E-Paper
Advertisement

స్టాక్‌మార్కెట్‌లో బ్లాక్ మండే.. కొంప ముంచిన ఆ రంగాల షేర్లు, 4 లక్షల కోట్ల సంపద ఆవిరి

స్టాక్‌మార్కెట్‌లో బ్లాక్ మండే.. కొంప ముంచిన ఆ రంగాల షేర్లు, 4 లక్షల కోట్ల సంపద ఆవిరి
Advertisement

Stock Market Crashed:  స్టాక్ మార్కెట్ పోయినవారం పెట్టుబడిదారులకు కొంత ఉత్సాహాన్నిచ్చింది. ఈ వారం కంటిన్యూ అవుతుందని చాలామంది మదుపరులు భావించారు. కానీ ఆశలు ఎక్కువ కాలం నిలవలేదు. సోమవారం మధ్యాహ్నం స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. దాదాపు 4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. ఉన్నట్లుండి మార్కెట్ పతనం వెనుక అసలు కారణాలేంటి? ఒక్కసారి లోతుల్లోకి వెళ్తే..

స్టాక్‌మార్కెట్‌లో బ్లాక్ మండే

దేశీయ స్టాక్‌మార్కెట్ సోమవారం భారీ పతనం చవిచూసింది. ప్రైవేట్ బ్యాంకుల బలహీనత, విదేశీ పెట్టుబడిదారుల నిరంతర నిధుల తరలింపు, ఇంకోవైపు ముడిచమురు ధరలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేశాయి. ఫలితంగా సోమవారం మధ్యాహ్నం నుంచి స్టాక్ మార్కెట్‌లో బేర్ విజృంభణ మొదలైంది.  సోమవారం ఉదయం ప్రీ మార్కెట్లో లాభాలతో మొదలైంది. అదే కంటిన్యూ అవుతుందని మదుపరులు భావించారు.

కొంప ముంచిన బ్యాంక్, ఐటీ రంగాల షేర్లు

Advertisement

దీనికితోడు ఐపీవోలు రావడం, కొన్ని కంపెనీల షేర్లు లిస్టు కావడంతో బుల్ జోరు కొనసాగవచ్చని భావించారు. మార్కెట్ ప్రారంభమైన కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. బ్యాంక్, ఐటీ రంగాల నష్టాలు చవి చూశాయి. మధ్యాహ్నం వరకు అదే కంటిన్యూ అయ్యింది. అయితే మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి ఒక్కసారిగా బీఎస్ఈ సెన్సెక్స్ 1000 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 295 పాయింట్లు క్షీణించింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ 876 పాయింట్లు, నిఫ్టీ 257 పాయింట్లు నష్టంతో ముగిసింది.

మార్కెట్లో  4 లక్షల కోట్ల సంపద ఆవిరి

ఈ బలహీనత లార్జ్-క్యాప్ స్టాక్స్‌కే పరిమితం కాలేదు. నిఫ్టీ మిడ్‌క్యాప్-100, నిఫ్టీ స్మాల్‌క్యాప్-100 సూచీలు పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌లోని అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ శుక్రవారం ముగింపు నాటి రూ. 4,72,62,167 కోట్ల ఉండగా, సోమవారం మధ్యాహ్నం 3.05 గంటల సమయానికి రూ. 4,67,78,282 కోట్లకు పడిపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్లు సుమారు రూ. 4 లక్షల కోట్లు నష్టపోయారు.

Advertisement

ప్రైవేట్ రంగ బ్యాంకుల సెప్టెంబర్ త్రైమాసిక ఆదాయాలను సమీక్షించిన తర్వాత అవి బెంచ్‌మార్క్ సూచీలపై ఒత్తిడికి కారణమయ్యాయి. సెన్సెక్స్‌పై ప్రతికూల ప్రభావం చూపడం మొదలైంది. ఫలితంగా హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, యాక్సిస్ వంటి ఈ మూడు బ్యాంకులు కలిసి సూచీ పతనంలో సగానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి.

చమురు ధరలు పెట్టుబడి దారులను ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. ఇటీవలి తగ్గినప్పటికీ సోమవారం మార్కెట్ సెషన్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు సుమారు 108 నుంచి 109 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి చుట్టూ నెల కొన్న సరఫరా ఆందోళనలు, ఉద్రిక్తతలతో చమురు ధరల పెరుగుదలకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో నౌకలపై దాడులు జరిగినట్లు వచ్చిన నివేదికలు, చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనలు మరింత పెంచాయి.

ALSO READ: భారీ ఖర్చు చేశాక పెళ్లి వాయిదా లేదా రద్దు అయిందా.. ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ ఉందిగా

ఇక మూడోది విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు పాల్పడడంతో ఒత్తిడి పెరిగింది. తాజా సమాచారం ప్రకారం.. అక్టోబర్‌లో విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌మార్కెట్ నుంచి సుమారు రూ. 52,100 కోట్లు ఉపసంహరించు కున్నారు. దీంతో ఈ ఏడాది అత్యంత భారీగా నిధుల ఉపసంహరణ నెలగా నిలిచింది. సెప్టెంబర్‌లో రూ. 35,861 కోట్ల ఉపసంహరణల తర్వాత ఈ అమ్మకాలు జరిగాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు, యూఎస్ బాండ్ల రాబడులు, బలపడిన డాలర్ కారణంగా దేశీయ మార్కెట్ నుంచి పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. దీని కారణంగా విదేశీ పెట్టుబడిదారులు షేర్లు అమ్మకాలకు పాల్పడినప్ుడు స్టాక్ మార్కెట్‌పై ఒత్తిడిని పెంచింది.

Related News

భారీ ఖర్చు చేశాక పెళ్లి వాయిదా లేదా రద్దు అయిందా.. ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ ఉందిగా

ఆస్తులు బోలెడున్నా చేతిలో నగదు ఉండదు.. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక కష్టాలను నివారించడానికి ఇలా చేయండి

పెళ్లిలో లభించిన బహుమతులుపై ట్యాక్స్ కట్టాలా? ఆదాయపు పన్ను నిబంధనలు ఇవే..

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

Big Stories

Advertisement
×