E-Paper
Advertisement

Stock market crash: యుద్ధం సెగలు.. వణికిన దలాల్ స్ట్రీట్, ప్రారంభంలో భారీగా పతనమైన సూచీలు

Stock market crash: యుద్ధం సెగలు.. వణికిన దలాల్ స్ట్రీట్, ప్రారంభంలో భారీగా పతనమైన సూచీలు
Advertisement

Stock market crash: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ప్రభావం వివిధ దేశాల క్రమంగా పడుతోంది. యుద్ధం ముందు రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. తాజాగా బుధవారం ప్రారంభంలోనే బాంబే స్టాక్ మార్కెట్లో బీఎస్ఈ, నిఫ్టీ సూచీలు దారుణంగా పడిపోయాయి.

ఇరాన్ యుద్ధం సెగలు.. వణికిన దలాల్ స్ట్రీట్

Advertisement

మధ్యప్రాచ్యంలో ఇరాన్​-అమెరికా-ఇజ్రాయెల్​ ల మధ్య యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాల స్టాక్​ మార్కెట్లపై పడ్డాయి. ఫలితంగా మార్కెట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి రకరకాల సూచీలు భారీ నష్టాలు చూస్తున్నాయి. బుధవారం ఉదయం బాంబే స్టాక్​ మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఆదిలో బీఎస్ఈ సెన్సెక్స్ 1700 పాయింట్లు నష్టపోయి 78545 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.

ఇటు నిఫ్టీ కూడా 2 శాతం మేరా పతనమైంది. దాదాపు 500 పాయింట్లు కోల్పోయి 24, 324 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. నిఫ్టీ సూచీల్లో నిఫ్టీ ఆల్ఫా-50, నిఫ్టీ డీఐవీ 50, నిఫ్టీ -50, నిఫ్టీ నెక్ట్స్ 50, నిఫ్టీ ఫైనాన్స్, నిఫ్టీ బ్యాకింగ్ వంటి రంగాలు రెండుశాతం పైనే పతనమయ్యాయి.  నిఫ్టీ ఐటీ మాత్రం కాస్త జోరందుకుంది. అటు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 66 పైసలు పడిపోయింది.

Advertisement

మార్కెట్ ప్రారంభంలో భారీగా పతనమైన బీఎస్ఈ, నిఫ్టీ సూచీలు

దీనికితోడు యుద్ధం మరో నాలుగు వారాలుపాటు కొనసాగుతుందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో మదుపరులు హడలిపోయారు. దీంతో అమ్మకాలకు పాల్పడ్డారు. ఈ పరిస్థితులు ఇంకెంత కాలం కొనసాగుతుందో చెప్పలేమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్​ సుప్రీం అలీ​ ఖమేనీ మృతి చెందారు. దీనికి ప్రతీకార దాడులు మొదలుపెట్టింది ఇరాన్.

ఈ పరిణామాలతో ప్రపంచ దేశాలు ఉల్లికిపడ్డాయి.ముడి చమురు సరఫరా చేసే హర్ముజ్​ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్​ ప్రకటన కూడా మార్కెట్ పై పడిందని చెబుతున్నారు. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరగడం ఖాయమని అంటున్నారు. భారత్ దిగుమతుల్లో చమురు అధిక వాటా కలిగివుంది. బ్యారెల్​ మీద ఒక్క డాలర్ పెరిగినా దేశానికి వేల కోట్లు అదనపు ఖర్చు అవుతుందని చెబుతున్నారు.

ALSO READ: భగ్గుమంటున్న అంతర్జాతీయ చమురు ధరలు.. పెట్రో ధరల పెంపుపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఇక దక్షిణకొరియా ఇండెక్స్ అయితే ఏకంగా 11 శాతం నష్టపోయింది. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపి వేసింది.సరిపడిన ఆయిల్‌ నిల్వలు ఉన్నప్పటికీ జపాన్‌ మార్కెట్ సుమారు 3 శాతం క్షీణించింది. అంతకుముందు రోజు జర్మనీకి చెందిన డాక్స్‌ సూచీ 3.9 శాతం పతనమైంది.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×