్తించారు. కానీ ఇప్పుడు తొలిసారిగా ఒక మనిషికి సోకిన కేసు ఫ్రాన్స్ లో నమోదయింది. అందుకే అనవసరంగా భయపడడం మానేయాలి.

Tags

Related News

ఆదివారం లంచ్‌కి ఇది పర్ఫెక్ట్ స్టార్టర్.. ఇలా చేస్తే అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే!

కొబ్బరి నూనె, మసాలాలతో కేరళ స్టైల్ పీతల వేపుడు.. తయారీ విధానం ఇదిగో!

సండే స్పెషల్ గోంగూర మటన్ ఇగురు.. ఈ కొలతలతో చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది!

హైదరాబాద్‌లో 44వ అంతస్తులో వేలాడుతూ.. ఇతడి జీతం ఎంతో తెలుసా?

హెల్తీ అండ్ టేస్టీ సోయా చంక్స్ పులావ్..క్షణాల్లోనే రెడీ అవుతుంది

కేరళ స్టైల్ ప్రాన్స్ ఫ్రై..హోటల్ టేస్ట్ మించిపోయేలా ఇంట్లోనే ఇలా రెడీ చేయండి!

హోటల్ స్టైల్ కరివేపాకు చికెన్ ఫ్రై..టేస్ట్ అదిరిపోద్ది!

Big Stories

Advertisement
×